DYFI krishna district

DYFI krishna district Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DYFI krishna district, Social service, Krishna district, Vijayawada.

నూతన సంవత్సర శుభాకాంక్షలు.                       మీ          బాజీ బాబు తెల్లాకుల.
31/12/2023

నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ
బాజీ బాబు తెల్లాకుల.

18/11/2023
డ్రగ్స్ ,అవినీతి ,నిరుద్యోగం అంతం కోసం పోరాడుదాం డివైఎఫ్ఐ కృష్ణాజిల్లా కన్వీనర్ బాజీ బాబు తెల్లాకుల.
23/10/2023

డ్రగ్స్ ,అవినీతి ,నిరుద్యోగం అంతం కోసం పోరాడుదాం డివైఎఫ్ఐ కృష్ణాజిల్లా కన్వీనర్ బాజీ బాబు తెల్లాకుల.

కృష్ణాజిల్లా ఉయ్యూరు :- ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు cps,GPS రద్దు చేసి పాత పెన్షన్ విధ...
20/10/2023

కృష్ణాజిల్లా ఉయ్యూరు :- ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు cps,GPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని సాధించుటకు నిరవధిక దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులకు Dyfi నాయకులు బాజీ బాబు తెల్లాకుల సంఘీభావం తెలియజేశారు. ఉపాధ్యాయులు చేస్తున్న దీక్ష న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి వారి *cps, GPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి* లేని పక్షంలో ఉపాధ్యాయులతో పాటు DYFI తోడు గా ఉండి పోరాటం సాగిస్తామని ఈ సందర్బంగా డివైఎఫ్ఐ కృష్ణాజిల్లా కన్వీనర్ బాజీ బాబు తెల్లాకుల తెలియజేశారు.

*నిశ్శబ్ద శక్తిరూపం… పుస్తకం!**September 5,2023**A silent power house...the book!*📘📘📘📘📘📘📒📒📒📗📗📗📗📗పుస్తకం హస్తభూషణమే కాదు ...
06/09/2023

*నిశ్శబ్ద శక్తిరూపం… పుస్తకం!*
*September 5,2023*
*A silent power house...the book!*
📘📘📘📘📘📘📒📒📒📗📗📗📗📗
పుస్తకం హస్తభూషణమే కాదు మస్తిష్క వికాసం కూడా అని మనకు తెలుసు.పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు.జ్ఞాన భాండాగారంగా పూజించబడే పుస్తకాలను సరస్వతీ రూపాలుగా కొలుస్తాం.

పుస్తకం విశ్వాన్ని పరిచయం చేస్తుంది, వింతలు,విడ్డూరాలను విప్పి చూపుతుంది.పుస్తకం మానవాళి మేధోశక్తిని పోషిస్తుంది.పుస్తకం అక్షరాల కుప్ప కాదు,జ్ఞాన జ్యోతిని వెలిగించే ఇంధనం.

పుస్తకం మనో నేస్తం,సమాజోద్ధరణకు ఊతం.ప్రపంచాన్ని పరిచయం చేస్తూ,నూతన ఆవిష్కరణాగ్నికి ఆజ్యం పోసేది పుస్తక పఠనమే.లోక రీతు,శాస్త్ర ప్రగతులు,సాంకేతిక జిలుగులు,అజ్ఞానాన్ని పారద్రోలే మహోజ్వల వెలుగులను నింపగల మహా శక్తివంతమైంది పుస్తకమే కదా!

జ్ఞాన లోతులను పరిచయం చేస్తూ,ప్రపంచ సమస్యలకు సరైన సమాధానం ఇవ్వగల మేధో నిధి పుస్తకమే.పుస్తక ప్రాధాన్యతను గుర్తించి పుస్తక పఠనానికి జీవనశైలిలో సింహభాగం కేటాయించడాన్ని ప్రోత్సహించే కృషిలో భాగంగా ప్రతి యేటా 06 సెప్టెంబర్‌ రోజున ప్రపంచవ్యాప్తంగా ”జాతీయ పుస్తక పఠన దినోత్సవం (నేషనల్‌ రీడ్‌ ఏ బుక్‌ డే)” పాటించుట జరుగుతోంది.

గ్రంథాలయాల సందర్శన,వ్యక్తిగత గ్రంథాలయాన్ని నిర్మించుకోవడం,పుస్తక పఠన సంఘాలను ఏర్పాటు చేసుకోవడం,విలక్షణ పుస్తకాల సేకరణ చేసే అభిరుచిని కలిగి ఉండడం,స్నేహితులు పుస్తకాలను మార్చుతుంటూ చదువుకోవడం,పుస్తక పఠన ప్రాధాన్యతలను వివరించడం,పుస్తక పఠన పోటీల నిర్వహణ,పాఠశాలల్లో పుస్తక పఠనాన్ని ఆదరించడం,పుస్తకాన్ని జీవితకాల నేస్తంగా భద్రపరుచుకోవడం లాంటి అంశాలను జాతీయ పుస్తక పఠన దిన వేదికల్లో విద్యార్థుల ముందు చర్చించాలి.

1990లో హోవర్డ్‌ బెర్గ్‌ రికార్డు స్థాయిలో నిమిషానికి 25వేల పదాలు చదవడంతో అత్యంత వేగంగా చదివిన వ్యక్తిగా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నారు.సాధారణ పాఠకులు నిమిషానికి 300 వరకు పదాలు చదువగలుగుతారు.

అన్నీ జోన్స్‌ అనబడే పాఠకురాలు హారీ పోట్టర్‌ పుస్తకాన్ని నిమిషానికి 4,200 పదాల వేగంతో 47 నిమిషాల్లో చదివి ప్రపంచ పఠన బహుమతిని గెలుచుకున్నారు.మన పిల్లలు ఘనకార్యం చేసినప్పుడు ఓ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడాన్ని తల్లిదండ్రులు పాటించాలి.

పుస్తక పఠనాభిరుచితో మేధో వ్యాయామం జరిగి చురుకుగా తయారవుతారు.వాడవాడలా పుస్తక క్లబ్‌లు ఏర్పాటు చేయాలి.పుస్తకాలు అపూర్వ వినోద,విజ్ఞాన కోవెలలుగా భావించబడాలి.

పుస్తకాన్ని పదిమందికి అందుబాటులో ఉంచుట ద్వారా విజ్ఞాన వితరణకు దోహదపడిన వారమవుతాం.అది జ్ఞాపకశక్తిని పెంపొందించుట,ఏకాగ్రతను సాధించుట,మానసిక ఒత్తిడిని కలిగించకుండా చేస్తాయి.

ఇంకా జీవన సంక్లిష్టతలను అధిగమించడం,మేధావిగా రాణించడం,సృజనను పెంపొందించడం,జ్ఞాపకశక్తిని పెంచడం,అజ్ఞానాన్ని తరిమేయడం పుస్తక పఠనంతో కలుగుతాయి.

జీవన లక్ష్యాలను అధిగమించడం,జీవనోపాధిని పొందడం,కుటుంబ సభ్యులను విద్యావంతులుగా మార్చడం,సహానుభూతిని పోషించడం,నిద్ర సమస్యలు తొలగడం వంటివి జరుగుతాయి.

విద్యావంతుడిగా గుర్తింపు పొందడం,మెదడు చురుకుదనం పెరగడం,ప్రేరణ కలిగించడం,నైపుణ్యాలను పొందడం,పలు ప్రశ్నలకు సమాధానాలు లభించడం,మంచి స్నేహితులను పొందగలగడం లాంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి.

నేటి నానో,డిజిటల్‌ విప్లవయుగంలో పుస్తక పఠనాభిరుచి పలుచ బడుతోంది.చదవడం మానేసి టీవీ,గూగుల్‌ సైట్స్‌ చూసే కల్చర్‌ను అలవర్చుకుంటున్నారు.బుక్‌ కల్చర్‌ను నిర్లక్ష్యం చేస్తూ లుక్‌ కల్చర్‌కు అలవాటు పడుతున్నారు.

గూగులమ్మ కన్న పుస్తక సరస్వతే మిన్న అని విద్యార్థులకు వివరించాల్సిన అవసరం ఉంది.దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి.కానీ ఎక్కువసేపు పుస్తక పఠనం చేయాలి.

జ్ఞాన సంపదను తరతరాలకు అందజేస్తున్న పుస్తకాలు మనకు అపూర్వ ఆస్తులుగా నిలపాలి.పుస్తకాన్ని నమ్మినవారు,పునీతులైనారు.అక్షరాలు కొలువైన పుస్తకాలు సమాజ ప్రగతి రథాలుగా మారాలి.

ప్రపంచ మానవాళిని అక్షరాస్యులుగా,విద్యావంతులుగా మార్చగలిగే నిశ్శబ్ద శక్తిరూపం పుస్తకమే అని గమనించి పుస్తక పఠనాన్ని మహా యజ్ఞంగా కొనసాగించాలి.

*(నేడు ‘జాతీయ పుస్తక పఠన దినం’)*
*✍-డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి,*
*-9949700037*

05-09-2023*రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి* (DYFI) *డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో* నిరుద్యోగ సమస్యల పరిష్కరించ...
05/09/2023

05-09-2023
*రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి* (DYFI)
*డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో* నిరుద్యోగ సమస్యల పరిష్కరించాలని *కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిరుద్యోగ అభ్యర్థులతో సదస్సు నిర్వహించడం జరిగింది.*
ఈ కార్యక్రమానికి కృష్ణాజిల్లా డివైఎఫ్ఐ కన్వీనర్ బాజీ బాబు తెల్లాకుల అధ్యక్షత వహించారు.
*భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు*
*వై.రాము, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.నాగేశ్వరరావు మాట్లాడుతూ*
నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడం లో అటు కేంద్రం,ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు విఫలం చెందాయి అన్నారు.ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. .ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ,అంబానీ లకు దొచిపెడుతున్నరు .ఆంధ్ర రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారు.విభజన హామీలలో ప్రధానం కడప ఉక్కు ను ఇస్తా అన్నారు. .పార్లమెంటులో సాధ్యం కాదన్నారు.మన రాష్ట్రంలో పాదయాత్ర లో జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరుగుతూ అధికారులకు వస్తే రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు ఇంతవరకు ఒక్క డీఎస్సీ కూడా లేదు.గ్రూప్స్ నోటిఫికేషన్ లేదు,కొత్త జాబ్ క్యాలెండర్ లేదు. ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అన్నారు . *ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు విజయభాస్కర్ మాట్లాడుతూ శాంతియుతంగా గాంధీయ మార్గంలో మనం ఉద్యోగాలని సాధించుకున్నామని ఎస్ఎఫ్ఐ కలసి పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని అన్నారు . ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం, అక్షయ్ ,సాయి, ఎస్ఎఫ్ఐ కీర్తి, తదితరులు పాల్గొన్నారు.*

Address

Krishna District
Vijayawada
521165

Telephone

+919908153367

Website

Alerts

Be the first to know and let us send you an email when DYFI krishna district posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to DYFI krishna district:

Share

Category