ACG Andhra Pradesh

ACG Andhra Pradesh తెలుగుదేశం పార్టీ

06/04/2026

యాడికిలో ‘సాగునీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు

04/04/2026

కర్ణాటక సింధనూరులోని శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

04/04/2026

కర్ణాటక సింధనూరులోని శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

ఎంఎస్ఎంఈలకు భారీ ఊరట                                                       ------- పూచీకత్తు లేకుండానే రూ. 20 లక్షల వరకు...
23/03/2026

ఎంఎస్ఎంఈలకు భారీ ఊరట
-------
పూచీకత్తు లేకుండానే రూ. 20 లక్షల వరకు రుణం

విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారు అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు తెలిపారు.

చిన్న తరహా పరిశ్రమలకు ఊరటనిస్తూ, ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిబంధన 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.

ఏపీలో రుణాల జోరు
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 6.37 లక్షల ఎంఎస్ఎంఈలకు రుణాలు మంజూరైనట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 2,36,425 దరఖాస్తులు రాగా, అందులో కేవలం 17,667 మాత్రమే తిరస్కరించబడి, 2,18,758 మందికి రుణాలు అందినట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా మహారాష్ట్ర (15.76 లక్షలు), ఉత్తరప్రదేశ్ (11.97 లక్షలు), పశ్చిమ బెంగాల్ (11.69 లక్షలు), తమిళనాడు (11.51 లక్షలు) తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 6.37 లక్షల రుణాలు మంజూరైనట్లు వివరించారు.

ప్రధాన పథకాలు – ప్రయోజనాలు
కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం పలు పథకాలు అమలు చేస్తోంది:

ముద్రా యోజన ద్వారా రూ.20 లక్షల వరకు రుణం

పీఎం విశ్వకర్మ పథకం ద్వారా రూ.3 లక్షల వరకు రుణం (5% వడ్డీతో)

పీఎంఈజీపీ పథకం ద్వారా 15% నుంచి 35% వరకు సబ్సిడీ

అలాగే మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ పథకం ద్వారా రూ.100 కోట్ల వరకు ప్రాజెక్టులకు గ్యారెంటీ కవర్ కల్పిస్తున్నట్లు మంత్రి గారు తెలిపారు.

రుణాల మంజూరు వేగవంతం
ఎంఎస్ఎంఈలకు రుణాలు త్వరగా అందేలా కేంద్రం చర్యలు చేపట్టింది. రూ.25 లక్షల లోపు రుణాలపై 14 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. డిజిటల్ ఆధారిత క్రెడిట్ అసెస్‌మెంట్ మోడల్ (CAM) ద్వారా రుణ ప్రక్రియ మరింత సులభం కానుంది.

దరఖాస్తుల పెరుగుదలకు అవకాశం
తాజా నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎస్ఎంఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Kesineni Sivanath Sivanath Kesineni





తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని) గారు...నియోజకవర్గంలో రహదారుల అభి...
10/03/2026

తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని) గారు...

నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ఆర్ అండ్ బి శాఖ నుంచి రూ.8.70 కోట్ల సాస్కీ నిధులు విడుదల..

నిధుల మంజూరుకు ఆర్ అండ్ బి శాఖా మంత్రి బీసీ జనార్ధన రెడ్డిని గారిని కలిసి కృషి చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ గారు..

ఎంపీ గారి విజ్ఞాపనకు స్పందించి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తిరువూరు నియోజకవర్గం కు అత్యధిక నిధులు కేటాయింపు..

ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు బాటలు వేస్తున్నారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తిరువూరు ప్రాంత అభివృద్ధిపై, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రధానంగా నియోజకవర్గంలో దెబ్బతిన్న పలు రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు సంబంధిత రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని గారిని పలుమార్లు కలిసి విజ్ఞాపనలు అందజేశారు. గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన మంత్రి బిసి జనార్ధన రెడ్డిని గారిని సచివాలయంలో కలిసిన ఎంపీ కేశినేని చిన్ని గారు నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలో ప్రస్తుత రహదారులు, వంతెనల పరిస్థితిని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. శిథిలావస్థలో ఉన్న ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధాన మార్గాలు, వంతెనల మరమ్మతుల అవసరాన్ని వివరించారు. ప్రజలకు సులభ రవాణా సౌకర్యం అందించాలంటే తక్షణమే రహదారుల నిర్మాణాలు, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రోడ్లు కీలకమని , త్వరితగతిన పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అప్పట్లో మంత్రి గారిని సచివాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రహదారుల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు.

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి కృషితో తాజాగా నియోజక వర్గంలో పలు అభివృద్ధికి ఆర్ అండ్ బి శాఖ నుంచి రూ.8.70 కోట్ల సాస్కీ నిధులను మంత్రి జనార్దన్ రెడ్డి గారు మంజూరు చేస్తూ ప్రభుత్వపరంగా జీవో జారీ చేశారు. దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు ఆర్ అండ్ బి శాఖ ద్వారా మంజూరు చేసినట్లు ఎంపీ కేసినేని శివనాద్ ( చిన్ని) గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు . ఈ మేరకు ఎం.డి.ఆర్ అండ్ ఎస్.హెచ్ ప్రపోజల్స్ అప్‌గ్రేడేషన్ల కింద, రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల మెరుగుదలకు సంబంధించి నిధుల విడుదల చేస్తూ ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే తిరువూరు నియోజకవర్గానికి అత్యధికంగా రూ. 8.70 కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు.

మంజూరైన పనుల వివరాలు:
1. రూ.2.10 కోట్ల నిధులతో నందిగామ`పుట్రేల రోడ్డు, శ్రీరామ్‌పురం` పేరువంచ రహదారులను అభివృద్ధి చేయడం
2. రూ. 2.20 కోట్ల వ్యయంతో తిరువూరు ` తునికిపాడు రహదారి అభివృద్ధి
3. రూ. 2.40 కోట్ల నిధులతో శ్రీనికేతన్ ` కొత్తపల్లి రహదారి, కొత్తపాడు ` కాకర్ల రోడ్డు అభివృద్ధి
4. రూ. 30లక్షల వ్యయంతో కోటపాడు ` కాకర్ల రోడ్డు అభివృద్ధి
5. రూ. 30లక్షల వ్యయంతో గంపలగూడెం ` గోసవీడు రహదారి అభివృద్ధి
6. రూ. 25 లక్షల వ్యయంతో ఎంఎన్‌కె రోడ్డు ` పోలవరం రోడ్డు అభివృద్ధి
7. రూ. 25లక్షల వ్యయంతో మారెపల్లి ` కొత్తూరు (వయా) గున్నచింతలపాడు రహదారి అభివృద్ధి
8. రూ. 25లక్షల వ్యయంతో విస్సన్నపేట `లక్ష్మీపురం రోడ్డు నుంచి తెల్లాడవారపల్లి ` అమ్మపాలెం రోడ్డు అభివృద్ధి
9. రూ. 20లక్షల వ్యయంతో పుట్రేల ` కుంచిపర్తి (వయా) నర్మదానగర్ రహదారి అభివృద్ధి
10. రూ. 10లక్షల వ్యయంతో టిటి రోడ్డు ` టిఆర్ రోడ్డు ( లింకు రోడ్డు ) అభివృద్ధి
11. రూ. 35లక్షల వ్యయంతో చెన్నవరం ` మల్లవరం రహదారి అభివృద్ధి

మొత్తంగా 11 రహదారులకు కలిపి సుమారుగా 63 కిలో మీటర్ల మేర అభివృద్ధికి గానూ రూ.8.70 కోట్ల మేర నిధులను తిరువూరు నియోజకవర్గంకు కేటాయింపులు జరిగినట్లు తెలిపారు.

ధన్యవాదాలు::
తిరువూరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సంబంధిత మంత్రి జనార్దన్ రెడ్డి గార్లకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివ నాథ్ ( చిన్ని ) గారు ధన్యవాదాలు తెలిపారు. నిధుల కేటాయింపుతో రహదారుల సత్వర అభివృద్ధి జరిగి ప్రజలకు మేలు చేకూరుతుందని, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వపరంగా నిధులు కేటాయింపుల ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు సమకూరనున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్య రంగాలకు రహదారుల నిర్మాణంతో పురోగతి సాధ్యపడుతుందని, పార్లమెంటు నియోజకవర్గ పరిధి లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) గారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Kesineni Sivanath Sivanath Kesineni

16/11/2025

తెలుగు రాష్ట్రాలని రెండు కళ్ళుగా చూసే బాబు గారు!! 🔥💥🔥💥

తెలుగు రాష్ట్రాల సఖ్యత, బాగు కోరుకునే రేవంత్ రెడ్డి గారు!! 🙏🏻🙏🏻


12/10/2025

They Call Him CBN ✌️💥💥

07/08/2025
29/07/2025

సింగపూర్ నుండి ఏపీకి డైరెక్ట్ ఫ్లైట్..👌👌

19/02/2025

కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్.ఐ.ఆర్.డి సహకారంతో యువతకు శిక్షణ ... తొలి విడతగా హైదరాబాద్ లో ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ పూర్తైన‌ 33 మంది పంచాయితీ ఛాంపియన్స్ కు సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు మరియు ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ జనరల్ జి. నరేంద్రకుమార్ (ఐఏఎస్) గారు...

అనంతరం పంచాయతీ ఛాంపియన్స్ కు దిశా నిర్దేశం చేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు...

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when ACG Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share