25/08/2026
బాడ్మింటన్ కోర్టులో హోరాహోరీ పోరు… గెలుపే లక్ష్యంగా ప్రతిభల తలపడి!
తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా అండర్–17 డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల క్రీడాకారులను శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు గారు పరిచయం చేసుకున్నారు.
అనంతరం స్వయంగా టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించి, క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ప్రతి షాట్‌లో వేగం… ప్రతి పాయింట్‌లో ఉత్కంఠ… విజయం కోసం హోరాహోరీ పోరాటం!