19/03/2018
To,
The CM
CC: All Ministers
Sub: We demand justice
Respected Sir,
ఇండియా లో 70% వ్యవసాయం పై ఆధార పడ్డవారే , ప్రతి ఒక్కడు రైతు పైన పడి ఏడ్చే వాడే కాని (రుణ మాఫీ చేశారనో, సబ్సిడీ ఇస్తున్నారనో, )ఏం మేము ఏమి తక్కువ ఎందులో తక్కువ దేశాని కి అన్నం పెట్టేది మేమె . మాకు ఇస్తుంటె ఏడ్చే వాళ్ళ కి సమాధానం చెప్పా దల్చుకున్నా.
అంగన్ వాడి కార్యకర్తలను టీచర్లుగా ఎలా గుర్తించి 4,000 జీతం నుండి 10,000 జీతంగా పెంచారో
1,500 జీతం ఉన్న సర్పంచ్ జీతం 5,000 చేసారో ,
75,000 జీతం ఉన్న MLA జీతం 1,50,000 చేసారో.
టీచర్ల జీతాలని ఏ విదంగా పెంచారో..... మాక్కూడా అలాగే ఇవ్వండి .
లక్ష రూపాయల జీతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రోగం వస్తే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఫ్రీ , అతని పిల్లలకి ఫ్రీ , అతని భార్యకు ఫ్రీ మరియు అతని తల్లిదండ్రులకు కూడా ఫ్రీ.....వారికి ఆఫీస్ టైం 9AM to 4:30PM , కచ్చితంగా టైం to టైం వెళతాడు , వస్తాడు.
రాత్రనక , పగలనక , ఏ టైం లేకుండా , ఎప్పుడు పడితే అప్పుడు పొలానికి వెళ్లిన రైతు , తిరిగి వస్తాడో , లేదో తెలియక , ఇంటి దగ్గర ఎదురు చూసే భార్య , పిల్లలు , పంటకు రోగం , మనిషికి రోగం వస్తే ఎక్కడ చూపియ్య లో తెలియక , అప్పు చేసి , దిగుబడి తగ్గి కుంగిపోయే రైతులకు ఇస్తే ఫ్రీ అంటారు, ఉద్యోగులకు ఇస్తే ఇంక్రిమెంట్ అంటారు.
ప్రస్తుత గ్లోబలైజేషన్ గొడవల్లో పడి కనీసం వ్యవసాయానికి సరిఅయిన ఆదరణ కరువయ్యింది అనేది పచ్చి నిజం.ఎందుకంటె వ్యవసాయం చేసే యువకులకు పిల్లని ఇవ్వటానికి కూడా ఎవరూ రావటం లేదంటేనే పరిస్థితి ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు .(ఇది పరిస్థితి అని అనలేం ఇది ఇతర వృత్తులు చేసే వారి సంకుచిత భావాలకి ప్రతీక )
మరి రైతు లేనిదే రాజ్యం లేదు , రైతే రాజు , రైతు లేకుండా జీవించలేము ,జై జవాన్ జై కిసాన్ , రైతు ఏడ్చిన రాజ్యం లేదు , ఎద్దు ఏడ్చిన ఎవుసం లేదు అని చెపుతున్న
రాజకీయ నాయకుల్లారా , ఆలోచించండి .మేము ధర్నాలు బందులు జోలికి వెళ్తే జనాలు మల మల మాడి పోతారు .
అదీకాక వ్యవసాయం చేసే వాళ్లంటె చిన్న చూపు చులకన భావం. ఈ పరిస్థితి మారాలి .
మా డిమాండ్లని అమలు చేసి రైతుల్ని కాపాడతారో ...తిరుగుబాటు చెయ్యాల్సిన ఖర్మ తెచ్చు కుంటారో మీరే ఆలోచించుకోండి .
వ్యవసాయం చేసేవాళ్ళకి ప్రత్యేక రాయితీలు (non payable) ఇవ్వాలి .
రిటైర్ అయిన వ్యవసాయ దారుడికి అతని సేవలు గుర్తిస్తూ జీవితాంతం పెన్షన్ లు ఇవ్వాలి .
ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా పరిగణించి పంటలకి ఇన్సూరెన్సు వర్తింప చేయాలి.
వ్యవసాయదారులకు కొత్త టెక్నాలజీ మీద అవగాహన కల్పించి వాటిని వాడుకునేందుకు సరయిన మెకానిజం డెవలప్ చెయ్యాలి.
మా పిల్లలకి కార్పొరేట్ చదువులు అందకపోవటం వల్ల కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలతో పోటీ పడలేక పోతున్నారు ,అందుకోసం ప్రొఫెషనల్ కోర్సులు మరియు ఉద్యోగ నియామకాల్లో ప్రతి రైతు బిడ్డకి క్యాస్ట్ తో సంబంధం లేకుండా 20% రిజర్వేషన్ కల్పించాలి.
రైతు పండించి పంట పండించి న పంటకి రైతే ధర నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలి.
పంట పండించేందుకు అయ్యే ఖర్చు లకు గాను ఎకరాకు 10000 చొప్పున పెట్టుబడి సాయం అందించాలి .
రైతులకి స్టోరేజ్ అవసరాలకోసం గిడ్డంగులని నిర్మించుకోవడానికి వడ్డీ లేని రుణాలని అందించాలి .
రైతులు కొనే విత్తనాలు పనిముట్లు పైన టాక్స్ లను తీసెయ్యాలి.
రైతుల్ని మోసం చేసే దళారులపై టాడా చట్టాలని అమలు చెయ్యాలి.
దేశం లో పండే పంటలని వేరే దేశాల నుండి దిగుమతులు చేసుకోవటాన్ని నియంత్రించాలి .
వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ను సొంతం గా నెలకొల్పుకునేలా యువతని ప్రేరేపించాలి .
వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కి సంభందించిన మెషినరీ ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకున్నా ఎటువంటి టాక్స్ లు వసూలు చెయ్యరాదు.
సంప్రదాయ పద్దతులలో వ్యవసాయం చేసే వారికోసం స్పెషల్ బోనస్ లు ప్రకటించాలి .
ప్రతి సంవత్సరం ఉత్తమ రైతుల్ని ఎంపిక చేసి వారి వారి నైపుణ్యం మేరకు వారి సేవల్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి
వ్యవసాయ విద్య ని కూడా కార్పొరేట్ స్థాయి లో అభివృద్ధి చేయాలి. వ్యవసాయవిద్య అవసరం అయితే ఇతర దేశాలలో చదువుకోవటానికి కూడా ప్రభుత్వం సహాయం చెయ్యాలి.
అవసరమయినన్ని ప్రాజెక్టులు నిర్మించి నీటి కొరతలేకుండా చూడాలి .
సరే ...ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి పంట పండించి అమ్ముకోవటం లేదా అంటారా? అది కూడా చెప్తా చూడండి
పది ఎకరాల వ్యవసాయం వున్న రైతు విత్తనం వేసే దగ్గరనించి నాట్లు ,కలుపులు,కోత కోసి ,కుప్పలు నూర్చి ఇంటికి ధాన్యం చేర్చే వరకు వెయ్యి మందికి పైగా ప్రత్యక్షముగా ఉపాధి కలిపిస్తున్నాడు. అంటే180పనిదినాల్లో రోజుకి నగరికి కూలి (పరోక్షముగా నాలుగు కుటుంబాలకి )ఇచ్చి పోషిస్తున్నాడన్నమాట .అంతే కాక ఎరువులకి సగటున రెండు లక్షలు ఖర్చు పెడుతున్నాడు అంటే 20000 రూపాయలు పరోక్షము గా పన్నులు కడుతున్నాడు .వ్యవసాయ పరికరాల పేరుతో వ్యాపార రంగానికి కొంత వాటి రిపేర్ల పేరుతొ కొంత మందికి ఉపాధి కల్పిస్తున్నాడు .రైతు పేరు చెప్పుకునే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కంపెనీల గురించి చెప్పాలంటె ఎన్ని పేజీలైనా చాలవు .రుణాల/డిపాజిట్ల పేరుతో బ్యాంకులకు వ్యాపారం ఇచ్చేది రైతే. కరంటు మోటార్ల పేరుతో మోటార్ల కంపెనీలని విద్యుత్తు వినియోగం లోను రైతు తక్కువేమి కాదు .ఎవరయినా బ్యాంకులకు ఎగ్గొట్టి పోతారేమో కానీ రైతు ఎగ్గొట్టేది చరిత్రలో నే లేదని చెప్పొచ్చు. అంతెందుకు వ్యవసాయ ఆధారితం అయిన పశు పోషణ పాల ఉత్పత్తి ద్వారా దేశానికీ రైతు చేసే సేవ బోర్డర్ లో సైనికుడికి ఏ మాత్రం తీసిపోడనే చెప్పాలి.
మిత్రులారా మన హక్కుల్ని పోరాడి గెలుచు కొవ్సల్సిన టైం వచ్చింది . తప్పకుండ షేర్ చెయ్యండి . ప్రతి రైతు బిడ్డ వాల్ మీద ఉండాల్సిన పోస్ట్ ఇది. మనం లేకపోతె తిండి కి గతి లేనోడు మనల్ని వెక్కిరించే స్థాయి ఎక్కడినుంచి వచ్చింది . షేర్ చెయ్యండి ప్రశ్నించండి .
ఇట్లు
ఒక కడుపు మండిన రైతు బిడ్డ