AP CPI

AP CPI social media
(1)

24/08/2026

రాజకీయరంగంలో యువశక్తి Gen Z (CJP) ఉద్యమం అనే సెమినారులో మాట్లాడుతున్నా గుజ్జుల ఈశ్వరయ్య సిపిఐ.. Eswaraiah Gujjula

కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. వారు సీపీఎం నాయకులుగా వ్యవసాయ కార్మికసంఘా...
24/08/2026

కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. వారు సీపీఎం నాయకులుగా వ్యవసాయ కార్మికసంఘాలలో ముఖ్యపాత్రవహింహారు.
వారు కమ్యూనిస్టు మేధావి, వ్యవసాయ కార్మిక సమస్యలపై లోతయిన అవగాహనవున్న నాయకులు, వ్యక్తిగత సంబంధాలుకు ప్రాధాన్యతనిచ్చేవారు .
వారి మరణం సీపీఎం కేగాక వామపక్ష ఉద్యమానికి, పునాది వర్గానికి తీరని లోటు. వారిమరణం పట్ల ప్రగాఢ సంతాపం , వారి కుటుంబ సభ్యులకు నాసానుబుతి.
నారాయణ సీపీఐ

రాజకీయరంగంలో యువశక్తి Gen Z (CJP) ఉద్యమం అనే అంశం పైన విజయవాడ ,MBVK భవన్లో నిర్వహించిన సెమినార్ను  బీపీ మండల్ ట్రస్ట్ కమ...
23/08/2026

రాజకీయరంగంలో యువశక్తి Gen Z (CJP) ఉద్యమం అనే అంశం పైన విజయవాడ ,MBVK భవన్లో నిర్వహించిన సెమినార్ను బీపీ మండల్ ట్రస్ట్ కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కు ప్రధాన వక్తగా ఆహ్వానించిన మేరకు పాల్గొని ప్రసంగించిన Eswaraiah Gujjula సిపిఐ రాష్ట్ర కార్యదర్శి.

"దోపిడి అద్దాల్ని ప్రజలముందు నిలబెడదాం వాటిని పగల కొట్టే రాయిని Genzee , Zen Alpha చేతికి అందిద్దాం.

విద్యా, వైద్యం మన భారతదేశం అమ్ముతావుంది .

"నకిలీ జాతీయత, దేశభక్తి మాటను జి.జె.పి కార్పోరేట్, మతోన్మాద విధానాలు” అమలు చేస్తా ఉంది.

దేశలో ఆకలి, అవిద్య, అసమానతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దేశం అభివృద్ధి చెందిందని చెబుతున్న పాలకులకు 80 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ బియ్యం కోసం క్యూలో నిలబడి ఉంటున్న సంగతి మరుస్తున్నారు . 12 సంవత్సరాల్లో దేశాన్ని కార్పొరేట్లకు దాసోహం చేశారు.

దేశ సమస్యను ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్ర వేస్తున్నారు .

పహాల్గాం పుల్యామా ఘటనలు అందరూ ఖండించాల్సిందే. అదే సందర్భంలో దేశ భద్రతను కాపాడడంలో వైఫల్యం చెందిన విధానాన్ని తప్పక ప్రశ్నించాల్సిందే .

దేశభక్తి జాతీయతాన్ని నిత్యం నీతులు వల్లిస్తున్న బిజెపి, ఆర్ఎస్ఎస్ భారతదేశం సార్వ బహుమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్నది.

ఆపరేషన్ సింధూరను సీజ్ ఫైర్ అని ట్రంప్ చెప్పగానే నిలిపేసింది .... నరేంద్ర మోడీ, అమిత్షాలు గొప్ప దేశ భక్తులు .

నూతన జాతీయ విద్యా విధానం 2020 తో విద్యను కాసేకరణ చేయడంతో పాటు విద్య కార్పొరేట్ కరణకు రెడ్ కార్పెట్ పరిచింది.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తూ లక్షలాది ప్రభుత్వ విద్యాలయాలకు తాళాల వేస్తూ విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తున్నది.... బీజేపీ

అర కొర ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాల్లో ఉన్మాద భావాలను విద్యారంగంలోకి చొప్పించి విద్యార్థుల మెదళ్లను విషతుల్యం చేస్తున్నది .

నవంబర్ 26న రాజ్యాంగాన్ని చేతబట్టి విద్యార్థులతో మార్క్ కసెంబ్లీ నిర్వహించడం చాలా సులువే కానీ రాజ్యాంగం విలువలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం.

గుజ్జుల ఈశ్వరయ్య
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
+91 98495 75343




22/08/2026

భారత కమ్యూనిస్టు పార్టీ, అగ్రనేత మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర రెడ్డి గారి మొదటి వర్ధంతికి నివాళ్లు అరిపించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య

21/08/2026

జిల్లా వ్యాప్తముగా పెండింగ్ ప్రాజెక్టులు పరిశీలన,జీపు జాతలో CPI రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య..

21/08/2026
20/08/2026

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రెస్ మీట్..

విజయనగరం, జిల్లా పూసపాటిరేగ మండల విశాలాంధ్ర విలేకరి గోవింద్ పై భూ అక్రమార్కుల దాడిని ఖండిస్తున్నాం.

జర్నలిస్ట్ గోవింద్ పై దాడికి పాల్పడిన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి

రాష్ట్రంలో జర్నలిస్టులపై భూకబ్జాదారుల, రియల్, ఇసుక, మట్టి మైనింగ్ మాఫియాల అక్రమాలు, దాడులు మితిమీరిపోతున్నాయి.

జర్నలిస్టుల రక్షణకు, భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి.

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించి, ఫీజు రాయితీ ఇవ్వాలి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం-2009 సక్రమంగా అమలు జరగటం లేదు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ ద్వారా బాల బాలికలందరికీ విద్య ప్రాథమిక హక్కుగా ఉండాలి.

రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నాయి.

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల సరుకుల కొనుగోలు టెండర్లలో రూ.25 కోట్లు అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.

మార్కెట్ ధరలకన్నా దాదాపు 30% అధిక ధరలు వెచ్చించి సరుకులు కొనుగోలుకు కేజీబీవీ టెండర్లు ఖరారు చేయడం దుర్మార్గం

దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ ఫ్లాట్ ఫారంలలోని ధరలను ప్రామాణికంగా తీసుకోలేదు

10 నెలల కాలానికి బల్క్ గా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు సాధారణ రిటైల్ ధర కంటే ధర తగ్గాలేగాని పెరగకూడదు

డి మార్ట్ మెట్రో వంటి సంస్థల్లో కూడా సాధారణ రిటైల్ ధరల కంటే సుమారు 6 శాతం ధరలు తక్కువగా ఉంటాయి

బ్లింక్ఇట్, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ల ధరలు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సిన అవసరం ఎందుకు? డైరెక్ట్ గానే కొనుగోలు చేయవచ్చు కదా

కేజీబీవీ టెండర్లను అర్ధరాత్రి హడావుడిగా ఖరారు చేయటంతోపాటు అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

కేజీబీవీ సరుకుల అక్రమ టెండర్లను రద్దుచేసి, కొత్తగా టెండర్లు పిలిచి, పారదర్శకంగా నిర్వహించాలి.

లేనిపక్షంలో సిపిఐ తరఫున రాష్ట్ర వ్యాపిత ఆందోళన చేపడతాం.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల నిర్ణయంపై పలు అనుమానాలు ఉన్నాయి.

బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం జరపాలి.
- గుజ్జుల ఈశ్వరయ్య,
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

Address

CHANDRA RAJESWARARAO Road
Vijayawada
520004

Telephone

+917995009600

Website

Alerts

Be the first to know and let us send you an email when AP CPI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AP CPI:

Shortcuts

Share