07/11/2024
ఒకవైపు మీ యువ నాయకుడేమో అమెరికా వీధుల్లో కంపెనీలు తెస్తాను అంటూ తిరుగుతూ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఆ పనిలో అలిసిపోతున్నట్లు ప్రచారం రెండోవైపు ఒక రాష్ట్ర హోంమంత్రి లేస్తే మనిషినీ కాదు అన్న విధానం రెండూ విరుద్ధమైన విధానాలను ఒక్క మన రాష్ట్రంలోనే చూస్తున్నాము.
మీ రెండు పార్టీల కక్షాపూరిత వాతావరణంలో రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు అని మాలాంటి వాళ్ళ భాధ ఇక మీ పార్టీ అభిమానులకేమో గతం లో జగన్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ ని బులుగు గా మార్చాడు మనమెందుకు పోలీస్ డిపార్ట్మెంట్ నీ పసుపు గా మార్చి జగన్ రెడ్డి మాదిరి ప్రత్యర్థులను ఎందుకు జైలో పెట్టీ కుమ్మకూడదు అన్న ఆలోచన ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితి
పోలీసు వ్యవస్థకు మేము చెప్పదలుచుకున్నది ఈ రాజకీయ పార్టీలు ఒత్తిళ్ళను పక్కనపెట్టి భారత రాజ్యాంగం ప్రకారం కాకి చొక్కాలు వేసుకుని పని చేసినప్పుడే ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు తీసుకోవాలని అలాకాకుండా బులుగు పార్టీకి పనిచేస్తే బలుగు పార్టీ నుంచి జీతాలు,పసుపు పార్టీకి పనిచేస్తే ఆ పసుపు పార్టీ నుంచి జీతాలు తీసుకోండి అని ఆమ్ ఆద్మీ పార్టీ గా తెలియజేస్తున్నాము
మీ
నేతి మహేశ్వర రావు
ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్