Devineni Avinash

Devineni Avinash Vijayawada East Constituency Incharge,YSRCP || YSRCP President NTR Dist.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ స్థాయి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్  వ...
06/09/2026

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ స్థాయి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు పాల్గొన్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్‌,పకీర్ గూడెం నందు వైసీపీ నాయకులు నిర్వహించిన గంగానమ్మ జాతరలో ఎన్టీఆర్ జి...
06/09/2026

విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్‌,పకీర్ గూడెం నందు వైసీపీ నాయకులు నిర్వహించిన గంగానమ్మ జాతరలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

విజయవాడ బందరు రోడ్ లో శేషసాయి కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం...ఈ సమావేశంలో ప...
05/09/2026

విజయవాడ బందరు రోడ్ లో శేషసాయి కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం...

ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు,ఎమ్మెల్సీలు,మాజీ మేయర్,డిప్యూటీ మేయర్లు, రాష్ట్ర,జిల్లా స్థాయిలోని పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు...

సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, డివిజన్ల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు "గురు పరిరక్షణ దీక్ష"లో పాల్గొన్న వైసీపీ నేతలు...
05/09/2026

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు "గురు పరిరక్షణ దీక్ష"లో పాల్గొన్న వైసీపీ నేతలు...

ఉపాధ్యాయ పదానికి పర్యాయ పధంగా నిలిచి,భారత రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు అలంకరించిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ...
05/09/2026

ఉపాధ్యాయ పదానికి పర్యాయ పధంగా నిలిచి,భారత రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు అలంకరించిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ,వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన  శ్రీ కృష్ణాష్...
04/09/2026

ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనాలు అందుకుని శుభాకాంక్షలు తెలియజేసారు,అనంతరం అన్న వితరణ చేయడం జరిగింది..

వసుదేవ సుతం దేవం కంస చాణుర మర్ధనందేవకై పరమానంద కృష్ణం వందే జగద్గురుం.భగవాన్ శ్రీ కృష్ణుడు బోధించిన సత్యం,ధర్మం,న్యాయం, న...
04/09/2026

వసుదేవ సుతం దేవం కంస చాణుర మర్ధనం
దేవకై పరమానంద కృష్ణం వందే జగద్గురుం.

భగవాన్ శ్రీ కృష్ణుడు బోధించిన సత్యం,ధర్మం,న్యాయం, నైతిక విలువలే స్పూర్తిగా..సకల జనుల క్షేమమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ..

మీకు మీ కుటుంబసభ్యులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

*నవాబుపేటలో ఘనంగా డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి కార్యక్రమం**జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబుపేట గ్రామంలో వై.య...
02/09/2026

*నవాబుపేటలో ఘనంగా డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి కార్యక్రమం*

*జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబుపేట గ్రామంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గింజుపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిధి గా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు పాల్గొన్నారు*.

*ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక నియోజకవర్గ ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ గారి గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు*..

*అనంతరం మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.*

*పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు.*

తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని డివిజన్ లలో వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి  సందర్భంగా డివిజన్ నాయకులు ఆధ్వర...
02/09/2026

తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని డివిజన్ లలో వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా డివిజన్ నాయకులు ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,పండ్లు అన్నదానం చేసిన డివిజన్ నాయకులు,కార్యకర్తలు..

*ప్రెస్ నోట్-02-09-2026**విజయవాడ**మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ...
02/09/2026

*ప్రెస్ నోట్-02-09-2026*
*విజయవాడ*

*మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్*

*దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు:ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్*

*జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా, దాదాపు 100 మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు*.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రజలకు పరిచయం చేసి, సంక్షేమానికి రథసారధిగా నిలిచిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారేనని కొనియాడారు. జలయజ్ఞం ద్వారా రైతులకు సాగునీరు, తాగునీరు అందించిన మహోన్నత వ్యక్తి ఆయన అని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సర్వీసులు, పోలవరం, పులిచింతల, వెలిగొండ ప్రాజెక్టులు వైఎస్సార్ గారి దార్శనికతకు నిదర్శనాలని పేర్కొన్నారు.వైఎస్సార్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, చేయూత, ఇంగ్లీష్ మీడియం విద్య, ఆసరా వంటి పథకాల ద్వారా ప్రతి ఇంట సంక్షేమాన్ని అందించారని తెలిపారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైఎస్సార్, జగన్‌మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టులను, పథకాలను కూటమి ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటూ అబద్ధాలు చెప్తోందని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వెన్నుపోటు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్ లలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,నాయకులు ఘనంగా నివాళులు అర్పించి సేవా సేవా కార్యక్రమాలు నిర్వహించారు అని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా, 2029 సాధారణ ఎన్నికల్లో అయినా రాష్ట్ర ప్రజల మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని, వైఎస్సార్ ఆశయ సాధనకు, జగన్‌మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సైనికుల్లా పనిచేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్,రాష్ట్ర కార్యదర్శి లు,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ ప్రెసిడెంట్లు,రాష్ట్ర, జిల్లా,నియోజకవర్గ,డివిజన్ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

Address

48/4/16, Ashok Garden, Gunadala
Vijayawada
520004

Website

Alerts

Be the first to know and let us send you an email when Devineni Avinash posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Devineni Avinash:

Shortcuts

Share