OBC Morcha Andhra Pradesh

OBC Morcha Andhra Pradesh భారత్ మాతా కి జై
Nation First - Party Second - Self Last

20/01/2026
11/01/2026

ఇది ఒక సాధారణ తేదీ కాదు…
ఇది రేనాటి నేల గర్వించాల్సిన రోజు…
స్వతంత్ర సమర వీరుడు వడ్డే ఓబన్న జన్మించిన పవిత్ర దినం.
సంచార జీవితం గడిపిన వడ్డెర కులంలో పుట్టి,
దేశ స్వేచ్ఛ కోసం నిలబడిన సింహం ఆయన.
రాయి మోసిన చేతులతోనే
బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వణికించిన విప్లవం ఆయనది.
బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి
రేనాటి పాలెగాళ్లు అధికారాన్ని అప్పగించినప్పుడు,
ఆ తవర్జీ అనే అవమానకర ఒప్పందమే
ఈ నేలపై తిరుగుబాటుకు నిప్పు రాజేసింది.
ఆ నిప్పును అగ్నిపర్వతంగా మార్చినవాడు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,
ఆ అగ్నిపర్వతానికి సైన్యాధ్యక్షుడిగా
ప్రాణం పెట్టి పోరాడినవాడు
మన వడ్డే ఓబన్న!
భయం ఎరుగని వడ్డెర్లు…
వీర బోయలు…
అడవుల కుమారులు చెంచులు…
ఈ సంచార తెగలన్నిటిని ఒక సైన్యంగా మలిచిన వ్యూహకర్త ఓబన్న.
దట్టమైన నల్లమల అడవుల్లో,
కుంఫనీ సైన్యం అడుగు వేయలేకపోతే,
అది ఒబ్బన్న నాయకత్వమే!
బ్రిటిష్ సైన్యం ఊచకోతకు గురై,
ప్రాణాలు కాపాడుకోవడానికి ఉరుకులు పెట్టిందంటే,
అది మన వీరుడి పోరాట శక్తే!
నరసింహారెడ్డికి
కేవలం అనుచరుడు కాదు…
అతని కవచం…
అతని ఖడ్గం…
అతని ప్రాణ రక్షకుడు వడ్డే ఓబన్న.
తన నాయకుడిని,
అతని కుటుంబాన్ని కాపాడేందుకు
తన ప్రాణాలనే తృణప్రాయంగా భావించిన
త్యాగశీలి ఆయన.

చరిత్ర పుస్తకాల్లో ఒక పథకం ప్రకారం మనకు చాలా అన్యాయం జరిగింది ఒక వీరుణ్ని చరిత్రలో తక్కువ చేయడం
కేవలం వడ్డెర జాతికి చేసిన అన్యాయం కాదు బిసి బడుగు బలహీన వర్గాల సమాజానికే చేసిన ద్రోహం.

ప్రియతమ భారత ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భారత స్వావలంబన లో భాగంగా అమృత్ మహోత్సవంలో మన ధైర్యాన్ని మన గర్వాన్ని ప్రపంచానికి చెప్తున్నాం. ఇది ఒక ఆరోగ్యకరమైన చైతన్యం. స్వావలంభనలో లో ఇటువంటి నిర్ణయాలు బడుగు, బలహీన వర్గాలకు గౌరవం తీసుకొచ్చే చరిత్రాత్మక నిర్ణయాలుగా నిలుస్తున్నాయి.

అందుకే ఈ రోజు,
మనం వడ్డే ఓబన్న జయంతిని
ఘనంగా జరుపుకుంటున్నాం.
ఆయన త్యాగాలను
భావి తరాలకు స్ఫూర్తిగా నిలపాలని
ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం అధికారికంగా ఓబన్న గారి జయంతి నిర్వహించుకుంటుంది.

• ఓబన్న చరిత్ర కాదు…
ఓబన్న పోరాటం!
• ఓబన్న వ్యక్తి కాదు…
ఓబన్న ఉద్యమం!

జోహార్ స్వతంత్ర సమర వీరా!
జోహార్ వడ్డే ఓబన్నా!

11/01/2026
11/01/2026

ఈరోజు చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో ఒడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఆయనకి పటాన్ని పెట్టి పూలమాలతో అలంకరించి పూజలు చేసి ఆయన యొక్క గౌరవాన్ని, ఆయన సమరయోధుడుగా ఉండి అతని చేసినటువంటి సేవలు కూడా తలుచుకుంటూ , ఆయన ధీరుడు వీరుడు , కండగలిగినటువంటి గుండె గలిగినటువంటి దీరుడు,వీరుడు దీరుడుగా ఉండి ఆనాడు ఆంగ్లేయుల పరిపాలనలో జరిగినటువంటి పన్నులు ఆధిక్యతను సహించలేకుండా పనులను కట్టకుండా ఆఫ్ చేసి ఆంగ్లేయలను ఎదుర్కొన్నటువంటి వీరునికి విజయపురం మండల, చిత్తూరు జిల్లా తరఫున ఘన నివాళు అర్పించారు. చిత్తూరు జిల్లా BJP ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బి కైలాసం గారు, BJP విజయపురం మండలం అధ్యక్షుడు N.రాము గారు, సర్పంచ్ యుగేందర్ రాజు, సీనియర్ నాయకులు పురుషోత్తమ రెడ్డి, కార్యకర్తలు , శ్రీనివాసరాజు గిరి పాల్గొన్నారు

Address

Boyapativari Street
Vijayawada
520002

Telephone

+916281167930

Website

Alerts

Be the first to know and let us send you an email when OBC Morcha Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to OBC Morcha Andhra Pradesh:

Share