22/06/2026
*తాడేపల్లి ముస్లిం స్మశాన వాటికలో అభివృద్ధి పనులు పూర్తి*
*సొంత నిధులతో సౌకర్యాలు కల్పించిన మంత్రి నారా లోకేష్‌కు ముస్లిం కుటుంబాలు, మత పెద్దల కృతజ్ఞతలు*
తాడేపల్లి, జూన్ 22: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో తాడేపల్లి మండలం పోలకంపాడులోని ముస్లిం స్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ముస్లిం సోదరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మశాన వాటికలో పలు మౌలిక సదుపాయాలను కల్పించారు.
స్మశాన వాటికలో ప్రహరీ గోడ నిర్మాణం, ముఖద్వారం,ఆరు మినార్ ల ఏర్పాటు,వజూ ఖానా, గ్రీనరీ, ఆఫీస్ రూమ్, స్టోర్ రూమ్, వాచ్ మాన్ రూమ్,, ఐమాక్స్ లైటింగ్ పోల్,మౌళిక సదుపాయాలు,విశ్రాంతి కోసం సిమెంట్ బల్లలు వంటి పనులను పూర్తి చేశారు. 80 ట్రక్కుల మట్టితో లెవెలింగ్ చేయించారు దీంతో అంతిమ సంస్కారాలకు వచ్చే కుటుంబ సభ్యులకు అన్ని విధాలా సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడిందని స్థానికులు తెలిపారు.
మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోని స్మశాన వాటికలను అభివృద్ధి చేయడంపై స్థానిక ముస్లిం కుటుంబాలు, మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి మనిషి జీవితంలోని అఖరి మజిలీ అయిన అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో మంత్రి నారా లోకేష్ ఈ అభివృద్ధి పనులు చేపట్టడం సంతోష కరమైన విషయమని తెలిపారు
ముస్లిం సమాజం అవసరాలను గుర్తించి స్మశాన వాటికను అన్ని హంగులతో అభివృద్ధి చేయించిన మంత్రి నారా లోకేష్‌కు స్థానిక ముస్లిం కుటుంబాలు, మత పెద్దలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
*****************