07/09/2026
ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారధి....
వినాయక చవితి ఉత్సవాల అనుమతుల ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలి
శ్రీకాకుళం, సెప్టెంబర్ 7, 2026: ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటికి పరిష్కారం లభించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారి సూచన మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వీకరించారు.
వినాయక ఉత్సవాల అనుమతులపై వినతిపత్రం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సింగిల్ విండో విధానం ద్వారా వినాయకఉత్సవాల అనుమతుల ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఒకే దరఖాస్తు ద్వారా పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవిన్యూ తదితర శాఖల సమన్వయంతో అనుమతులు పొందే విధానం ఉత్సవ కమిటీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
అయితే క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో ఉత్సవ కమిటీలు అనవసర జాప్యం, పలు శాఖల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, అస్పష్టమైన నిబంధనలు, చివరి నిమిషంలో విధించే షరతులు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేలా కింది చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలోని ప్రధాన అంశాలు:
🔸 సింగిల్ విండో విధానాన్ని అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా అమలు చేయాలి.
🔸 ఉత్సవ కమిటీలకు అనుమతుల ప్రక్రియపై స్పష్టమైన మార్గదర్శకాలు, అవసరమైన పత్రాల వివరాలను ముందుగానే తెలియజేయాలి.
🔸 పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవిన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
🔸 అనుమతుల కోసం ఉత్సవ కమిటీలు పలు శాఖల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని నివారించాలి.
🔸 అనవసర జాప్యాన్ని నివారించి, దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి.
🔸 చివరి నిమిషంలో అస్పష్టమైన షరతులు విధించకుండా, ముందుగానే స్పష్టమైన నిబంధనలను తెలియజేయాలి.
🔸 భక్తులు, ఉత్సవ కమిటీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా అధికారులు సహకరించాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, జనతా వారధి కన్వీనర్ చింతు పాపారావు గారు, జనతా వారధి కో-కన్వీనర్ యర్రగుంట్ల జగన్ మోహన్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు బైరి అప్పారావు గారు, జిల్లా యువమోర్చా అధ్యక్షులు ధన్నాన మదన్మోహన్ గారు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బడే తాతారావు గారు, యువమోర్చా జిల్లా కార్యదర్శి శేషగిరి గారు, బీజేపీ సీనియర్ నాయకులు సాధు కిరణ్ గారు, పండి యోగేశ్వరరావు గారు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు అడ్నాల భాగ్యవతి గారు తదితరులు పాల్గున్నారు...