02/09/2026
🙏 డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు 🙏
మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ బోయపాటి రామాంజనేయులు గారు.
ఈ సందర్భంగా బోయపాటి రామాంజనేయులు గారు మాట్లాడుతూ, డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించిన సేవలను, పేదలు, రైతులు, మహిళలు మరియు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను స్మరించుకున్నారు. ప్రజల హృదయాల్లో వైఎస్సార్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ కరీముల్లా ఖాన్ గారు, పల్నాడు జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రెడ్డిబోయిన ప్రసన్న గారు, పల్నాడు జిల్లా అసంఘటిత కార్మిక అధ్యక్షులు పిడుగు విజయ్ గారు, శావల్యాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిరువీధి నాగేశ్వరరావు గారు, శావల్యాపురం యూత్ కాంగ్రెస్ ఇషాక్ గారు, కారుమంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నాలు గారు, కూచి వెంకటేశ్వర్లు గారు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రామాదేవి గారితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🌹 మహానేత వైఎస్సార్ గారి సేవలు చిరస్మరణీయం.
🌹 వైఎస్సార్ గారి ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుంది.