ITDP GVMC Pendurthi

ITDP GVMC  Pendurthi male

14/06/2024
30/09/2023








Good morning
17/09/2023

Good morning

13/09/2023

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవ *శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారి *అక్రమ రిమాండ్* ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ పెందుర్తి కార్యాలయంలో టిడిపి ఫ్లోర్ లీడర్ *పీలా శ్రీనివాస రావు* గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి *బాబుతో నేను* అను *ప్ల-కార్డ్* లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదేవిదంగా *బాబు గారికి తోడుగా...నియంతతో పోరాటానికి మేము సైతం* అని నినాదాలు చేశారు. పీలా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ *చంద్ర బాబునాయుడు గారి పైన కక్షతో జగన్ రెడ్డి ఏ తప్పు లేకపోయినా బాబు గారి పైన దొంగ కేసులు పెట్టి రిమాండ్ లో పెట్టారన్నారు. తప్పు చేయలేదు కాబట్టే ఇప్పటి వరకు బెయిల్ పీటీషన్ వేయలేదని, క్వాష్ పిటిషన్ మాత్రమే వేశారన్నారు. ఈ కేసు నుండి కడిగిన ముత్యంలా బాబు గారు వస్తారని, ప్రజలన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బాబు గారిని ముఖ్యమంత్రిని చేస్తారన్నారు*.
కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పరమేశ్వరరావు , మండల అధ్యక్షులు కరక దేవుడు,ఐ టిడిపి ఇంచార్జ్ 96వ వార్డ్ యువత అధ్యక్షుడు పీలా జితేంద్ర,ప్రధాన కార్యదర్శి బండారు నాగు, జిల్లా కార్యదర్శి ఆళ్ల రమేష్,నగేష్, క్లస్టర్ ఇంచార్జ్ పెంటకోట రాజేంద్రప్రసాద్, కిల్లి రమేష్, వానపల్లి నరసింగరావు , పెంటకోట శ్రీను ,చంద్రమౌళి, రాంబాబు నావేటి శీను, ఆళ్ల జగదీష్ పాల్గొన్నారు

01/09/2023
24/08/2023

యువగళం జైత్ర యాత్రలో లోకేష్ గారితో మరొక మరపురాని రోజు పూర్తిచేసుకుని ఇంటికి చేరాను !!
Nara LokeshTelugu Desam Party (TDP)

పెరిగిపోతున్న ధరల భారంతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుని 'భవిష్యత్తుకు గ్యారెంటీ'లో మహాశక్తి పథకానికి చంద్...
24/08/2023

పెరిగిపోతున్న ధరల భారంతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుని 'భవిష్యత్తుకు గ్యారెంటీ'లో మహాశక్తి పథకానికి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. అంటే సరాసరిన కుటుంబానికి ఏడాదికి 4 వేల రూపాయల వరకు ఆదా కాబోతోంది.

Jai lokesh
24/08/2023

Jai lokesh

నా తండ్రి పోయాడు... తను ముఖ్యమంత్రి..నన్ను కూడ ముఖ్యమంత్రిని చేయండని చేస్తున్న పాదయాత్ర కాదు.....నా అన్నను జైలులో పెట్టా...
21/08/2023

నా తండ్రి పోయాడు... తను ముఖ్యమంత్రి..
నన్ను కూడ ముఖ్యమంత్రిని చేయండని చేస్తున్న పాదయాత్ర కాదు.....

నా అన్నను జైలులో పెట్టారు... నేను అతను వదిలిన బాణాన్ని,అతని ముఖ్యమంత్రిని చేయండని చేస్తున్న పాదయాత్ర కాదు....

నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయండి అంటు బుక్ పట్టుకొచ్చి సమర్ధించే తల్లి ఉన్న స్వార్ధపు పాదయాత్ర కాదు ఇది.....

నాభర్తకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటు పుంఖా పుంఖాలు వార్తలు వండి వార్చగలిగిన మీడియా గల భార్య ఉన్న పాదయాత్ర కాదు....

ఒక కులం స్వార్ధంతో గుడ్డిగా సమర్ధించిన పాదయాత్ర కాదు... నా పై కేసులున్నాయ్ వాటినుండి బయటపడాలి నన్ను రక్షించండని వేడుకునే పాదయాత్ర కాదు.....

పేదవాడి ఇంట్లో తినకపోయినా తిన్నట్టు నటన లేదు.... పెయిడ్ ఆర్టిస్ట్ ల అవసరం లేదు....

తండ్రిని గుర్తు తెచ్చేలా అహభావాలతో నటన
ఆఘీకం.. వచనం లేదు... సాధారణ ప్రజల ప్రశ్నలకు ప్రామ్టింగ్ లేదు...

కోట్లకు కోట్లు కుమ్మరించి పెట్టికున్న ఐ ప్యాక్ టీం లేదు.... తన కోసమో... తన రాజకీయ భవిష్యత్తు కోసమో చేస్తున్నది కాదు ఈ పాదయాత్ర....

స్వంత పార్టీ నాయకులలోనే అనుమానంతో మొదలైన పాదయాత్ర.... పెద్ద అంచనాలు లేకుండా మొదలైన పాదయాత్ర అంచనాలను తలక్రిందులు చేసిన పాదయాత్ర....

హేళన నుండి ఓటమి తొలి అడుగుగా మొదలైన
పాదయాత్ర... నేడు ఉప్పెను తలపిస్తున్న పాదయాత్ర...

ముసలి... పిల్లా... అనే భేదం లేకుండా తెల్లవారుఝాము వరకు ప్రజలు ఎదురు చూసేలా చేసిన పాదయాత్ర....

పేద ప్రజల కోసం... అణగారిన వర్గాల ఉన్నతి కోసం... బడుగు జీవుల భవిత కోసం.... బలహీన వర్గాల మేలు కోసం....

రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి.... రాజధాని పొలాల త్యాగధనుల గురించి... దాడులు ఎదుర్కుంటున్న దళితుల గురించి.... ఉపాధి కోల్పోతున్న యువత గురించి... ఉనికి కోల్పోయిన ఉద్యోగుల సమస్యల గురించి... వెనుకబడిన వివిధ రంగాల గురించి... అధిక పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి కుటుంబాల గురించి... మాయ మాటలతో మోసపోయి ఒక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి కష్టం గురించి జరుగుతుంది ఈ పాదయాత్ర....

తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి అనే వారిని చూశారు....

మా తాత ప్రజలకు మేలు చేశాడు... నేను అది కొనసాగించడానికి వచ్చా అనే వాడిని తొలిసారి చూస్తున్నారు...


Address

96th Ward Pendurthi
Visakhapatnam
531173

Alerts

Be the first to know and let us send you an email when ITDP GVMC Pendurthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share