05/08/2022
*గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉండే హక్కు నీకు లేదు.. విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు గారు*
ఈరోజు విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు గారి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ వీడియో కాల్ లో నగ్నంగా మాట్లాడినటువంటి అసభ్యకర వీడియో మీద స్పందిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో పల్లా,శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఉన్నపలంగా గోరంట్ల మాధవ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అలాగే వై ఎస్ ఆర్ సిపి పార్టీ వాళ్లకి చిత్తశుద్ధి ఉంటే పార్టీ పరంగా తీసుకోవలసిన చర్యలను తక్షణమే తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని , ఒక ప్రజా ప్రతినిధిగా ఉండే నైతిక హక్కు మాధవకు లేదని ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడిన గోరంట్ల మాధవను వెంటనే ప్రభుత్వపరంగా శిక్షించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో *భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు గారు* అలాగే విశాఖ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది.