28/08/2025
VIZAG DIARIES 🇮🇳
Follow
CREDITS TO : Story behind the clicks
నా స్నేహితులతో తో కలిసి అరకు కి బైక్ మీద వెళ్ళాం Jan 2023 లో.. అరకు లో ఒక రాత్రి స్టే చేశాం. పొద్దున్నే వంజంగి హిల్స్ కి వెళ్లి సూర్యోదయం చూడాలని ప్లాన్. కానీ ఆ రాత్రి అంతా కబుర్లు… నవ్వులు… సరిగ్గా నిద్ర లేకుండా గడిచిపోయింది.
పొద్దున్నే లేవగానే విపరీతమైన తలనొప్పి. వెళ్తామా లేదా అని సందేహంతోనే టెంట్ లో చాలాసేపు పడుకున్నాను. తలనొప్పి తగ్గేలా లేదని చివరికి ఓ టాబ్లెట్ వేసుకుని బయలుదేరాం.
బైక్ మీదుగా తాకిన చల్లని మంచు గాలి… ఆ తలనొప్పిని వెంటనే తీసుకెళ్లింది. అంతే… ఆ ప్రయాణం తిరుగులేని మాయలా మారిపోయింది.
కొంచెం వెలుతురొచ్చేసరికి, మా బ్యాచ్ అంతా పాడేరు రోడ్డు లో ఫోటోలు తీసుకుందామని రోడ్డుపై ఆగాం. అప్పుడు ఈమె రోడ్డు పైకి ఒక్కసారిగా అలా వచ్చారు…
ఒక సాదాసీదా దుప్పటులో… తల మీద నాలుగు బిందెలతో, పొగమంచును చీల్చుకుంటూ నడుస్తూ… నిశ్శబ్దంగా వస్తూ ఉంది..
ఆమెను చూసిన వెంటనే నా కెమెరా తో ఇలా బంధిచాను ఆవిడను చూస్తే… “ఏమిటి ఈ బలం? నాలుగు బిందెలతో నీటిని అంత సులువుగా ఎలా మోస్తుంది?” అనిపించింది.
అయితే నీటిని కాదు… ఆమె మోస్తున్నది జీవితపు బాధ్యత. ప్రతి అడుగులో… గ్రామీణ జీవితం స్పష్టంగా కనిపించింది.
[ Vizag, r k beach, love vizag, beach, visakhapatnam]
Tag
All copyrights of pictures and contents to the respected owners
Note 📝:DM FOR REMOVAL 🙏
[Hyderabad, Visakhapatnam, New Restaurant Vizag, New Vizag Restaurant, New Cafe in Vizag, Vizag New Cafes, Luxury Stay in Vizag,Vizag Food Vlogs,Latest Vizag Food, Best cafe in Vizag, Hotels in Vizag, Budget Hotel in Vizag, Street Food in Vizag,Eggly in Vizag,Best Buffet in Vizag, Latest Vizag Food vlogs, Budget Meals in Vizag, Budget Meal,Healthy tiffins in Vizag]