Karanam Kumar

  • Home
  • Karanam Kumar

Karanam Kumar Gudivada Amarnath ❤️💪

07/08/2026

❤️😍

02/08/2026

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూములు సేకరించింది.. నిర్వాసితులకు పునరావాసం కల్పించింది.. రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది.. అన్నీకూడా గారి ప్ర‌భుత్వ హ‌యాంలోనే. వాస్తవాలు ఇవే:

* జూన్ 2020లో జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం.
* భూసేకరణ, ఆర్ & ఆర్ పూర్తి చేయడం.
* సైట్ క్లియరెన్స్, అన్ని NOCలు, భద్రతా అనుమతులు సాధించడం.
* నీరు, విద్యుత్, అంతర్గత రోడ్లు, ఏరోనాటికల్ సేవలు, ఆర్థిక సమీకరణ వంటి మౌలిక ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం.

ముఖ్యంగా, మీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన భూసేకరణను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేసి, నిర్వాసితులైన నాలుగు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించింది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం:

* భూసేకరణ & ఆర్ & ఆర్ – ₹967 కోట్లు
* నీటి సరఫరా – ₹75 కోట్లు
* మౌలిక సదుపాయాలు – ₹134.5 కోట్లు
* ప్రత్యామ్నాయ రోడ్లు – ₹7.29 కోట్లు
* సబ్‌స్టేషన్ – ₹2.35 కోట్లు

మొత్తం సుమారు ₹1,200 కోట్లకు పైగా ప్రజా ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టి, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.

కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూనే పనులను ఆపకుండా కొనసాగించి, 2024 ఎన్నికల నాటికే రన్‌వే పనులను కీలక దశకు చేర్చడంతో పాటు టెర్మినల్ నిర్మాణాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్ గారి ప్రభుత్వానిదే.
ఇదంతా మీ ఘనత అని చెప్పుకోవడం క్రెడిట్ చోరీ చేయడం కాదా గారూ?

14/07/2026

కాపు ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన మహానేత, మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మా కుటుంబానికి అత్యంత ఆప్తులు, గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణవార్త హృదయాన్ని కలచివేసింది.

ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, సమాజానికి అందించిన సేవలు, ఆయన వ్యక్తిత్వం ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని జీవితాంతం మర్చిపోలేను. ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది.

వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ఈ తీవ్రమైన విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

ఓం శాంతి.

13/07/2026
నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న గుడివాడ గురునాధరావు గారు.ప్రజల పట్ల ప్రేమ, సేవ పట్ల అంకితభావం,...
21/06/2026

నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న గుడివాడ గురునాధరావు గారు.

ప్రజల పట్ల ప్రేమ, సేవ పట్ల అంకితభావం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడటం — ఇవన్నీ నాన్న నాకు నేర్పిన విలువలు. ప్రజల కోసం జీవించడం అంటే ఏమిటో ఆయన జీవితం నాకు చూపించింది.

ఆయన చూపిన మార్గం, ఆయన ఆచరించిన సిద్ధాంతాలు, ఆయన అందించిన స్ఫూర్తి ప్రతిరోజూ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ప్రజల కోసం మరింత బాధ్యతతో పనిచేసే శక్తిని ఇస్తున్నాయి.

ఫాదర్స్ డే సందర్భంగా నాన్న గుడివాడ గురునాధరావు గారిని ప్రేమతో, గౌరవంతో స్మరించుకుంటూ…

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Karanam Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed Government Service?

Share