04/08/2026
గాజువాక నియోజకవర్గం జోగవానిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర మీడియా పేనలిస్ట్ Dr. Karanamreddi Narasingarao Knr
విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని జోగవానిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు (కేఎన్ఆర్) సందర్శించారు. కేంద్రంలో పిల్లలకు అందుతున్న సేవలు, పోషకాహారం, పరిశుభ్రత, మౌలిక వసతుల పరిస్థితిని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, ప్రాథమిక విద్య, పోషకాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. పిల్లలకు పాలు , గుడ్లు, బాలామృతం వంటి నాణ్యమైన పోషకాహారం, గర్భిణులు మరియు బాలింతలకు అవసరమైన పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని అంగన్వాడీ టీచర్ అప్పలనర్సమ్మకి సూచించారు.కూటమి ప్రభుత్వం
అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, శుభ్రతను కాపాడడం, సిబ్బందికి అవసరమైన సహకారం అందించడం వంటి చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజాసేవలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఒమ్మి రంగనాయకులు , మండల ఇంచార్జ్ బాటా శ్రీనివాసరావు,స్థానిక నాయకులు శ్రీను ,స్వామి ,అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.