Dora Swamy PC

Dora Swamy PC Doraswamy is a visionary, philanthropist, champion of services for women, and a youth icon

Union Textiles Minister Giriraj Singh praised Brandix as a model of women’s empowerment, highlighting its role in provid...
02/06/2026

Union Textiles Minister Giriraj Singh praised Brandix as a model of women’s empowerment, highlighting its role in providing employment to thousands of women. During his visit to the Brandix campus at Achyutapuram SEZ, he appreciated the world-class manufacturing standards, employee welfare measures, and positive work environment. He congratulated the Brandix management, stating that organizations like Brandix not only create jobs but also transform the region’s economic landscape.

మహిళా సాధికారతకు సజీవ రూపం 'బ్రాండిక్స్':
కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ప్రశంసలు

వేలాది మహిళా ఉద్యోగుల శ్రమకు గౌరవం..
'బ్రాండిక్స్' యాజమాన్యానికి అభినందనలు

వేలాది మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ, వారి సాధికారతకు బ్రాండిక్స్ సంస్థ వేస్తున్న బాటలు అత్యంత స్ఫూర్తిదాయకమని కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్‌ సింగ్‌ ప్రశంసించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ (SEZ) లోని 'బ్రాండిక్స్' ప్రాంగణాన్ని సందర్శించిన కేంద్ర మంత్రికి సంస్థలో జరుగుతున్న నాణ్యమైన వస్త్రోత్పత్తి, ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతుల విధివిధానాలను, మహిళా ఉద్యోగులకు అందిస్తున్న సౌకర్యాలు, సేవా కార్యక్రమలాను బ్రాండిక్స్ ఇండియా డైరెక్టర్, భారతీయ భాగస్వామి దొరస్వామి క్షుణ్ణంగా వివరించారు.

బ్రాండిక్స్ పరిశ్రమలో ఉద్యోగుల పనితీరును కేంద్రమంత్రి అత్యంత ఆసక్తిగా పరిశీలించారు. ఫ్యాక్టరీ అంతటా స్వయంగా కలియదిరిగి.. మహిళా ఉద్యోగులు పని చేస్తున్న తీరును, వారి అంకితభావాన్ని చూసి . సిబ్బందికి సంస్థ అందిస్తున్న అత్యుత్తమ వసతులు, కల్పిస్తున్న ఆహ్లాదకరమైన పని వాతావరణం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగుల సంక్షేమం, భద్రతా చర్యల పట్ల యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.

Brandix a Model for Women Empowerment, Says Union Minister Giriraj Singh
31/05/2026

Brandix a Model for Women Empowerment, Says Union Minister Giriraj Singh

Union Textiles Minister Giriraj Singh stated that the textile secto...

🌿 బ్రాండిక్స్ ప్రాణవాయువుకు మూలాధారాలు...  గార్డెనింగ్ కార్మికులు!బ్రాండిక్స్ సంస్థలో ప్రాణవాయువును అందించే వృక్షజాల పరి...
29/05/2026

🌿 బ్రాండిక్స్ ప్రాణవాయువుకు మూలాధారాలు... గార్డెనింగ్ కార్మికులు!

బ్రాండిక్స్ సంస్థలో ప్రాణవాయువును అందించే వృక్షజాల పరిరక్షణే ధ్యేయంగా, ఈ పరిసరాలను ఒక నందనవనంగా తీర్చిదిద్దుతున్న గార్డెనింగ్ కార్మికులతో ఈరోజు ముచ్చటించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ మండు వేసవి కాలంలో... వారి పని విధానాన్ని, ఎండ తీవ్రత నుండి వారికి కల్పిస్తున్న వెసులుబాట్లను, వారికి అందుతున్న వసతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను.

గత 15 ఏళ్లుగా ఇక్కడే నిరంతరం శ్రమిస్తూ, ఈ క్యాంపస్‌ను పచ్చదనంతో నింపుతూ, తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్న వీరి జీవితాలు ఎంతో స్ఫూర్తిదాయకం. మారుతున్న కాలానికి అనుగుణంగా వారికి సరికొత్త టెక్నాలజీ, ఆధునిక పనిముట్లపై ఎప్పటికప్పుడు శిక్షణ అందిస్తూ, వారి శ్రమను తగ్గించి పనిని మరింత సులభతరం చేయడంలో సంస్థ బాధ్యతగా సహకరిస్తుంది.

"కార్మికుల సంక్షేమమే... బ్రాండిక్స్ ప్రగతికి అసలైన మూలస్తంభం."

150th Free Eye Camp by Brandix (BIAC), 10th  May, 2026 in association with Sankar Foundation Eye Hospital # శంకర్ ఫౌండేష...
14/05/2026

150th Free Eye Camp by Brandix (BIAC), 10th May, 2026 in association with Sankar Foundation Eye Hospital

# శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో బ్రాండిక్స్ వారి 150వ ఉచిత నేత్ర వైద్యశిబిరం, మే 10, 2025

We are privileged to conduct our 150th FREE EYE CAMP on May 8th at BIAC health centre, Atchuthapuram, Near Vizag. 462 patients were screened, 42 for cataract & other surgeries, 408 Spectacles, 140 Medicines. Thanking all our team

విజయవంతంగా బ్రాండిక్స్ వారి 150వ ఉచిత కంటి వైద్య శిబిరం

✅బ్రాండిక్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా 150 వైద్య శిబిరం
✅ 462మందికి కంటి పరీక్షలు; 42మందికి కంటి శస్త్ర చికిత్సలు
✅ 408 మందికి కంటి అద్దాలు; 140 మందికి మందుల పంపిణీ
✅ చిన్నారులతో సహా అందరికీ కంటి చూపు సమస్యలపై అవగాహన

గ్రామీణ ప్రజలు కంటి చూపు సమస్యలను అధిగమించాలనే లక్ష్యంతో బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ (BIAC) కార్పొరేట్ సామాజిక బాధ్యతా (CSR) కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటి వరకూ నిర్వహించిన 150 ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా వేలాది మంది కంటి చూపు సమస్యలను అధిగమించగలిగారు.

150వ ఉచిత కంటి వైద్య శిబిరానికి 462మందికి ‘శంకర్ Eye ఫౌండేషన్ ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు చేసారు. పరీక్షల అనంతరం కంటి అద్దాలు అవసరమైన 408మందికి శిబిరం వద్ద కంటి అద్దాలు తయారు చేయించి అదే రోజున పంపిణీ చేసారు. 140మందికి కంటి సంరక్షణ కోసం మందులు ఇచ్చారు. శిబిరానికి హాజరైన చిన్నారులతో సహా అందరికి నిపుణులచే కంటి సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం జరిగింది.

శిబిరంలో నిర్వహించిన పరీక్షల్లో గుర్తించిన 42మందిని కేటరాక్ట్ & ఇతర ఆపరేషన్లు కోసం బస్సుల్లో విశాఖలోని ‘శంకర్ Eye ఫౌండేషన్’ ఆసుపత్రికి తీసుకెళ్ళి శస్త్ర చికిత్సలు చేయించడం జరిగింది. శిబిరానికి వచ్చిన వారందరికీ మజ్జిగ, ఫలహారాలు, భోజనం సదుపాయం కల్పించడం జరిగింది.

ఈ శిబిరంలో బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ భారతీయ భాగస్వామి దొరస్వామి గారు, BIAC సిబ్బంది, వైద్య నిపుణులు, శంకర్ Eye ఫౌండేషన్ బృందం పాల్గొన్నారు.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 💐
12/05/2026

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 💐

Heartfelt congratulations to Hon’ble Himanta Biswa Sarma Garu on this auspicious occasion of assuming office as the Chie...
12/05/2026

Heartfelt congratulations to Hon’ble Himanta Biswa Sarma Garu on this auspicious occasion of assuming office as the Chief Minister of Assam for the 2nd time 💐

The words you spoke last year in Guwahati, while allotting ten acres of land for the construction of the Sri Venkateswara Swamy Temple — “This is Lord Venkateswara Swamy’s divine blessing upon Northeast India” — still resonate like sacred spiritual vibrations.
Responding to the divine vision of Hon’ble Chief Minister N. Chandrababu Naidu Garu the devotion and commitment to Dharma that you displayed in the divine presence of Kamakhya Temple Amma is truly remarkable.

Recalling that sacred meeting with you, I sincerely pray that, with the blessings of Lord Venkateswara Swamy, Assam may continue to prosper and flourish further under your visionary leadership. 💐🙏

గౌరవనీయులు శ్రీ హిమంత బిస్వ శర్మ గారు అస్సాం ముఖ్యమంత్రిగా 2వ సారి పగ్గాలు చేపడుతున్న ఈ శుభవేళ హృదయపూర్వక శుభాకాంక్షలు 💐
గత సంవత్సరం గౌహతిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ, "ఇది ఈశాన్య భారతంపై స్వామివారి కృపాకటాక్షం" అని మీరు పలికిన మాటలు నేటికీ ఆధ్యాత్మిక పవనాల్లా మారుమోగుతున్నాయి. గౌ. ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య సంకల్పానికి, టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు గారి విన్నపానికి స్పందిస్తూ.. కామాఖ్య అమ్మవారి సాక్షిగా మీరు చూపిన ఆ ధర్మ నిరతి అద్భుతం.
ఆనాడు మీతో జరిగిన ఆ పవిత్ర కలయికను గుర్తు చేసుకుంటూ.. శ్రీవారి ఆశీస్సులతో మీ నాయకత్వంలో అస్సాం రాష్ట్రం మరింత సుభిక్షంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. 💐🙏

Himanta Biswa Sarma Bollineni Rajagopal Naidu Dora Swamy PC

కలియుగ వైకుంఠం తిరుమల గిరులలో ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం కనుల పండువగా సాగింది. వేద మంత్రాల ఘోష, కర్పూర న...
01/05/2026

కలియుగ వైకుంఠం తిరుమల గిరులలో ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం కనుల పండువగా సాగింది. వేద మంత్రాల ఘోష, కర్పూర నీరాజనాల మధ్య స్వామివారిని దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చింది.

TTD EO శ్రీ ముద్దాడ రవిచంద్ర ఐ.ఏ.ఎస్ గారితో కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొనడం, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించడం నా పూర్వజన్మ సుకృతం.

సకల జనులు ఆయురారోగ్యాలతో, యోగక్షేమాలతో వర్ధిల్లాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థించాను.

ఓం నమో వేంకటేశాయ!

అనకాపల్లిలో సమరసత సేవా ఫౌండేషన్ (SSF) ఆధ్వర్యంలో జరిగిన బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవంలో పాల్గొనడం నా మనసుకు ఎంతో ఆధ్య...
21/04/2026

అనకాపల్లిలో సమరసత సేవా ఫౌండేషన్ (SSF) ఆధ్వర్యంలో జరిగిన బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవంలో పాల్గొనడం నా మనసుకు ఎంతో ఆధ్యాత్మిక తృప్తిని, అమితమైన సంతోషాన్ని ఇచ్చింది. సనాతన ధర్మ స్ఫూర్తితో, హిందూ సమాజంలో సామాజిక సమరసతను వెల్లివిరియజేయడానికి SSF సంస్థ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.

టీటీడీ ‘శ్రీవాణి ట్రస్ట్’ నిర్మించిన ఆలయాలు నేడు కేవలం పూజా కేంద్రాలుగానే కాకుండా, సామాజిక చైతన్య వేదికలుగా మారాయి. ఎస్సీ, ఎస్టీ మరియు మత్స్యకార కాలనీల్లోని ఆలయాల్లో SSF ఏర్పాటు చేసిన బాలవికాస్ కేంద్రాల్లో చిన్నారులకు మహిళా బోధకులచే క్రమశిక్షణ, దేశభక్తి, క్రీడా స్ఫూర్తి, స్నేహ భావం మరియు మన సనాతన ధర్మ విలువలని అందిస్తున్న తీరు అద్భుతం.

ఇందులో భాగంగా అర్చకులు, బోధకులు, తల్లిదండ్రులను మరియు పిల్లలను ఒక్కటి చేస్తూ, ఈ కేంద్రాలు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలలో పాల్గొనడం నాకు గొప్ప తృప్తినిచ్చింది. వీరు సాగిస్తున్న ‘సేవా యజ్ఞం’ రేపటి ధార్మిక భారతావనికి బలమైన పునాది. మెదడుకు పదును పెట్టే విద్యతో పాటు గుండెకు తడినిచ్చే సంస్కారాన్ని నేర్పుతూ, ఉత్తమ పౌరులను తీర్చిదిద్దుతున్న ఈ పవిత్ర మార్గంలో భాగం కావడం నా పూర్వజన్మ సుకృతం.

క్వాంటం కంప్యూటింగ్ తో భవిష్యత్తును నిర్మిస్తున్న యుగకర్త!అమరావతి అస్తిత్వానికి ప్రాణం పోసిన శిల్పి.సాంకేతికతను సామాన్యు...
20/04/2026

క్వాంటం కంప్యూటింగ్ తో భవిష్యత్తును నిర్మిస్తున్న యుగకర్త!
అమరావతి అస్తిత్వానికి ప్రాణం పోసిన శిల్పి.

సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేసిన అపర దార్శనికుడు!
సంకల్పమే ఆయుధంగా... సంక్షోభాలను జయించిన ధీశాలి!

వారి మార్గదర్శనంలో వివిధ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం,
కలిసి ప్రయాణం చేయడం నాకు కలిగిన గొప్ప అవకాశంగా భావిస్తూ ..

నవ్యాంధ్ర నిర్మాణకర్త, గౌరవ ముఖ్యమంత్రివర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

Happy Birthday to the visionary Hon. CM Shri Nara Chandrababu Naidu garu - .official



మంత్రి లోకేష్ ను కలిసిన విశ్వహిందూ పరిషత్ ముఖ్యనేతలు గోసంరక్షణ, గోవధ నిషేధం, దేవాలయ భూముల పరిరక్షణ పై చర్చఅమరావతి: రాష్ట...
17/04/2026

మంత్రి లోకేష్ ను కలిసిన విశ్వహిందూ పరిషత్ ముఖ్యనేతలు

గోసంరక్షణ, గోవధ నిషేధం, దేవాలయ భూముల పరిరక్షణ పై చర్చ

అమరావతి: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త దొరస్వామి,
ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ కోశాధ్యక్షులు వలిపర్తి దుర్గా ప్రసాద్ రాజు, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్, ఉండవల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గోసంరక్షణకు గోశాలల నిర్మాణ ఆవశ్యకత, దేవాదాయ భూముల పరిరక్షణ, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా అక్రమ గో రవాణా, గోవధపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తిచేశారు. పంచాలయ వ్యవస్థగా దేవాలయాలను తీర్చిదిద్దాలి. ధార్మిక ప్రచారం, సామాజిక సేవా కార్యక్రమాలు దేవాలయాల ద్వారా నిర్వహించాలి. ధార్మికతకు భంగం కలగని విధంగా దేవాలయ భూములపై ఆదాయం పెంచే మార్గాలు పరిశీలించాలి. దేవాలయ భూములను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే విధానాన్ని సవరించాలి. అన్యాక్రాంతమైన దేవాలయ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని పరిరక్షించాలి. రాజకీయాలకు అతీతంగా పూర్తిస్థాయి ధార్మిక పరిషత్తును హిందూ థార్మిక సంస్థల ప్రతినిధులు, ధార్మిక పెద్దలతో ఏర్పాటు చేయాలి. హిందూ సమాజాన్ని జాగృతం చేసి భక్తిభావాన్ని పెంపొందించేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

Address

SEZ, Pudimadaka Road, Atchutapuram Mandal
Vishakhapatnam
531011

Alerts

Be the first to know and let us send you an email when Dora Swamy PC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dora Swamy PC:

Share