KK RAJU YSRCP

KK RAJU YSRCP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KK RAJU YSRCP, Vizagapatam.
(1)

20/08/2026

OMR స్లిప్పుల్లో నమోదైన మార్కుల్లో తేడా లేదని, జవాబు పత్రాల్లో ఎలాంటి మార్పులూ జరగలేదని వాళ్ల సిట్ రిపోర్టే చెబుతోంది. యూపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా జవాబు పత్రాలను పలు దఫాలుగా కరెక్షన్లు చేయడం అనేది ఎప్పటినుండో ఉన్న ప్రక్రియ. సవరణలన్నీ కంట్రోల్ బండిల్ స్లిప్ లలో నమోదు అవుతాయి. గతంలో తన హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ మొత్తం ఫలితాలను బయటపెట్టగలడా అని చంద్రబాబుకు నేను సవాల్ విసురుతున్నాను.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు!
20/08/2026

వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు!

20/08/2026

నేను సీబీఐ విచార‌ణ‌కు రెడీ..
అబ్బాకొడుకులు రెడీనా..?

20/08/2026

డీఎస్సీ నిర్వహణలో పెద్ద తప్పు చేసి దొరికిపోయి.. దబాయిస్తున్న నారా లోకేష్

నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలో మీరే చూడండి!

20/08/2026

ప్రత్యర్థి జట్టు లేని చోట.. బ్యాటింగ్ చేస్తూ ఆహా ఓహో అనుకుంటే ఎలా చంద్రబాబు ?

డీఎస్సీలో అక్రమ నియామకాలపై శాసనమండలిలో చర్చ అనగానే పారిపోయి.. శాసనసభలో మాత్రం డీఎస్సీ నియామకాల గురించి గొప్పలు చెప్పుకోవడమా?

మీరు ఏ తప్పూ చేయకపోతే మండలిలో డీఎస్సీ నియామకాలపై చర్చించొచ్చు కదా నారా లోకేష్ ?

ఈరోజు 47వార్డు యువజన విభాగం అధ్యక్షుడు కనకరాజు పుట్టినరోజు సందర్భంగా  సాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి...
19/08/2026

ఈరోజు 47వార్డు యువజన విభాగం అధ్యక్షుడు కనకరాజు పుట్టినరోజు సందర్భంగా సాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు *శ్రీ కె.కె రాజు గారు*
ఈ కార్యక్రమంలో 47 వార్డు అధ్యక్షులు కె. సుకుమార్,కే.శోభనబాబు, వై శ్రీనివాస్,కే సాగర్,వై స్వామి,వై వినయ్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు 50 వార్డ్ వైస్సార్సీపీ జిల్లాట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రెటరీ  సిపాన రాము గారి నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్...
19/08/2026

ఈరోజు 50 వార్డ్ వైస్సార్సీపీ జిల్లాట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రెటరీ సిపాన రాము గారి నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షులు *శ్రీ కె.కె రాజు గారు*
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అల్లు శంకర్ రావు, వైస్సార్సీపీ పి.సునీత, దమయంతి, నంబాల ఈశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

18/08/2026

* *కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖలో జరుగుతున్న భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి...*

*బర్మా కాలనీలో భూ అక్రమాలపై కలెక్టర్ గారికిl ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు..శ్రీ కె. కె.రాజు గారు*

ఈరోజు 49వ వార్డు బర్మాకాలనీలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన గృహాలను తొలగించాలని కోరుతూ, ' *నిరుపేద కాందీశీకుల* పోరాట ఐక్య వేదిక' చేపట్టిన అమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,జిల్లా అధ్యక్షులు *శ్రీ కె.కె. రాజు గారు*

ఈ సందర్భంగా కె కె రాజు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత 49వ వార్డులో బర్మా కాలనీ లోని ప్రభుత్వ భూమిని ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని కాంధీశీకుల పోరాట ఐక్యవేదిక సభ్యులుతో కలిసి స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే కనీసం ఈరోజు వరకు పట్టించుకోకుండా ఇప్పటికీ కూడా అధికార పార్టీకి వత్తాసు పలకడం చాలా దారుణమని అన్నారు..

కాలి స్థలంలో చిన్న గుడిసి కట్టుకుంటేనే జీవీఎంసీ సిబ్బంది గానీ రెవెన్యూ యంత్రాంగం మొత్తం అక్కడ వాలిపోయి హడావుడి చేసి కూల్చేస్తారు చేస్తారు అలాంటది నగరం నడిబొడ్డున ఇంత స్థలాన్ని ఆక్రమిస్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు అంటే ఇక్కడ ఎంత అవినీతిమయం జరుగుతుందో ప్రజలు అందరూ గమనించాలని అన్నారు..

మా మీద మా పార్టీ నాయకులు మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈ కూటమి నాయకులకి ఒకటే సవాలు చేస్తున్న మేము గాని మా పార్టీ కార్యకర్తలు గాని ఒక గజం స్థలం ఆక్రమించాని నిరూపిస్తే మీకు నచ్చిన కేసులు పెట్టుకోవచ్చని ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు..
మీరు చేస్తున్న తప్పులను మేము ఎత్తిచూపితే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తే మమ్మలిని అరాచక శక్తులని రౌడీలని చిత్రీకరిస్తున్నారని మీరు ఎన్ని నిందలు వేసిన ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు..

ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన గృహాలను తొలగించాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వారికి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని అన్నారు...

* *కూటమి ప్రభుత్వానికి  చిత్తశుద్ధి ఉంటే విశాఖలో జరుగుతున్న భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి...* * * బర్మా కాలనీలో భూ అక్ర...
18/08/2026

* *కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖలో జరుగుతున్న భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి...*
*
* బర్మా కాలనీలో భూ అక్రమాలపై కలెక్టర్ గారికిl ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు..
* -* *శ్రీ కె. కె.రాజు గారు*

49వ వార్డు బర్మాకాలనీలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన గృహాలను తొలగించాలని కోరుతూ *నిరుపేద కాందీశీకుల* పోరాట ఐక్య వేదిక' చేపట్టిన అమరణ నిరాహార దీక్షకు మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,జిల్లా అధ్యక్షులు *శ్రీ కె.కె. రాజు గారు* సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కె కె రాజు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత 49వ వార్డులో బర్మా కాలనీ లోని ప్రభుత్వ భూమిని ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని కాంధీశీకుల పోరాట ఐక్యవేదిక సభ్యులుతో కలిసి స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే కనీసం ఈరోజు వరకు పట్టించుకోకుండా ఇప్పటికీ కూడా అధికార పార్టీకి వత్తాసు పలకడం చాలా దారుణమని అన్నారు..

కాలి స్థలంలో చిన్న గుడిసి కట్టుకుంటేనే జీవీఎంసీ సిబ్బంది గానీ రెవెన్యూ యంత్రాంగం మొత్తం అక్కడ వాలిపోయి హడావుడి చేసి కూల్చేస్తారు చేస్తారు అలాంటది నగరం నడిబొడ్డున ఇంత స్థలాన్ని ఆక్రమిస్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు అంటే ఇక్కడ ఎంత అవినీతిమయం జరుగుతుందో ప్రజలు అందరూ గమనించాలని అన్నారు..

మా మీద మా పార్టీ నాయకులు మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈ కూటమి నాయకులకి ఒకటే సవాలు చేస్తున్న మేము గాని మా పార్టీ కార్యకర్తలు గాని ఒక గజం స్థలం ఆక్రమించాని నిరూపిస్తే మీకు నచ్చిన కేసులు పెట్టుకోవచ్చని ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు..
మీరు చేస్తున్న తప్పులను మేము ఎత్తిచూపితే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తే మమ్మలిని అరాచక శక్తులని రౌడీలని చిత్రీకరిస్తున్నారని మీరు ఎన్ని నిందలు వేసిన ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు..

ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన గృహాలను తొలగించాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వారికి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని అన్నారు...

ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తిప్పల దేవన్ రెడ్డి, SEC సభ్యులు కట్టమూరి సతీష్,బాణాల శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు అల్లు శంకర్ రావు,సాడి పద్మా రెడ్డి, బర్కత్ ఆలీ, వార్డుప్రెసిడెంట్స్ బొడేటి కిరణ్, బీశెట్టి ప్రసాద్, జక్కంపూడి సత్యనారాయణ, డోప్ప శ్రీను,లాలం వేణు, ఎర్రం శెట్టి శ్రీను,సీనియర్ నాయకులు అంబటి శైలేష్, బోగవల్లి గోవింద్, పైడి శ్రీను, తుల్లీ చంద్రశేఖర్,కరి రామారెడ్డి, సబ్బవరపు శ్రీను,మువ్వల సంతోష్, శ్రవణ్, జాయ్, సారిపల్లి సంతోష్, భద్రి, శివరాం, సురేష్, ఢిల్లీ రావు, విమల్, అశోక్, గుదే రాజు, బాలాజీ,తదితరులు పాల్గొన్నారు

*ఫార్మాసిటీ నిర్వాసితులకు న్యాయం చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలని ఫార్మాసిటీ యాజమాన్యానికి వినతిపత్రం *– కె.కె. రాజు, జి...
18/08/2026

*ఫార్మాసిటీ నిర్వాసితులకు న్యాయం చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలని ఫార్మాసిటీ యాజమాన్యానికి వినతిపత్రం *– కె.కె. రాజు, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు*

విశాఖపట్నం: ఫార్మాసిటీ నిర్మాణం కోసం భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు, వారికి ఇచ్చిన హామీ మేరకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని విశాఖ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫార్మాసిటీ యాజమాన్యానికి నిర్వాసితుల సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు.

లంకెలపాలెం పరిధిలోని లేమర్తి గ్రామానికి చెందిన ఫార్మాసిటీ నిర్వాసితుల సమస్యలపై శ్రీ కె.కె. రాజు గారు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తిప్పల దేవన్ రెడ్డి గారితో కలిసి ఫార్మాసిటీ యాజమాన్య ప్రతినిధులను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కె.కె. రాజు మాట్లాడుతూ, 2005 సంవత్సరంలో ఫార్మా పరిశ్రమ నిర్మాణం కోసం నిర్వాసితుల నుంచి భూములు తీసుకునే సమయంలో వారికి శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీలోని పలు పరిశ్రమల్లో నిర్వాసితులను తొలుత కాంట్రాక్టర్ ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకున్నారని, అనంతరం కొన్ని కంపెనీల్లో పనిచేస్తున్న నిర్వాసితులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. అయితే మరికొన్ని కంపెనీల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న నిర్వాసితులకు ఇప్పటికీ శాశ్వత ఉద్యోగాలు కల్పించకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. భూములు, ఇళ్లు కోల్పోయి ఫార్మాసిటీ నిర్మాణానికి సహకరించిన నిర్వాసిత కుటుంబాలు ప్రస్తుతం ఉద్యోగ భద్రత లేక ఆర్థికంగా, సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కె.కె. రాజు అన్నారు. భూములు కోల్పోయిన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఫార్మాసిటీ యాజమాన్యంపై ఉందని స్పష్టం చేశారు. ఫార్మాసిటీ నిర్వాసితులకు ఉద్యోగ భద్రత కల్పించడం, అర్హత ఉన్న ప్రతి నిర్వాసితుడికి శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇప్పటికే పనిచేస్తున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడం వంటి అంశాలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. నిర్వాసితుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి, వారికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఫార్మాసిటీ యాజమాన్యాన్ని కె.కె. రాజు కోరారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాతపాటి ఆర్ఎస్వీ ప్రసాద్ రాజు, పీఎస్ రాజు, నక్క రమణబాబు, పూర్ణానంద శర్మ, బోరా సోము నాయుడు, ఇళ్లపు వాసు, జీలకర్ర నాగేంద్ర, గొందేసి శ్రీనివాస రెడ్డి, గోడబా మనోజ్, పైడి రాజు, కోన రామారావు, బంధం నాగేష్, ఏర్ని రమణ, చిమ్మిటి శ్రీనివాస్, దొప్ప వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

Address

Vizagapatam

Website

Alerts

Be the first to know and let us send you an email when KK RAJU YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share