Team Kolagatla

Team Kolagatla అన్నయ్య గౌ. కోలగట్ల వీరభద్రస్వామి గారిని మరలా శాసనసభకు పంపి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేద్దాం.

విజయనగరం... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు కూటమి ప్రభుత్వ పాలనలో...
10/09/2025

విజయనగరం... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా యూరియా కొరత, పండిన పంటలకు తగిన గిట్టుబాటు ధర కల్పించకపోవడం వంటి అంశాలపై నిరసిస్తూ మంగళవారం తలపెట్టిన *అన్నదాత పోరు* కార్యక్రమం విజయనగరం నియోజకవర్గంలో విజయవంతంగా జరిగింది. జ్యోతిరావు పూలే విగ్రహం నుండి కలెక్టర్ ఆఫీస్ మీదుగా ఆర్డిఓ ఆఫీస్ వరకు విజయనగరం, నెల్లిమర్ల, ఎస్ కోట నియోజకవర్గాల నాయకులతో కలిసి నిరసన ర్యాలీని చేపట్టిన అనంతరం ఆర్టీవో కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ర్యాలీలో పాల్గొన్న నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బొడికొండ అప్పలనాయుడు, ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ లు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో రైతులకు సులభంగా దొరికే యూరియా బస్తా కోసం రైతులు రోజుల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని,యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వామే బాధ్యత వహించాలని మరోవైపు ఉల్లి, మినుము పంటల ధరలు పతనమై రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని అతివృష్టి, అనావృష్టి కాలంలో ఇబ్బంది పడే రైతు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో యూరియా కోసం పడరానీ పాట్లు పడుతున్నారని ఆయన అన్నారు. సీజన్లో పొలం పనులు మానుకొని రోజుల తరబడి తిండి తిప్పలు లేకుండా ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్న యూరియా దొరకడం కష్టంగా మారిందని, యూరియా కొరత తీవ్రస్థాయికి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా యూరియా కొరతే కాకుండా పండిన పంటల తగిన ధర కల్పించలేకపోవటం, ఉల్లి, మామిడి, నిమ్మ పంటలు దిగుబడి తగ్గి పంటను రోడ్డు పాలు చేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వాపోయారు. వైసిపి హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రైత భరోసాలు ఏర్పాటుచేసి తద్వారా రైతన్నలకు ఎరువులు, యూరియా పంపిణీ చేసి అన్ని సౌకర్యాలు కల్పించి, అవగాహన సదస్సులు కూడా కల్పించేవారని ప్రజలకు గుర్తు చేశారు. రైతన్నకు అండగా వైసిపి ప్రభుత్వం ఉంటుందని, మూడు నియోజకవర్గాల నాయకులు విజయనగరంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో వినతి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆశపు వేణు, ఉప అధ్యక్షులు ఎస్ వి వి రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం రెడ్డి బంగారు నాడు, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, మండల అధ్యక్షులు కెల్ల త్రినాధరావు, తో పాటు మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విజయనగరం... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంల...
06/09/2025

విజయనగరం... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9వ తారీఖున ఆర్డీవో కార్యాలయాల ఎదుట *అన్నదాత పోరు* కార్యక్రమం నిర్వహించనున్నరు.
ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు విజయనగరం జిల్లా కేంద్రంలో గల మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నివాసంలో విజయనగరం, నెర్లిమర్ల, ఎస్ కోట నియోజకవర్గలా ఎంపీ, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఎమ్మెల్సీ లతో కలిసి ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రాలను ఆవిష్కరించారు. వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి లు మాట్లాడుతూ ఈనెల 9న విజయనగరం జిల్లాలో మూడు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు ఎదుట రైతన్నలతో కలిసి నిరసనలు చేపట్టి అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం నుండి కలెక్టరేట్ జంక్షన్ మీదుగా ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం ఆర్డీవో కు రైతు సమస్యలు పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విజయనగరం, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గం చెందిన రైతులు,నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జరిగిన కార్యక్రమంలో విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు బడుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు గార్లు మరియు మూడు నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

విజయనగరం... దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు మాజీ ...
02/09/2025

విజయనగరం... దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సీఎంఆర్ జంక్షన్ వద్ద స్వర్గీయ వైయస్ ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ ప్రజలకు చిరస్మరణీయ ప్రజా బాంధవుడని అన్నారు. వైయస్సార్ మనకు దూరమై నీటికి 16 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయన చేసిన మంచి పనులు ప్రతి ఒక్కరి మధ్యలో నిలిచే ఉన్నాయని, *పాదయాత్ర* అనే ప్రజా సమస్యల అవగాహన యాత్ర చేసి ప్రజల స్థితిగతులు తెలుసుకున్న వైయస్సార్ ముందుగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతుల కోసం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చారు, రైతుల విద్యుత్ బకాయిలు రద్దు చేశారు, సబ్సిడీపై పంట విత్తనాలు, గడ్డి విత్తనాలు ఎరువులు, పురుగుల మందులు అందించారు. పంటల బీమా పథకం ప్రవేశపెట్టారు. పంటల నిల్వలకు "రైతుబంధు" పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల శిక్షణకై "పొలంబడి" కార్యక్రమాన్ని చేపట్టి రైతు బాంధవుడుగా చరిత్రలో నిలిచారు.
వాణిజ్య, వ్యాపారాల అభివృద్ధికై రోడ్ల సౌకర్యాన్ని కల్పించారు.
ప్రజల అత్యవసర ఆరోగ్య అవసరార్థం పట్టణాలలో "108" గ్రామాలలో "104" అంబులెన్స్లను ఏర్పాటు చేసి, వైద్యశాలల్లో పేద ప్రజల కొరకు "ఆరోగ్యశ్రీ" పథకాన్ని ప్రవేశపెట్టారు.
తెల్ల రేషన్ కార్డ్ ఉన్న పేద ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టారు.
పేద ప్రజలకు "రాజీవ్ గృహకల్ప" వంటి సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత ఆయనదేనని,
డ్వాక్రా సభ్యులైన మహిళలందరికీ పావలా వడ్డీకే రుణాలు కల్పించి వారి కుటుంబ సభ్యుల ఆర్థిక అభివృద్ధికి చేయూతనందించారు. పేద విద్యార్థుల కొరకు "ఫీజు రిమాండ్స్ మెంట్" వంటి పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే వైయస్సార్ అనగానే గుర్తుకు వచ్చేది సంక్షేమ పథకాలు అని ఆయన అన్నారు. తండ్రి బాటలోనే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కూడా తన పాలనలో ప్రజలకు అత్యంత కీలకమైన విద్య, వైద్యాలకు ప్రాధాన్యమిచ్చారని ఆయన అన్నారు. విజయనగరం వైయస్సార్ సిపి నాయకుల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో *జోహార్ వైయస్ఆర్, జోహార్ వైయస్ఆర్* అంటూ ఆ ప్రాంతమంతా మారు మ్రోగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఆసపు వేణు, ఉప అధ్యక్షులు ఎస్.వి.వి రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం రెడ్డి బంగారు నాయుడు, ఆయా డివిజన్లో వార్డ్ కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు, ఆయా హోదాల్లో ఉన్న ప్రస్తుత మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Kolagatla Veerabhadra Swamy కోలగట్ల సోషల్ మీడియా Ysjagan Yuvadhalam


విజయనగరం పట్టణ పరిధిలో ఈ రోజు 2 వ డివిజన్ లో     బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటి కి వెళ్లి ప్రభు...
18/07/2025

విజయనగరం పట్టణ పరిధిలో ఈ రోజు 2 వ డివిజన్ లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటి కి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించిన మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారు, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి గారు, జిల్లా, పట్టణ వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు.


YS Jagan Mohan Reddy
Kolagatla Veerabhadra Swamy
Ysjagan Yuvadhalam

02/04/2024

🟧 ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో నగరం అభివృద్ధి అయ్యిందని మీరు భావిస్తేనే వైఎస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మరొకసారి మాకు అవకాశం ఇప్పించవలసిందిగా విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామి గారు కోరడం జరిగింది.

🟧 దాసన్నపేట అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర నుండి ఈరోజు ఎన్నికల ప్రచారం లో వైఎస్ఆర్సిపి విజయనగరం నియోజకవర్గం అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామి గారు మరియు పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన్ని చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.

🟧 స్థానిక ప్రజలు కోలగట్ల వీరభద్ర స్వామి గారికి ఘన స్వాగతం పలికి గజమాలలు, విజయ తిలకాలతో అభిమానం చాటుకున్నారు.

💥 35వ division వీటి అగ్రహారంలో 36.5 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డును ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వ...
05/02/2024

💥 35వ division వీటి అగ్రహారంలో 36.5 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డును ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు
💥 స్థానిక కార్పొరేటర్ చందక శ్రీను గారు మాట్లాడుతూ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు మా డివిజన్లో ఇప్పటివరకు హెల్త్ సెంటర్, కోలగట్ల ఆరోగ్య కేంద్రం (gym), పలు రోడ్లు, డ్రైన్ లు, మంచినీటి సమస్య లేని ప్రాంతంగా చేయడం జరిగిందని మా డివిజన్ తరఫున కోలగట్ల వీరభద్ర స్వామి గారికి కృతజ్ఞులతో తిరుగుతున్నామని అన్నారు.
💥 ఈ కార్యక్రమంలో జోనల్ స్థాయి నాయకులు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

💥విజయనగరం నియోజకవర్గంలో ఆసరా సంబరాల్లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు మరియు ఎంపీ...
31/01/2024

💥విజయనగరం నియోజకవర్గంలో ఆసరా సంబరాల్లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు మరియు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు.

💥కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారు మరియు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు.

💥రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఎక్కడ ఎటువంటి లంచాలకి తావు లేకుండా సంక్షేమ పాలన అందిస్తున్నారని కోలగట్ల అన్నారు.

💥విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో వైయస్సార్ ఆసరా పథకం ద్వారా విడుదలైన నాలుగో విడత చెక్కును ప్రభుత్వం తరఫున డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు మరియు బెల్లాన చంద్రశేఖర్ గారు అందజేయడం జరిగింది.

💥వైయస్సార్ ఆసరా పథకంలో నగర పరిధిలో స్వయం సహాయక సంఘంలలో 33368 మంది మహిళలకు జమ అయిన మొత్తం 25,08,67,138 కోట్ల రూపాయలు.

💥అదేవిధంగా వైయస్సార్ ఆసరా పథకంలో మండల పరిధిలో స్వయం సహాయక సంఘంలలో 8413 మంది మహిళలకు జమ అయిన మొత్తం 5,15,00,000 కోట్ల రూపాయలు.

💥రాష్ట్రంలో జగనన్న సంక్షేమ పాలన అందిస్తూ, నగరంలో స్వామి అన్న అభివృద్ధి పాలన అందించడం జరుగుతుందని, మరలా ఇంకొక్కసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి, నగరంలో కోలగట్ల వీరభద్ర స్వామి గారికి అవకాశం ఇస్తే సమస్యలు లేని విజయనగరంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా సమావేశం కొచ్చిన మహిళలకు హామీ ఇవ్వడం జరిగింది.

💥ఈ కార్యక్రమంలో నగర మేయర్ డిప్యూటీ మేయర్లు నగరపాలక సంస్థ కమిషనర్ టౌన్ స్థాయి నాయకులు జోనల్ స్థాయి నాయకులు కార్పొరేటర్లు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Live video link 🖇️👇
https://fb.watch/pVQPk81vVQ/?mibextid=Nif5oz

🟧 మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నగరంలో కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు...
30/01/2024

🟧 మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నగరంలో కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

బల ప్రదర్శన ద్వారా విజయనగర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన మహోన్నత వ్యక్తి కలియుగ భీమ కోడి రామమూర్తి నాయుడు అని డిప...
28/01/2024

బల ప్రదర్శన ద్వారా విజయనగర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన మహోన్నత వ్యక్తి కలియుగ భీమ కోడి రామమూర్తి నాయుడు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కొనియాడారు. ఈరోజు కోడి రామ్మూర్తి ఆరాధన ఉత్సవాలలో భాగంగా కోడి రామ్మూర్తి వ్యాయామశాల జంక్షన్లో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆరాధన ఉత్సవాల సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కోడి రామ్మూర్తి విశిష్టతలను కోలగట్ల వివరించారు. ప్రపంచంలోని అత్యంత బలశాలిగా, కలియుగ భీముడిగా పేరుగాంచిన కోడి రామమూర్తి నాయుడు వ్యాయామ ప్రక్రియలు భావితరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఆయన విగ్రహాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విజయనగరంలో కోడి రామ్మూర్తి వ్యాయామశాల అతి ప్రాచీనమైనదని అన్నారు. ఆధునిక పరికరాలతో ఎన్నో ప్రైవేటు వ్యాయామశాలలు నెలకొల్పినప్పటికీ కోడి రామ్మూర్తి వ్యాయామశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ తర్ఫీదు పొందిన ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బహుమతులను గెలుచుకున్న ఘనత ఉందన్నారు. మూడు టన్నుల రోడ్డు రోలర్ను చాతిపై ఎత్తుకున్న బలశాలిగా పెద్ది లక్ష్మీనారాయణ మూర్తి పేరుగాంచారన్నారు. ఆనాడు అప్పుసాని అప్పన్న దొర ఈ వ్యాయామశాలను అభివృద్ధి చేశారని తర్వాత కాలంలో మరమ్మతులకు గురైన పరిస్థితిలో ఈమధ్య 16 లక్షల రూపాయలతో వ్యాయామశాలలో మరమ్మతులు చేయించామన్నారు. 28 లక్షల రూపాయలతో ఇండోర్ స్టేడియం ను అభివృద్ధి చేశామన్నారు. ప్రకాశం పార్క్ శిధిలావస్థకు చేరుకోవడంతో కోటి రూపాయల నిధులు వెచ్చించి రాష్ట్రంలోనే తొలి మహిళా పార్కుగా తీర్చిదిద్దామన్నారు. నెహ్రూ పార్కును చిల్డ్రన్స్ పార్క్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలోని ప్రధాన జంక్షన్లో వివిధ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వ్యాయామశాల ప్రాంతంలో కోడి రామమూర్తి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యాయామ ప్రక్రియ ద్వారా శారీరిక మానసిక ఉల్లాసంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా రిజర్వేషన్లు పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, లయ యాదవ్, వ్యాయామ సమాజం అధ్యక్షురాలు పెనుమజ్జి విజయలక్ష్మి, కార్యదర్శి పెద్ది లక్ష్మీనారాయణ, పివి నరసింహారాజు, రంగారావు దొర, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ బంగారనాయుడు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Live video link 🖇️👇
https://fb.watch/pRAN6BWVTA/?mibextid=Nif5oz

ఇది కాదా అభివృద్ధి?
27/01/2024

ఇది కాదా అభివృద్ధి?



విజయనగరం జిల్లా కేంద్రం రామానాయుడు రోడ్డు, పెద్ద చెరువు ఉత్తరగట్టు మూడు రోడ్లు జంక్షన్ వద్ద మహాత్మా గాంధీ గారి స్మృతి వన...
26/01/2024

విజయనగరం జిల్లా కేంద్రం రామానాయుడు రోడ్డు, పెద్ద చెరువు ఉత్తరగట్టు మూడు రోడ్లు జంక్షన్ వద్ద మహాత్మా గాంధీ గారి స్మృతి వనం పనులను మునిసిపల్ అధికారులతో కలిసి సమీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు మరియు విజయనగరం ఎంపీ శ్రీ బెల్లానచంద్రశేఖర్ గారు.
Kolagatla Veerabhadra Swamy

Address

Natraj Colony
Vizianagaram
535001

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Kolagatla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share