Botcha Sandeep

Botcha Sandeep Dr.Botcha Sandeep (MD Radiology ,FVIR)
Doctor - Youth Leader - Botcha Family - Social service

ముస్లిం బంధుమిత్రులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈ పవిత్ర దినాన మీ కుటుంబాల్లో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ...
28/05/2026

ముస్లిం బంధుమిత్రులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈ పవిత్ర దినాన మీ కుటుంబాల్లో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

📍 రాజాం నియోజకవర్గం | 🗓️ 24.05.2026​రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం మరియు విస్తృత స్థాయి సమ...
24/05/2026

📍 రాజాం నియోజకవర్గం | 🗓️ 24.05.2026
​రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం మరియు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
​రాజాం టౌన్ పరిధిలోని పొనుగుటివలస మార్గంలో, మన పార్టీ సమన్వయకర్త శ్రీ తలె రాజేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత, పెద్దలు గౌ|| శ్రీ బొత్స సత్యనారాయణ గారితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యాను.
​పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్లుగా... "ఈ నూతన కార్యాలయం కేవలం ఒక భవనం మాత్రమే కాదు. పార్టీ కార్యకర్తలకు, రాజాం ప్రజలకు కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఒక సేవా కేంద్రం." ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ కార్యాలయం ఒక వారధిలా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను.
​ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొని, ఉత్సాహభరితమైన వాతావరణంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాజీ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు, పరిశీలకులకు, రాజాం నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులకు, ప్రజాప్రతినిధులకు మరియు నా తోటి కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరి లక్ష్యం ప్రజా సేవే! ✌️

చీపురుపల్లి నియోజకవర్గ క్లస్టర్, డివిజన్ ఇంచార్జులు, బూత్ ఏజెంట్లతో కీలక సమావేశం!శాసన మండలి విపక్ష నేతలు, నాన్న శ్రీ బొత...
16/05/2026

చీపురుపల్లి నియోజకవర్గ క్లస్టర్, డివిజన్ ఇంచార్జులు, బూత్ ఏజెంట్లతో కీలక సమావేశం!

శాసన మండలి విపక్ష నేతలు, నాన్న శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు... ఈరోజు గరివిడి క్యాంప్ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని మెరకముడిదం మండల, గ్రామాల క్లస్టర్, డివిజన్ ఇంచార్జ్లతో మరియు బూత్ ఏజెంట్లతో కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అక్క డాక్టర్ అనూష గారితో కలిసి నేను సమీక్షా సమావేశాన్ని నిర్వహించాము.

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించాలని, గ్రామాల్లో అర్హులైన యువతీ, యువకులకు కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించాము.

ఈ సమావేశంలో మెరకముడిదం మండల నాయకులు సిరువురు రమణరాజు గారు, కోట్ల వెంకట్రావు గారు, తాడ్డీ వేణు గారు, బుర్లె నరేష్ కుమార్ గారు, హరిబాబు గారు, రాము గారు మరియు మండలంలోని వివిధ గ్రామాల ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్‌లు, వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

లోక రక్షకుడు, రామదూత శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తులందరికీ..శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
12/05/2026

లోక రక్షకుడు, రామదూత శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తులందరికీ..శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

ఒక ప్రాణానికి జన్మనిచ్చేది అమ్మ.. ఆ ప్రాణాన్ని కంటికి రెప్పలా కాపాడేది అమ్మ. మాతృత్వంలోని మమకారాన్ని, త్యాగాన్ని గౌరవిస్...
10/05/2026

ఒక ప్రాణానికి జన్మనిచ్చేది అమ్మ.. ఆ ప్రాణాన్ని కంటికి రెప్పలా కాపాడేది అమ్మ. మాతృత్వంలోని మమకారాన్ని, త్యాగాన్ని గౌరవిస్తూ.. లోకంలోని తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

06/05/2026

ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో జరిగిన శుభకార్యాలలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

📍 చీపురుపల్లి - TTD కళ్యాణ మండపంలో వంశీ కిరణ్, లిజి శ్రీ గారి నిశ్చితార్థ వేడుకలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారితో కలిసి పాల్గొన్నాను. కాబోయే నూతన వధూవరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించడం జరిగింది.

📍 చీపురుపల్లి - రాధమాధవ ఫంక్షన్ హాల్ లో సువ్వాడ అప్పల నాయుడు గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి మంగళాశాసనాలు అందజేశాను.

📍 బుదారాయవలస SI లోకేష్ గారి వివాహ వేడుక అనంతరం, వారి స్వగృహానికి వెళ్లి నూతన దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించాను.

ఈ కార్యక్రమాలలో నాతో పాటు మీసాల వరహాలనాయుడు గారు, ఇప్పిలి అనంత్ గారు, వలిరెడ్డి శ్రీనివాసులు గారు, బెల్లాన వంశీ గారు, లంక శ్రీరాములు గారు మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో జరిగిన శుభకార్యాలలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది...
06/05/2026

ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో జరిగిన శుభకార్యాలలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
📍 చీపురుపల్లి - TTD కళ్యాణ మండపంలో వంశీ కిరణ్, లిజి శ్రీ గారి నిశ్చితార్థ వేడుకలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారితో కలిసి పాల్గొన్నాను. కాబోయే నూతన వధూవరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించడం జరిగింది.

📍 చీపురుపల్లి - రాధమాధవ ఫంక్షన్ హాల్ లో సువ్వాడ అప్పల నాయుడు గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి మంగళాశాసనాలు అందజేశాను.

📍 బుదారాయవలస SI లోకేష్ గారి వివాహ వేడుక అనంతరం, వారి స్వగృహానికి వెళ్లి నూతన దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించాను.

ఈ కార్యక్రమాలలో నాతో పాటు మీసాల వరహాలనాయుడు గారు, ఇప్పిలి అనంత్ గారు, వలిరెడ్డి శ్రీనివాసులు గారు, బెల్లాన వంశీ గారు, లంక శ్రీరాములు గారు మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Address

Vizianagaram
Vizianagaram

Website

Alerts

Be the first to know and let us send you an email when Botcha Sandeep posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category