Vizianagaram District Police

Vizianagaram District Police The police are the public and the public are the police;

02/09/2026

||మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం||
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

🌀 నేరాల తగ్గుదలతో పాటు నేరస్థులకు శిక్షలు పడేలా చర్యలు చేపడుతున్నామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

విజయనగరం జిల్లాలో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసుశాఖ పటిష్టమైన చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు సెప్టెంబరు 2న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. పోలీసుశాఖ సమర్థవంతమైన చర్యలు, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, నిరంతర పర్యవేక్షణ కారణంగ మహిళలు, చిన్నారులపై నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు మాట్లాడుతూ -

🌀 మహిళలపై నేరాల్లో 29 శాతం తగ్గుదలః

2025 ఆగస్టు వరకు మహిళలపై నేరాలకు సంబందించి 304 కేసులు నమోదు కాగా, 2026 ఆగస్టు వరకు 217 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. ఈ నేరాలు గత ఏడాది కంటే 29శాతం కేసులు తగ్గాయన్నారు. మహిళల భద్రతకు అవగాహన కార్యరకమాలు చేపట్టడంతోపాటు, నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

🌀 చిన్నారులపై నేరాల నియంత్రణలో 55 శాతం తగ్గుదల:

పోక్సో చట్టం క్రింద 2025 ఆగస్టు వరకు 44 కేసులు నమోదుకాగా, 2026లో 20 కేసులు మాత్రమే నమోదయ్యా యన్నారు. దీంతో చిన్నారులపై నేరాల్లో 55 శాతం తగ్గుదల నమోదయ్యిందన్నారు. చిన్నారుల రక్షణ, బాలల హక్కు లు, లైంగిక నేరాల నివారణపై జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా మని జిల్లా ఎస్పీ తెలిపారు.

🌀 జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న చర్యలు ఫలితంగా 67 కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు:

మహిళలపై నేరాలు మరియు పోక్సో కేసుల్లో సమర్ధవంతమైన దర్యాప్తు, పకడ్బందిగా సాక్ష్యాల సేకరణ, న్యాయ స్థానాల్లో సమర్ధవంతమైన వాదనలు పై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఫలితంగా 67 కేసుల్లో (పోక్సో కేసులు 36, క్రైం ఎగినిస్ట్ వుమన్ కేసులు 31) నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో విజయం సాధించామన్నారు. వీటిలో జీవితఖైదు - 3, 25సం. ల జైలుశిక్ష కేసులు-2, 20సం.ల జైలుశిక్ష - 19, 10సం.ల జైలుశిక్ష – 6, 7సం.ల జైలుశిక్ష - 1, 5సం.ల జైలుశిక్ష - 2, 3 నుండి 1సం. జైలుశిక్ష - 34 కేసులు ఉన్నాయన్నారు.

🌀 గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం:

జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణ, వినియోగాన్ని అరికట్టేందుకు ఈగల్, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామన్నారు. గంజాయితో పట్టుబడిన నిందితులపై పి.డి. యాక్టు మరియు పిట్ ఎన్.డి.పి.ఎస్. కఠినంగా అమలు చేయడంతోపాటు, వారిపై హిస్టరీ షీట్లు ప్రారంభించి, వారి ఆస్తులను అటాచ్మెంట్ కు ఫైనాన్షియల్ ఇన్విస్టిగేషను చేపడుతున్నామన్నారు.

▫️2025లో 78 కేసులు నమోదు చేసి, 246మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 35 వాహనాలను, 1147. 856 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నామన్నారు.

▫️2026లో 23 కేసులు నమోదు చేసి, 118 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 25 వాహనాలను, 655. 225 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నామన్నారు.

▫️140 కేసుల్లో పట్టుబడిన 4,921.766 కిలోల గంజాయిని 2026 జూన్18న అనకాపల్లి జిల్లా పరవాడలోని సి.డబ్ల్యు.ఎం.పి.లో ధ్వంసం చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు.

▫️గంజాయి కేసుల్లో తరుచూ పట్టుబడిన 7గురుపై పి.డి. యాక్టు, 8 మందిపై పిట్ ఎన్.డి.పి.ఎస్. ఇప్పటి వరకు అమలు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు.

🌀 జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యల ఫలితంగా రహదారి ప్రమాదాలు 16శాతం తగ్గుముఖం:

▫️2025లో ఆగస్టు వరకు 415 రహదారి ప్రమాదాలు జరిగి 148 మంది మరణించగా, 517 మంది గాయపడ్డా రన్నారు.

▫️2026లో ఆగస్టు వరకు 350 రహదారి ప్రమాదాలు జరిగి 137 మంది మరణించగా, 444మంది గాయపడ్డా రన్నారు. ఈ ప్రమాదాలు గతేడాది కంటే 16శాతం తగ్గాయన్నారు.

▫️ఈ ఏడాది ఈ-చలానాలను విధించడం కంటే గతంలో విధించిన ఈ-చలానాలను వాహనదారులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టడంతోపాటు, 7,517 మంది పై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసామన్నారు. వీటిలో 98మందికి సాధారణ జైలుశిక్షలు విధించారన్నారు. అంతేకాకుండా, మిగిలిన కేసుల్లో రూ.10వేలు చొప్పున జరిమానా విధించారన్నారు.

🌀 స్థానిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక అమలు చేస్తాం:

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పల్లె నిద్ర, యువ చైతన్యం, మీతో - మీ ఎస్పీ, సంకల్పం 2.0, అభ్యుదయం కార్యక్రమాలను చేపట్టి, ప్రజలకు చేరవవుతున్నామన్నారు. గ్రామాల్లో సమస్యలను తెలుసుకొంటూ, వాటిని పరిష్కరిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నామని జిల్లా ఎస్పీ అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణలో జిల్లా పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్పష్టం చేసారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||

Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space

జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్, ఐ.పీ.యస్ గారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ శక్తి టీం గుడ్ టచ్-బ్యాడ్ టచ్, డిజిటల్...
01/09/2026

జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్, ఐ.పీ.యస్ గారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ శక్తి టీం గుడ్ టచ్-బ్యాడ్ టచ్, డిజిటల్ అరెస్ట్, గంజాయి, లవ్ ట్రాప్స్ వంటి అంశాలను వివరించారు. మహిళల రక్షణ చట్టాలు, ముఖ్య నిబంధనలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ ప్రత్యక్ష ప్రదర్శనతో పాటు
“మీతో మీ ఎస్పీ ” కరపత్రాలను పంపిణీ చేశారు.

Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space

గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వులు మేరకు రోడ్డు భద్రత, ప్రమాధాల నివారణ మరియు హెల్మెట్ ప్రాముఖ్యత లో భాగంగా గౌరవ భోగపురం రూరల్ సర...
01/09/2026

గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వులు మేరకు రోడ్డు భద్రత, ప్రమాధాల నివారణ మరియు హెల్మెట్ ప్రాముఖ్యత లో భాగంగా గౌరవ భోగపురం రూరల్ సర్కిల్ సి.ఐ శ్రీనివాస్ గారు మరియు ఏస్.ఐ, డెంకాడ మండలం నేషనల్ హైవే నాతవలస టోల్ ప్లాజా వద్ద సుమారు 80 మంది మోటారు సైకిల్ మరియు ఇతర వాహన దారులకు అవగాహణ చేపట్టి వారితో ప్రతిజ్ఞ చేయించడం అయినది సార్.....అనంతరం మీతో మీ ఎస్పీ పాంప్లెట్స్ ను అందరికీ చదివి వినిపించి పంపిణీ చేయడం అయినది.

Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space

||మహిళలు, చిన్నారుల భద్రత మరియు గంజాయి నిర్మూలనకు అధిక ప్రాధాన్యత కల్పించాలి||విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్...
01/09/2026

||మహిళలు, చిన్నారుల భద్రత మరియు గంజాయి నిర్మూలనకు అధిక ప్రాధాన్యత కల్పించాలి||
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

విజయనగరం జిల్లా గజపతినగరం, పోలీసు స్టేషను మరియు గజపతినగరం సర్కిల్ కార్యాలయంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ సెప్టెంబర్ 1న సందర్శించి, పోలీసు స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకే అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా రక్షణ, నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ - గంజాయి నియంత్రణ, మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యత కల్పించాలని, క్షేత్ర స్థాయిలో మహిళల సంరక్షణ, గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. మహిళల భద్రతకు, గంజాయి నియంత్రణకు పోలీసుశాఖ చేపడుతున్నచర్యలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాల నిర్వహణ, సమాచార సేకరణలో దత్తత గ్రామాల పోలీసు సిబ్బంది మరింత క్రియాశీలకంగా పని చేయాలన్నారు. నేరాలనియంత్రణకు ఎప్పటికప్పుడు లాడ్జిలు, వాహన తనిఖీలను చేపట్టాలన్నారు. తరుచూ స్కూల్స్, కళాశాలలు సందర్శించి మహిళల భద్రత, రక్షణ పట్ల అవగాహన కల్పించాలన్నారు. రహదారి ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లును ఏర్పాటు చేయాలని, రాత్రి సమయాల్లో స్టాపర్లు కనిపించే విధంగా వాటిపై రేడియం స్టిక్కర్లును అతికించాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో దర్యాప్తు, సాక్షుల విచారణ, నిందితుల అరెస్టు వంటి వివరాలను ఎప్పటికప్పుడు సి.సి.టి.ఎన్.ఎస్.లో అప్ లోడ్ చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపైన, డ్రంకన్ డ్రైవ్ చేసిన వారిపైన, ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనా ఎన్ఫోర్సుమెంటు కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.

పోలీసు సిబ్బంది లేదా సర్కిల్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు వేచి ఉండేందుకు గజపతినగరం సర్కిల్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన వెయిటింగ్ రూమును జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ప్రారంభించారు. అనంతరం పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ తనిఖీల్లో బొబ్బిలి డిఎస్పీ ఆర్.గోవిందరావు, గజపతినగరం సిఐ ఎస్.సన్యాసి నాయుడు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలరావు, గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్, ఆండ్ర ఎస్ఐ సీతారం మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||

Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space

01/09/2026

||ప్రపంచ గమనానికి నిర్దేశం 'యువ చైతన్యమే'||
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

🌀 'యువ చైతన్యం" పేరుతో యువతను క్షేత్ర స్థాయిలో చైతన్యం చేస్తున్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

🌀 ప్రజలు మరియు చట్టాలు (పోలీసులు) మధ్య యువతే సంధానకర్తలుగా బాధ్యతలు చేపట్టాలని యువతకు పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్

ప్రపంచాన్ని శాసిస్తున్నది యువతేనని, యువత సన్మార్గంలో నడిస్తే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, అందుకు యువత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారు సెప్టెంబర్ 1న నిర్వహించిన "యువ చైతన్యం" కార్యక్రమంలో అన్నారు. యువతలో స్ఫూర్తి నింపడంతోపాటు, వారిని సన్మార్గంలో నడిపించేందుకు, యువతే సారధులుగా క్షేత్ర స్థాయిలో ప్రజల్లో మార్పు తీసుకొని వచ్చేందుకు జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారు 'యువ చైతన్యం' పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంచ సూత్రాలైన 1.మహిళలు, చిన్నారుల పట్ల గౌరవంగా, 2.గంజాయి మరియు డ్రగ్స్ కు దూరంగా, 3.రోడ్డుపై బాధ్యతగా, 4.సైబర్ నేర ప్రపంచంలో అప్రమత్తంగా, 5.బెట్టింగ్ మహమ్మారి నుంచి సురక్షితంగా ఉండాలని యువత మరియు ప్రజలకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.

👉 యువతే సారథులుగా గ్రామాల్లో దురలవాట్లను రూపుమాపి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “యువ చైతన్యం” కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

👉 గ్రామ సందర్శనలు, పల్లె నిద్ర, “మీతో.. మీ ఎస్పీ”, సంకల్పం వంటి కార్యక్రమాల ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతున్నారని తెలిపారు.

👉 యువత చెడు సహవాసాలు, దురలవాట్లకు దూరంగా ఉండాలని, గంజాయికి బానిసలై నేరాలకు పాల్పడుతున్న వారిపై హిస్టరీ షీట్లు తెరిచి నిరంతరం నిఘా ఉంచుతున్నామని తెలిపారు.

👉 మహిళలు, మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

👉 జూదం, క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యసనాలకు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలకు యువత స్వస్తి పలకాలని జిల్లా ఎస్పీ సూచించారు.

👉 గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులకు స్పందించవద్దని, వాట్స్ యాప్ కాలులో అరెస్టు బెదిరింపులకు భయపడవద్దని, సైబర్ మోసాలకు గురికావద్దని జిల్లా ఎస్పీ తెలిపారు.

👉 మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాపును నిక్షిప్తం చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందవచ్చన్నారు.

👉 ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కుటుంబాలను కాపాడుకోవాలని తెలిపారు.

👉 యువత సన్మార్గంలో నడవడంతోపాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు మంచి విషయాలను తెలియజేసి సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు.

👉 ప్రభుత్వం అందిస్తున్న విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.

👉 యువత నేరరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు, గజపతినగరం సిఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ కే.కే.కిరణ్ కుమార్ నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||

Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space

||రహదారి భద్రతపై యువత అవగాహన కలిగి ఉండాలి||- విజయనగరం ట్రాఫిక్ సీఐ ఎస్.రాముజిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ గారి...
31/08/2026

||రహదారి భద్రతపై యువత అవగాహన కలిగి ఉండాలి||
- విజయనగరం ట్రాఫిక్ సీఐ ఎస్.రాము

జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు విజయనగరం పట్టణం బాలాజీనగర్ లోని ఆదిత్య మహిళా కళాశాలలో ట్రాఫిక్ సిఐ ఎస్.రాము ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, మహిళలు మరియు బాలికల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు తదితర అంశాలపై ఆగస్టు 31న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సీఐ ఎస్.రాము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ట్రాఫిక్ సీఐ ఎస్.రాము మాట్లాడుతూ... ప్రస్తుతం నేరాల తీరు, నేరగాళ్లు అనుసరిస్తున్న విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, నేరాల నియంత్రణకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల ఆఫర్లు, లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బెదిరింపుల ద్వారా ప్రజలను మోసగించి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, OTP, PIN, CVV, పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

మహిళలు, బాలలను గౌరవించడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన దిశ యాప్ ను మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో యాప్‌లోని SOS సదుపాయాన్ని వినియోగించి పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు.

యువత రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు.

యువత తమ జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, బెట్టింగ్ యాప్‌లు, జూదానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోకుండా, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఎఎస్ఐ నాగాదిత్య, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

||స్టేషన్ హౌస్ ఆఫీసర్||
||విజయనగరం ట్రాఫిక్ పీఎస్||

🏡 ❤️

Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space

31/08/2026

||సమాజంలో మార్పు 'యువ చైతన్యం' తోనే సాధ్యం||
విజయనగరం జిల్లా ఎస్నీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్
🌀 సమాజహిత కార్యక్రమాల్లో 'యువ చైతన్యం" పేరుతో యువతను భాగస్వామ్యం చేస్తున్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్
🌀 జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఆదేశాలతో ప్రజలు పోలీసుల మధ్య సంధానకర్తలుగా బాధ్యత కలిగిన యువతకు అవకాశం కల్పిస్తున్న జిల్లా పోలీసుశాఖ
యువతలో స్ఫూర్తి నింపడంతోపాటు, వారిని సన్మార్గంలో నడిపించేందుకు, యువతే సారధులుగా క్షేత్ర స్థాయి లో ప్రజల్లో మార్పు తీసుకొని వచ్చేందుకు విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారు వినూత్నంగా చేపట్టిన 'యువ చైతన్యం' కార్యక్రమాన్ని ఆగస్టు 29న గుర్లలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలునందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై, యువతతో మమేకమయ్యారు. వివిధ నేరాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు గురించి, మహిళలు, సైబరు, రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించడంతోపాటు, మద్యం, గంజాయి, బెట్టింగు యాప్లకు దూరంగా ఉండాలని యువతకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. యువతే సారథులుగా, ప్రజలు పోలీసుల మధ్య సంధానకర్తలుగా ప్రజలను జాగృతం చేసి, క్షేత్ర స్థాయిలో ప్రజల్లో మార్పు తీసుకొని వచ్చే లక్ష్యంతో యువతీ, యువకులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ దిశానిర్దేశం చేశారు.
జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడుతూ - యువత తలచుకొంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. చైతన్య వంతమైన యువతి, యువకులతో ప్రజల్లో మార్పు తీసుకొని రావచ్చునన్నారు. యువతే సారధులుగా గ్రామాల్లో దురలవాట్లు రూపుమాపేందుకు, ప్రజల్లో చైతన్య తీసుకొని వచ్చేందుకు “యువ చైతన్యం" కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నేరాల తీరు, మహిళకు రక్షణగా నిలిచే చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు చైతన్యవంతమైన యువత ముందుకు రావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రజలకు పోలీసులు మరింత చేరవయ్యేందుకు గ్రామ సందర్శ నలు, పల్లె నిద్ర, మీతో.. మీ ఎస్పీ, సంకల్పం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇకపై యువతను కూడా ఈ తరహా ప్రజాహిత కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసి, ప్రజల్లో మార్పు తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
కొంతమంది యువత చెడు సహవాసాలు, స్నేహితుల ఒత్తిడి, అవగాహన లోపం, దురలవాట్ల కారణంగా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా ఒకసారి డ్రగ్స్ కు అలవాటుపడినా, విక్రయించినా, రవాణకు పాల్పడినా తీవ్రమైన కేసులలో నిందితులుగా అరెస్టు కావడంతో భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. కావున, గంజాయికి యువత దూరంగా ఉండాలని కోరారు. అదే విధంగా, మహిళలను, మైనరు బాలికలను ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు. మైనరు బాలికలతో అనుచితంగా ప్రవర్తించి, పోక్సో కేసుల్లో నిందితులుగా మారవద్దన్నారు. జూదం, క్రికెట్ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలన్నారు. డబ్బులను సులభంగా సంపాదించాలనే ఆలోచనలకు స్వస్తి పలకాలని యువతను జిల్లా ఎస్పీ కోరారు.
గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులకు స్పందించ వద్దని, అనుమానాస్పద యాప్లు, ఆన్లైన్ పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే సైబరు నేరగాళ్ళ ప్రలోభాలకు లొంగొద్దన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయాలన్నారు. మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకొని, అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ను వినియోగించి, పోలీసుల సహాయం పొందాలన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ చేయవద్దన్నారు. నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా రహదారి ప్రమాదానికి గురైతే, ప్రమాదానికి కారణమైన వ్యక్తితోపాటు, ఏ తప్పు చేయని కుటుంబాలు బాధపడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రమాద కారణంగా కుటుంబ యజమాని ఆకస్మికంగా మరణిస్తే, ఆ కుటుంబ ఆర్థికంగా దెబ్బతిని, నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. కావున, ప్రజలు రహదారి భద్రత ప్రమాణాలు పాటించాలని కోరారు.
యువత సన్మార్గంలో నడిచి, తమతోపాటు ఇతరులను కూడా మంచి మార్గంలో నడిపించే దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. నేర్చుకున్న మంచి విషయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియజేసి సమాజంలో సానుకూల మార్పుకు యువత కృషి చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో యువతే సారథులుగా, ప్రజలు - పోలీసుల మధ్య సంధానకర్తలుగా వ్యవహరించి, నేరరహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యులు కావాలని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ పిలుపునిచ్చారు. అనంతరం, యువతతో గంజాయికి దూరంగా ఉంటామని జిల్లా ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, చీపురువల్లి సిఐ జి.శంకరరావు, గుర్ల ఎస్ఐ పి.నారాయణ రావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
||జిల్లా పోలీసు కార్యాలయం,|| ||విజయనగరం.||
🏡 ❤️

Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space

29/08/2026

28/08/2026

||గంజాయి నియంత్రణే లక్ష్యంగా ట్రెయినులో ఆకస్మిక తనిఖీలు||*
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

🌀 ఆకస్మిక తనిఖీల్లో పాల్గొని, అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

🌀 బృందాలుగా ఏర్పడి కోరాపుట్ నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రెయిన్ కంపార్టుమెంట్లలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు

విజయనగరం జిల్లాలో గంజాయి, మద్యం, ప్రేలుడు సామగ్రి, డ్రగ్స్ అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా ఒడిస్సా కోరాపుట్ నుండి విశాఖపట్నం వెళ్లే ట్రెయినులో ఆగస్టు 28న ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి రైల్వే స్టేషను ప్రాంగణంలోనే ముందుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ దిశానిర్దేశం చేసారు. ఈ తనిఖీల్లో ఎటువంటి గంజాయి, మద్యం, ఇతర నిషేధిత వస్తువులు వంటివి లభించ లేదని, ఈ తరహా తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎన్ గారు మాట్లాడుతూ - విజయనగరం జిల్లాను పూర్తిగా గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీసుశాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, గంజాయి వినియోగించే వారిపైనా, గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్న వారిపైనా, విక్రయాలకు పాల్పడుతున్న వారిపైనా చట్టపరమైన కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపడుతున్నా మన్నారు. ఒడిస్సా నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రెయిన్ లో గంజాయి తరలించే అవకాశం ఉంటుందని భావించి, జిల్లా పోలీసుశాఖకు చెందిన అధికారులు, సిబ్బందితోపాటు జి.ఆర్.పి, ఆర్.పి.ఎఫ్, ఈగల్ పోలీసు బృందాలతో తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో నార్కోటిక్ వస్తువులను గుర్తించుటలో క్రియాశీలకంగా పని చేస్తున్న పోలీసు డాగ్స్ రుద్ర, లవ్లీల సేవలను కూడా వినియోగించామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

ఈ తనిఖీల్లో ట్రెయిన్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి, ఒక్కొక్క కంపార్టుమెంటును పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, డాగ్, బాంబ్ స్క్వాడ్స్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. విజయనగరం రైల్వే స్టేషను నుండి అలమండ రైల్వే స్టేషనుకు వరకు ట్రైన్లో ప్రయాణించి, అన్ని కంపార్టుమెంట్లులోని ప్రయాణికుల బ్యాగులు, లగేజ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసామన్నారు. ఈ తరహా ఆకస్మిక తనిఖీలను భవిష్యత్తులో కూడా కొనసాగించి, జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు మరింతగా చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని జిల్లాఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

ఈ తనిఖీలలో పలువురు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, జి.ఆర్.పి., ఆర్పీఎఫ్, ఈగల్, ఎస్టీఎఫ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||

🏡 ❤️

Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space

బ్రహ్మకుమారీ సేవలు ప్రశంసనీయం||– జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ సోదర సోదరీమణుల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా జరుపుక...
28/08/2026

బ్రహ్మకుమారీ సేవలు ప్రశంసనీయం||
– జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

సోదర సోదరీమణుల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్‌ సందర్భంగా విజయనగరం పట్టణంలో ఓం శాంతి భవనంలో రాఖీ వేడుకలలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ఆగష్టు 28న ముఖ్య అతిథిగా హాజరై, బ్రహ్మకుమారీ సోదరీమణులతో కలిసి రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓం శాంతి భవనంకు చేరుకున్న జిల్లా ఎస్పీ గారికి నిర్వాహకులు, బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం సోదరభావం, పరస్పర గౌరవం, సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించే సందేశంతో బ్రహ్మకుమారీలు జిల్లా ఎస్పీ గారికి రాఖీ కట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు రాఖీ పండుగ విశిష్టతను గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ ప్రేమ, మానవత్వం, సోదరభావంతో జీవించాలని ఆకాంక్షించారు. వేడుకల సందర్భంగా ఆధ్యాత్మికత, మానవతా విలువలు, సమాజ సేవకు సంబంధించిన విషయాలపై ఎస్పీ గారితో బ్రహ్మకుమారీలు ఆత్మీయంగా ముచ్చటించారు. బ్రహ్మకుమారి తరుపున చేపడుతున్న ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు గురించి జిల్లా ఎస్పీ గార్కి వివరించారు. అనంతరం, బ్రహ్మకుమారీలు జిల్లా ఎస్పీ గారికి ఆధ్యాత్మిక పుస్తకాలు, జ్ఞాపికలను అందజేశారు.

ప్రజలను చైతన్యపర్చేందుకు, గంజాయి, మద్యం సేవించడం వంటి దురలవాట్లు నుండి ప్రజలను దూరం చేసేందుకు, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీసుశాఖ, బ్రహ్మకుమారీ సంయుక్తంగా మరిన్ని కార్యక్రమాలను భవిష్యత్తులో చేపడతామన్నారు. పోలీసుశాఖ ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మానవీయ విలువలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, బ్రహ్మకుమారీ సోదరీమణులు పాల్గొన్నారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||

🏡 ❤️

Andhra Pradesh Police
Dgp Andhra Pradesh
AP Police Space

Address

District Police Office
Vizianagaram
535003

Alerts

Be the first to know and let us send you an email when Vizianagaram District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vizianagaram District Police:

Shortcuts

Share