19/03/2024
చైతన్య అన్న మాటలు..
నిజాలు..
మా #గజపతినగరం నియోజకవర్గం కి సంబంధించి ఇన్నాళ్లు నడిపించిన నాయకుని కోసం..
----------------------------------------------------------------------
Dr. Kondapalli Appalanaidu గారు!
విజయనగరం జిల్లాలో పరిచయం అక్కరలేని దమ్మున్న లీడర్.. ఒకటే పార్టీను నమ్ముకొన్న సీనియర్ నాయకుల్లో ఒకరు.. బొత్స కు సరిగ్గా కౌంటర్ ఇచ్చే వ్యక్తి..
ఒకటే పార్టీ #తెలుగుదేశం ను నమ్ముకున్న నాయకులు..
తమ నాయకులు Nara Chandrababu Naidu గారు ఒక్కరే అని పూర్తిగా విశ్వసించిన వ్యక్తి..
Nara Lokesh గారు మాత్రమే భవిష్యత్ నాయకులు అని నమ్మిన వ్యక్తి..
హుందాతనం.. గౌరవం.. నిబద్దత ఆయనతత్వం..
చెప్పిందే చేస్తారు.. చేసేదే చెప్తారు.. మాట ఇస్తే కట్టుబడి ఉంటారు..
----------------------------------------------------------------------
2006 లో తండ్రి (కీ.శే. కొండపల్లి పైడితల్లి నాయుడు గారు) మరణంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
2006లో బొబ్బిలి #ఎంపి గా పోటీ చేసి బై ఎలక్షన్ లో గెలిచినా, ఫలితం మార్చి 157 ఓట్లతో పోయినట్లు ప్రకటించినా పార్టీతో నిరంతరం నడిచిన నాయకుడు.. ఓటమి కి .01% మాత్రమే తేడా.
(2% లోపు తేడా ఉన్నపుడు రీ కౌంటింగ్ చేయాలి.)
డాక్టర్ వృత్తిని వదిలి పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గా, బొబ్బిలి పార్లమెంట్ ఇన్చార్జి గా బాధ్యతలు నిర్వర్తించారు.
2008 లో స్వంత అన్న.. ప్రస్తుతం మా అభ్యర్ది తండ్రి గారు #ప్రజారాజ్యం కు వెళ్ళిపోయినా తండ్రి ఆశయసాధనలో పార్టీ ను నమ్ముకొని కార్యకర్తలతో అండగా ఉన్నారు.
2009 లో విజయనగరం పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసి ఓటమి చెందారు. (అన్ని అసెంబ్లీల అభ్యర్థుల ఓట్లతో పోలిస్తే సుమారు 60 వేలు ఓట్లు అధికంగా వచ్చాయి)
2014-19 వరకు కుటుంబం కంటే ఎక్కువ సమయం గజపతినగరం నియోజకవర్గ అభివృద్ధి కి కేటాయిస్తూ అబివృద్ధి అంటే ఏంటో చూపించిన నాయకులు.గౌరవ మంత్రులతో పోటీ పడి అబివృద్ధి చేశారు. దశాబ్దాల కలలను నెరవేర్చారు..
2017 లో జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చినట్లు వచ్చి చేజారినా పనితీరులో ఎటువంటి మార్పు లేదు. నిబద్దత గానే ఉన్నారు.
(2018 నవంబర్ లో ప్రస్తుత అభ్యర్థి రాజకీయాల్లో వచ్చారు. డిసెంబర్ నుండి టికెట్ అడిగారు. ఇవ్వకపోవడంతో ఆయన తండ్రితో కలసి 2019 మార్చిలో వైఎస్సార్సీపీలో చేరారు.)
2019 లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నాయుడు గారు ఓటమి చెందినా ఏనాడూ వెనుకడుగు వేయలేదు.
2019-24 వరకు ప్రతిపక్షంలో కార్యకర్తలకు అండగా ఉన్న వ్యక్తి.. కరోనా వంటి విపత్కర సమయాల్లో కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ డాక్టర్ గా ఉన్న పరిచయాలను వినియోగించుకొని కార్యకర్తలకు ఉపయోగపడిన నాయకులు.. అధికారులతో కూడా కార్యకర్తల కోసం పనులు చేయించుకోగలిగిన సమర్థవంతులు..
2020 లో మరోసారి జిల్లా పార్టీ అధ్యక్షులు చేజారి, గుంటూరు మచిలీపట్నం పార్లమెంట్ ల సమన్వయకర్త గా నియమించబడ్డారు.
సభ్యత్వ నమోదు గానీ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేయడంలో గానే, కార్యక్రమాల్లో నియోజకవర్గం నుండి హజరులో కానీ ఆయన నాయకత్వంలో #గజపతినగరం నియోజకవర్గం పార్లమెంట్ లో ముందు ఉంది. నాకు తెలిసి ప్రతీ దానిలో పార్లమెంట్లో తొలి/రెండు/మూడు స్థానాల్లోనే ఉంటుంది.
#చంద్రన్న నియోజకవర్గం మీదుగా వెళ్తున్నారు అంటే కేవలం మూడు గంటల్లో సుమారు 15 వేల మందితో స్వాగతం పలికిన నాయకులు..
#నారాలోకేష్ అన్నగారి #శంఖారావం సుమారు 15 వేల మందితో పార్లమెంట్ లోనే టాప్ గా నిర్వహించారు..
#నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని మహిళలతో మొదటి సారి ప్రతి పక్షంలో కార్యక్రమం నిర్వహించిన నాయకులు..
మిల్లర్లు, అధికార పార్టీ నాయకులు రైతులను దోచుకుంటున్నారు అని ప్రత్యేక కార్యక్రమం తీసుకొని #రైతుల కోసం #నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టి కొంతవరకు అధికారుల్లో చలనం వచ్చేలా చేశారు.
#బొత్స ఇసుక దోపిడీని డైరెక్ట్ గా అడ్డుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
#చంద్రబాబు గారు అక్రమ అరెస్ట్ సమయంలో 53 రోజులు పాటు వివిధ వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ, ప్రతీ రోజూ దీక్షలో పాల్గొన్న వ్యక్తి నాయుడు గారు.. ప్రతీ రోజూ 200 మంది పైగా ప్రజలు కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు.
(ప్రస్తుత అభ్యర్థి, ఆయన తండ్రి గారు 2023 జూలైలో చంద్రబాబు గారిని అమరావతిలో కలిశారు, ఆ విషయం బయటకు తెలియడం తో వైఎస్సార్సీపీ పార్టీ కి రాజీనామా చేశారు. అదీ పార్టీ గౌరవం బాగానే ఇచ్చింది అని చెప్తూ.. వైఎస్సార్సీపీ పార్టీ కి రాజీనామా చేసినా చంద్రన్న అరెస్ట్ సమయంలో దీక్షలో పాల్గొనకపోగా కనీసం పత్రికా ముఖంగా కూడా ఖండించలేదు.. చంద్రన్న విడుదల అయ్యాక డిసెంబర్ లో పార్టీలో చేరి ఫిబ్రవరిలో టికెట్ అనౌన్స్ చేయించుకున్నారు.)
పార్టీ టికెట్ మార్చినా నాయుడు గారు ఒక్కటే చెప్పారు. పార్టీలు మారి వచ్చిన #బొత్స_అనుచరులకు పనిచేయం..
ప్రతిపక్షంలో మనం కష్టపడ్డాం, పార్టీ ను బలోపేతం చేశాం. ఎక్కడో #పొరపాటు జరిగి ఉండవచ్చు. బొత్సా తో ఏడు ఎన్నికల్లో పోరాడాం.. ఇది ఎనిమిదో ఎన్నిక.. మరోసారి పునః పరిశీలన చేయమని కోరుదాం అని అన్నారు.. ఇదే నాయకుని కి పార్టీ పట్ల ఉన్న నిబద్దత అనుకున్నా..
ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉన్న నాయకులు అంతా పదవులకు రాజీనామా చేశారు.. పార్టీ తోనే ఉన్నారు. పార్టీతోనే ఉంటారు.. 20 రోజులు దాటినా నాయుడు గారికి మద్దతుగా ఉన్నారు.. ఇదే నాయకత్వానికి ఉండే విలువ.. కార్యకర్తలతో అనుబంధం అనుకుంటున్నా..
రాష్ట్ర పార్టీ ఏ బాధ్యత అప్పగించినా మా ఇన్చార్జి గారు సమర్థవంతంగా నిర్వర్తించారు.. #పనిచేయడం తప్ప #షో అలవాటు లేని వ్యక్తి..ఇదే ఆయనను ముంచి ఉండవచ్చు.. రాష్ట్ర పార్టీ మరోసారి పునః పరిశీలన చేసి ఆయనకు అవకాశం ఇస్తుందని అనుకుంటున్నా..
----------------------------------------------------------------------
నేను పార్టీ పట్ల నిబద్ధత గల వ్యక్తిని..నాకు పార్టీ ముఖ్యం, పార్టీ ను బలోపేతం చేసిన నాయకులు కూడా ముఖ్యం..ఇంత పెద్ద వ్యవస్థలో పొరపాట్లు సహజం..
ఒకటే పార్టీ ని నమ్ముకుని పార్టీ బలోపేతానికి నాయకులు పనిచేసినప్పుడు వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది, అనుకోని పొరపాటు (నాకు తెలిసి రిపోర్టులు అయితే మారాయి) జరిగినప్పుడు తెలియజేయాల్సిన అవసరం ఉందని పార్టీకి తెలియజేసా.
----------------------------------------------------------------------
మా అభ్యర్థికి నాకు ఎటువంటి గొడవలు లేవు.. ఇప్పటికే వారు ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీ కి వెళ్లి వచ్చారు. చంద్రన్న అక్రమ అరెస్ట్ సమయంలో కనీసం పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేదు అనే బాధ తప్ప..
---------------------------------------------------------------------