District Collector, Vizianagaram

District Collector, Vizianagaram Official Handle of Collector and District Magistrate, Vizianagaram. S.Ramsundar Reddy, I.A.S.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న రెండు రోజుల జిల్లా ఎన్నికల అధికారుల శ...
02/09/2026

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న రెండు రోజుల జిల్లా ఎన్నికల అధికారుల శిక్షణకు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో తాజా విధానాలు, నిబంధనలు, సాంకేతిక అంశాలపై శిక్షణ పొందుతున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి. పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లో 2...
31/08/2026

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి. పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లో 207 వినతులు స్వీకరణ. రెవెన్యూ, భూసర్వే సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యత, పెండింగ్ అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశం

విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల పథకం (PMFME)ను సమర్థవంతంగా అమలు చేస్తూ గణనీయమైన ప్రగతి సాధిం...
31/08/2026

విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల పథకం (PMFME)ను సమర్థవంతంగా అమలు చేస్తూ గణనీయమైన ప్రగతి సాధించినందుకు జిల్లా యంత్రాంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ఆహార శుద్ధి రంగాన్ని మరింత విస్తరించడంతో పాటు సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం అందించేందుకు అమలు చేస్తున్న PMFME పథకంలో విశేష కృషి చేసిన డీఆర్‌పీ (District Resource Person) నెయ్యి గాపుల శ్రీనివాసరావు విజయనగరం జిల్లా నుంచి జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను సన్మానించి అవార్డు అందజేశారు.
గత సంవత్సరం PMFME పథకం అమలులో 100% ఫలితాలు సాధించడం ద్వారా విజయనగరం జిల్లా ఈ జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషమని జిల్లా కలెక్టర్ అన్నారు. అవార్డుకు ఎంపికైన శ్రీనివాసరావును జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అభినందించారు. PMFME పథకం ద్వారా జిల్లాలోని సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం కల్పించి, రైతులు, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి కె. చిట్టిబాబు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం, ఉద్యానశాఖ అధికారులు, డీఆర్‌పీల సమన్వయంతో పథకం అమలులో సాధించిన ప్రగతికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందని అధికారులు జిల్లా కలెక్టర్ వారికి వివరించారు .

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే ఉద్దేశంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమాన్ని న...
31/08/2026

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే ఉద్దేశంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నేడు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉదయం 10.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి తెలిపారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు, ఫిర్యాదులు, వినతులను పీజీఆర్‌ఎస్‌లో సమర్పించి సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకురావచ్చని కలెక్టర్‌ సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలకు ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు QR కోడ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో తమకు అందిన సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్‌ను QR కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చని తెలిపారు.
మొబైల్‌ ఫోన్‌లో QR కోడ్‌ను స్కాన్‌ చేసిన అనంతరం తెరుచుకునే పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ పేజీలో అవసరమైన వివరాలను నమోదు చేసి తమ అభిప్రాయాన్ని/ఫిర్యాదును సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రజలు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు హాజరై తమ సమస్యలను అధికారులకు తెలియజేయడంతో పాటు, అందుబాటులో ఉన్న QR కోడ్‌ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి కోరారు.

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్‌-2026లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని జిల్లా క...
29/08/2026

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్‌-2026లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెబెక్స్‌ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం, సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాల లభ్యత తదితర అంశాలపై జిల్లా వ్యవసాయ శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో విత్తన కాలం ముగిసే అవకాశం ఉన్నందున, రైతుల అవసరాలకు అనుగుణంగా అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు.
వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటి అవసరమయ్యే రాగి, జనుము, ఉలవలు, మినుములు, పెసలు వంటి ప్రత్యామ్నాయ పంటలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో పశుగ్రాసం, కూరగాయల పంటల సాగును కూడా ప్రోత్సహించాలన్నారు. విత్తన పెల్లెటైజేషన్ వంటి పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శాఖల వారీగా కాకుండా సమన్వయంతో, ప్రాధాన్యతా క్రమంలో స్పష్టమైన యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో రైతులకు ఎటువంటి సహకారం అవసరమో క్షేత్రస్థాయిలో గుర్తించి, అందుకు అనుగుణంగా విత్తనాలు, సాంకేతిక సూచనలు, ఇతర అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు.
గత ఏడాది కంటే ఒక్క ఎకరా పంట విస్తీర్ణం కూడా తగ్గకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయ పంటల ద్వారా రైతులకు నష్టం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా రైతుల అవసరాలను అంచనా వేసి సమగ్ర కంటింజెన్సీ పంటల ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు.
రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, అందుబాటులో ఉన్న విత్తనాలు, సాగు పద్ధతులు, ప్రభుత్వ సహాయ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు మండల స్థాయిలో సంబంధిత శాఖల అధికారుల భాగస్వామ్యంతో సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, అవగాహన వీడియోలు, సమాచార సందేశాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచి, ముందస్తు ప్రణాళికతో పంటలను కాపాడేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డ...
29/08/2026

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనకు నిర్ణయించిన గడువు వరకు వేచి చూడకుండా, వెంటనే పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే, సంబంధిత శాఖతో సమన్వయం చేసుకుని త్వరగా అనుమతులు వచ్చేలా చూడాలని పరిశ్రమల శాఖను ఆదేశించారు.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు మరియు ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని శనివారం వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశ నిర్ణయాల అమలు, ఏపీఐఐసీ అంశాలు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, సింగిల్ డెస్క్ పాలసీ కింద దరఖాస్తుల పురోగతిపై సమీక్షించారు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం తరఫున సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు. ఇప్పటివరకు నిర్వహించిన వర్క్‌షాప్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా సమీక్షించారు.
కేంద్ర ప్రభుత్వం పీఎంఈజీపీ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలో సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటివరకు 26 దరఖాస్తులు అందాయని, అవి పరిశీలనలో ఉన్నాయని వివరించారు.
ఇప్పటికే భూమి అందించి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, వివిధ దశల్లో ఉన్న సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్, మా మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ పురోగతిని సమీక్షించారు. అలాగే ఎంఓయూలు కుదుర్చుకున్న స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్, స్టీల్ ఎక్స్చేంజ్ ఇన్‌ఫ్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, అన్సుమీ కార్పొరేషన్, వైశాఖి గ్రోత్ కారిడార్, రుషీల్ డెకర్స్, ఎలైట్ లాజిక్స్ ఎగ్జిబి ఏజెన్సీ ఇండియా లిమిటెడ్ తదితర సంస్థల డీపీఆర్‌లు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్...
29/08/2026

జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు.
నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విజయనగరంలోని గాజులరేగ ION డిజిటల్ జోన్లో నీట్ పీజీ - 2026 ప్రవేశ పరీక్ష జరగనుంది. జిల్లాలో మొత్తం 475 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులు ఉదయం 7 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గాడ్జెట్లు, ఆభరణాలను అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రంలో జామర్లు ఏర్పాటు చేసినందున నెట్‌వర్క్ సదుపాయం అందుబాటులో ఉండదని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఒకసారి ప్రవేశించిన తరువాత పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండదన్నారు. పరీక్ష కేంద్రం వద్ద BNSS 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి సమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మహిళా వైద్యురాలిని అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఉదయం 7 గంటల నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
పరీక్షకు ముందు రోజు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి అభ్యర్థులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యేలా చూడాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. పరీక్ష రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను సంబ‌రం, విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను అత్యంత వైభ‌వోపేతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేయాల...
28/08/2026

శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను సంబ‌రం, విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను అత్యంత వైభ‌వోపేతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అక్టోబ‌రు 25,26 తేదీల్లో విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలు, 27న సిరిమానోత్స‌వం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అమ్మ‌వారి పండుగ ఏర్పాట్ల‌పై వివిధ శాఖ‌ల అధికారులతో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆయా శాఖ‌ల‌న్నీ త‌మ‌కు కేటాయించిన విధుల‌ను, ప‌ర‌స్ప‌రం స‌మ‌న్వ‌యంతో ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.
గ‌త ఏడాది కంటే మిన్న‌గా ఈ ఏడాది పండ‌గను నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ అన్నారు. నిర్ణీత స‌మ‌యానికే సిరిమానోత్స‌వం మొద‌ల‌య్యేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు. దీనికోసం ఉద‌యం 11 గంట‌ల‌కే సిరిమానును అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకొనేలా చూడాల‌న్నారు. అలాగే తెల్ల ఏనుగు త‌దిత‌ర వాటిని ముందురోజే సిద్దం చేసుకోవాల‌ని సూచించారు. పారిశుధ్య ఏర్పాట్లు గ‌త ఏడాదికంటే మెరుగ్గా చేయాల‌న్నారు. ఎల్ఈడి స్క్రీన్లు, సిసి కెమేరాల‌ను ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. క్యూలైన్ల‌లో భ‌క్తులు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌ని, ముఖ్యంగా విఐపి ద‌ర్శ‌నాల స‌మ‌యాల్లో సైతం సాధార‌ణ భ‌క్తుల ద‌ర్శ‌నాలు ఆగ‌కుండా చూడాల‌ని ఆదేశించారు. ఆ మూడు రోజులూ ప‌ట్ట‌ణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాల‌తో అందంగా అలంక‌రించాల‌ని సూచించారు. గ‌తం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాల‌ని, ఎక్క‌డా ఎటువంటి లోటుపాట్లూ త‌లెత్త‌కూడ‌ద‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల ఏర్పాట్ల‌పై త్వ‌ర‌లో మ‌రో స‌మావేశాన్ని నిర్వ‌హించి చ‌ర్చిస్తామ‌ని తెలిపారు.
జిల్లా SP ఏఆర్ దామోద‌ర్ మాట్లాడుతూ, ఈ ఏడాది అమ్మ‌వారి పండుగ‌కు సుమారు 3.5 లక్ష‌ల మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా బారికేడింగ్ అత్యంత ప‌టిష్టంగా ఉండేలా చూడాల‌న్నారు. ర‌ధాల‌ను ముందుగా సిద్దం చేయాల‌ని సూచించారు. అలాగే భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా సిరిమానోత్స‌వాన్ని వెలుతురు ఉండ‌గానే ముగించేలా, నిర్ణీత స‌మ‌యానికే ప్రారంభించాల‌ని కోరారు.

SIR ప్రక్రియను పకడ్బందీగా, నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టోరల్ రోల్‌ అబ్జర్వర్‌ ...
28/08/2026

SIR ప్రక్రియను పకడ్బందీగా, నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టోరల్ రోల్‌ అబ్జర్వర్‌ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటును తొల‌గించ‌కుండా, అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై జిల్లా ఎలక్టోరల్‌ అబ్జర్వర్‌ రోణంకి గోపాలకృష్ణ శుక్రవారం కలెక్టరేట్‌లో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో స‌ర్ ప్ర‌క్రియ పురోగ‌తిని వివ‌రించారు. మ్యాపింగ్ కాని, ఎనామ‌లీస్‌కు సంబంధించి సుమారు ల‌క్షా, 93,734 మందికి నోటీసుల‌ను అంద‌జేసిన‌ట్లు తెలిపారు. వారినుంచి వివ‌ర‌ణ తీసుకున్న త‌రువాతే, వారి ఓటుపై త‌గిన నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. అలాగే ఈ నెల 29,30 తేదీల్లో స్పెష‌ల్ క్యాంపెయిన్ నిర్వ‌హిస్తున్నామ‌ని, ఆ రెండు రోజులూ బిఎల్ఓలంతా పోలింగ్ కేంద్రాల్లో ఉంటార‌ని చెప్పారు. ఖాళీ 6,7,8 ఫారాల‌న్నీ అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపారు.
ఈ సందర్భంగా ఎలక్టోరల్ రోల్‌ అబ్జర్వర్ రోణంకి మాట్లాడుతూ..ప్ర‌తీఏటా ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌కియ జ‌రుగుతోంద‌ని, ఈ సారి 2004 జాబితాతో మ్యాపింగ్ చేసి ఈ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ముసాయిదా జాబితాను ప్ర‌చురించ‌డం జ‌రిగింద‌ని, ప‌లు మార్పులు చేర్పులు అనంత‌రం అక్టోబ‌రు 3న తుది జాబితా ప్ర‌చుర‌ణ జ‌రుగుతుంద‌ని తెలిపారు. నోటీసు ఇవ్వ‌కుండా, అర్హ‌త ఉన్న ఏ ఒక్క‌రి ఓటు తొల‌గించ‌డం జ‌ర‌గ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చడంతో పాటు, యువ ఓట‌ర్ల‌పై దృష్టి పెట్టాల‌ని కోరారు. దీనికోసం జిల్లాలో విస్తృతంగా స్వీప్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి, పెద్ద ఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. జిల్లాలో సుమారు 82వేల మంది యువ ఓట‌ర్ల‌ను జాబితాలో చేర్పించాల్సి ఉంద‌న్నారు. అలాగే పివిటిజిల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టి, వారికి ఓటుహ‌క్కును క‌ల్పించాలని కోరారు. జిల్లాలో ఈపి రేషియో (జ‌నాభాలో ఓట‌ర్ల శాతం) 630 పై సంతృప్తిని వ్య‌క్తం చేస్తూనే, దానిని ఇంకా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాజ‌కీయ పార్టీలు త‌మ స‌ల‌హాలు, సూచ‌న‌లు, అభ్యంత‌రాలు ఏమైనా త‌న‌కు నేరుగా తెలియ‌జేయ‌వ‌చ్చున‌ని సూచించారు.

రహదారి ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్...
28/08/2026

రహదారి ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్. రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. హిట్‌ అండ్‌ రన్‌/రహదారి ప్రమాద పరిహారానికి సంబంధించి నిర్వహించిన వర్చువల్‌ పరిహార కమిటీ సమావేశంలో మొత్తం 7 కేసులను పరిశీలించి, అర్హత కలిగిన బాధితులకు రూ.8 లక్షల పరిహారం అందించేందుకు కమిటీ సిఫార్సు చేసింది.
పరిహార కమిటీ సమావేశంలో ప్రమాదాలకు సంబంధించిన రికార్డులు, కేసు నివేదికలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, సంబంధిత వివరాలను సమగ్రంగా పరిశీలించారు. మరణించిన వారి కేసులు – 3 ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున, మొత్తం రూ.6 లక్షలు పరిహారం అందించేందుకు సిఫార్సు చేశారు. గాయపడిన వారి కేసులు – 4: ఒక్కో బాధితుడికి రూ.50 వేల చొప్పున, మొత్తం రూ.2 లక్షలు పరిహారం సిఫార్సు చేశారు. 3 మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, 4 మంది గాయపడిన బాధితులకు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.8 లక్షల పరిహారం అందించేందుకు కమిటీ సిఫార్సు చేసింది.
ప్రమాదాలకు సంబంధించిన పోలీసు కేసు వివరాలు, ప్రమాద రికార్డులు, వైద్య సంబంధిత పత్రాలు, పరిహారానికి సంబంధించిన ఇతర ఆధారాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రతి కేసును నిబంధనల ప్రకారం పరిశీలించిన అనంతరం అర్హత ఉన్న కేసులకు పరిహారంనకు సిఫార్సు చేశారు.సమావేశంలో కమిటీ సభ్యుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో మొత్తం 7 కేసులకు పరిహారం సిఫార్సు చేస్తూ జిల్లా కలెక్టర్ మరియు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.ఇన్సూరెన్స్‌ సంస్థకు ఫైలు పంపించి నిధుల విడుదల కమిటీ నిర్ణయం అనంతరం సభ్యులందరి డిజిటల్‌ లేదా భౌతిక సంతకాలు పూర్తిచేసి సంబంధిత ఫైలును జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థకు పంపనున్నట్లు అధికారులు కలెక్టర్ కి వివరించారు. తదుపరి నిబంధనల ప్రకారం పరిహారం మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు బాధిత కుటుంబాలు పరిహారం కోసం అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రక్రియను పూర్తి చేయాలని సమావేశం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
“ప్రమాద బాధితులకు తక్షణ సహాయం – అర్హులకు సత్వర పరిహారం – పారదర్శకంగా కేసుల పరిష్కారం” అనే లక్ష్యంతో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు
ఈ సమావేశం ద్వారా 7 ప్రమాద బాధిత కేసులకు మొత్తం రూ.8 లక్షల పరిహారం సిఫార్సు చేయడం ద్వారా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే సహాయాన్ని వేగవంతం చేయడానికి సంబంధిత అధికారులు బాధితులకు సత్వర సహాయం అందించడానికి సమన్వయంతో కృషి చేయాలని స్పష్టం చేశారు.

Address

Collectorate
Vizianagaram
535003

Website

Alerts

Be the first to know and let us send you an email when District Collector, Vizianagaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share