02/09/2023
ఇడుపులపాయ, వైయస్ఆర్ జిల్లా.
ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం.
వైయస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైయస్ జగన్ ఘన నివాళి
ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న వైయస్ కుటుంబ సభ్యులు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, సీఎం వైయస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు.
స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు.
సీఎం శ్రీ వైఎస్ జగన్, ఆయన సతీమణి శ్రీమతి వైఎస్ భారతి, తల్లి శ్రీమతి వైఎస్ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు.. వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు