23/12/2022
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)వనపర్తి జిల్లా లో పెబ్బేరు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వనపర్తి జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 2200కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలనీ,అదే విదంగా హాస్టల్ తరుచుగా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది.వెంటనే క్రింది డిమాండ్స్ ను వెంటనే అమలు చేయాలనీ తెలియజేయడం జరిగింది. లేనిచో ఇదే విద్యార్థుల తో మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది.
డిమాండ్స్ :
1.2200కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి.
2. నిరుద్యోగ భృతి (3016)వెంటనే అమలు చేయాలి.
3.J. L&D.L పోస్ట్లను వెంటనే భర్తీ చేయాలి.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాస్కర్ రవి , కురుమూర్తి అరుణ్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు..💫💫💫