PS Pebbair

PS Pebbair Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PS Pebbair, Government Organization, Wanaparthy.

Yesterday we hand over 5 lost mobiles to their original owner in Pebbair PS,  and Pangal PS respectively by CEIR portal ...
18/10/2024

Yesterday we hand over 5 lost mobiles to their original owner in Pebbair PS, and Pangal PS respectively by CEIR portal (https://www.ceir.gov.in/Home/index.jsp) , please report in above link if mobile lost .

*తేది:08-10-2024**పేకాట స్థావరం పై పోలీసులు దాడి*------------------------------------- *రూ,,6,35,600/- నగదు, 4 కార్లు,3 ...
11/10/2024

*తేది:08-10-2024*

*పేకాట స్థావరం పై పోలీసులు దాడి*
-------------------------------------

*రూ,,6,35,600/- నగదు, 4 కార్లు,3 బైక్ లు, 15 మొబైల్స్ స్వాధీనం*

*15 మందిపై కేసు నమోదు*

వనపర్తి: తేది : 07-10-2024 రోజు సాయంత్రం వనపర్తి జిల్లా సరిహద్దులోని పెబ్బేర్ పోలీస్ స్టేషన్ రంగాపూర్ శివారులోని కృష్ణానది ప్రక్కన ఒక గోదాంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ లకు నమ్మదగిన సమచారం మేరకు *జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్* గారి ఆదేశాల మేరకు స్పెషల్ సి, సి,ఎస్, సీఐ రవిపాల్, పెబ్బేర్ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి, సిబ్బంది, మరియు వనపర్తి పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరం పై దాడి నిర్వహించి 15 మందిని అరెస్టు చేసి 6,35,600/- రూపాయాల నగదు,
4 కార్లు, 4బైక్ లు మరియు 15 మొబైల్స్ పోన్ లు స్వాధీనం చేసుకొని పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.
*కేసు నమోదు అయిన వారి వివరాలు*
1.పల్లె వెంకటయ్య - గుడ్డం దొడ్డి, ధరూర్
2. దౌలు - దౌధర్ పల్లి, గద్వాల్
3. గుంజ పల్లి వీరేష్, మట్టి పేట రాయచూర్
4. ఆంజనేయులు, పారుచర్ల, ధరూర్
5. అశోక్ - గద్వాల్
6. ఉప్పరి గోపాల్ - ఎర్రవల్లి
7. మద్ది లేటి, కొండేర్, ఎర్రవల్లి
8. జలీల్ భాషా, రాయచూర్
9. పాడ రామిరెడ్డి - ఎర్రవల్లి
10. సత్య స్వరూఫ్ - గద్వాల్
11. కూర్వ వీరన్న - కొండేరు,ఎర్రవల్లి
12. కృష్ణయ్య , రంగాపురం, పెబ్బేరు
13. వెంకటన్న, కొండేరు, ఎర్రవల్లి.
14. నాగి రెడ్డి, చెలిమిల్ల, పెబ్బేరు .
15. నరసింహ రెడ్డి , పెద్దొడ్డి, మల్దకల్లు లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీ చుట్టు పక్కల పరిసర ప్రాంతాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లు అనుమానం కలిగిన ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ తెలిపారు.

పి, ఆర్, ఓ
జిల్లా పోలీస్ కార్యాలయం
వనపర్తి జిల్లా
💐🙏🙏💐

తేదీ : 01.10.2024వనపర్తి జిల్లా. *పెబ్బేరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన  జిల్లా ఎస్పీ..... శ్రీ రావుల గిరిధర్...
11/10/2024

తేదీ : 01.10.2024
వనపర్తి జిల్లా.

*పెబ్బేరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..... శ్రీ రావుల గిరిధర్, ఐపీఎస్*

వనపర్తి జిల్లా లోని పెబ్బేరు పోలీస్ స్టేషన్ ఈ రోజు జిల్లా *ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ , ఐపీఎస్* గారు ఆకస్మికంగా తనకి చేశారు పెబ్బేరు పిఎస్ నందుగల పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు వాటి పురోగతిపై సంబంధిత ఎస్సై శ్రీ హరి ప్రసాద్ రెడ్డి ని అడిగి కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.పోలీస్ స్టేషన్ల వారీగా U.I కేసులు తగ్గించుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు,
క్రైమ్ అగైనెస్ట్ ఉమన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, తదితర కేసులను, మిసింగ్ కేసులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని త్వరితగతిన కనుగొనేలా చేయాలని ఆదేశించారు.అరెస్టులు, చార్జ్ షీట్లు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా చూసుకోవాలని వాటికి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నమోదైన కేసులలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అన్నీ ఆదారాలు సేకరించి చార్జిషీట్
ఫైల్ చేయాలన్నారు. పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను CCTNS లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు. మహిళల, చిన్నారుల అదృశ్యం కేసులలో ఏ విధమైన అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, తప్పిపోయిన వారిని పట్టుకొనుటలో నిబద్ధత చూపించాలని సూచించారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని దొంగిలించిన సొత్తును రికవరీ చేయాలన్నారు. బీట్లు, పికెట్స్ ఏర్పాటు చేసుకొని తరుచుగా బీట్ చెక్ చేస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు. దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
దొంగతనాలను అరికట్టేందుకు హైవే రహదారులపై వాహనాల తనిఖీలు చేస్తూ ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వాహన తనిఖీలు చేపట్టి ఎం.వి.చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ, ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోన్ యాప్ ల మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్యం చేయాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ముందస్తు సమాచారం సేకరించి వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలను రవాణా మరియు విక్రయించే వారిపై NDPS కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా వ్యవహరించాలి పూర్తిస్థాయిలో విచారణ దర్యాప్తు చేసి ఖచ్చితమైన ఆధారాలతో కోర్టుకు సమర్పించి బాధితులకు సరైన న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా బస్టాండ్కు ఎదురుగా ఉన్న ఏటీఎం ను పరిశీలించి నిందితులను త్వరగా పట్టుకోవాలని ఎస్సై సీఐలను ఆదేశించారు.

ఎస్పీ గారి తో పాటు వనపర్తి డిఎస్పి శ్రీ జయ వెంకటేశ్వరరావు గారు, కొత్తకోట సిఐ రాంబాబు పెబ్బేరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు

PRO,
జిల్లా పోలీసు కార్యాలయం, వనపర్తి.

తేది: 14.08.2024వనపర్తి జిల్లా*                                                                                         ...
11/10/2024

తేది: 14.08.2024
వనపర్తి జిల్లా*

*పోలీసు వాహనాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గారు*

వనపర్తి జిల్లా పరిధిలోని పోలీసు వాహనాల పనితీరు వాటి నిర్వహణను వనపర్తి జిల్లా ఎస్ రావుల గిరిధర్, ఐపీఎస్ గారు జిల్లా ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్( MT.Section)లో పరిశీలించారు. వాహనల పనితీరు, నిర్వహణపై రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లు నివేదిక ఎస్పీ గారికి అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..... వనపర్తి జిల్లా పరిధి లోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల పోలీస్ వాహనాలు నిరంతరంగా వివిధ ప్రజాసేవలకు, ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా ప్రజా సేవలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వాహనాల నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెలవారీగా సమర్పించాలని మోటార్ వాహనాల అధికారికి కు తెలియజేశారు వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు. పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, టైర్ల నిర్వహణ ఉత్తమ ప్రమాణాలను పాటించుకుంటూ డ్రైవర్లకు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించాలని తెలియజేశారు
అదేవిధంగా MT. ఆఫీసులో డ్రైవర్ల విశ్రాంతి గది నందు గల క్యారం బోర్డు డ్రైవర్లతో మరియు అధికారులతో కాసేపు సరదాగా ఆడారు
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీ రామదాసు తేజావత్ గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ గారు, అప్పలనాయుడు గారు, ఆర్ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

PRO
జిల్లా పోలీస్ కార్యాలయం వనపర్తి.

పత్రికా ప్రకటనవనపర్తి జిల్లా పోలీస్తేది: 26.11.2023*వాహనాల తనిఖీల్లో  3,63,500/- రూపాయలు సీజ్ 95 లీటర్ల మధ్యము సీజ్*సాధా...
26/11/2023

పత్రికా ప్రకటన

వనపర్తి జిల్లా పోలీస్

తేది: 26.11.2023

*వాహనాల తనిఖీల్లో 3,63,500/- రూపాయలు సీజ్ 95 లీటర్ల మధ్యము సీజ్*

సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున *జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కె మూర్తి, ఐపీఎస్ గారి* ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా పరిధిలో ఈ రోజు వాహనాల తనిఖీల్లో బాగంగా...

ఈరోజు జిల్లా పరిధిలో వాహనాల తనిఖీల్లో పెద్దమందడి పోలీస్ స్టేషన్ పరిధిలో బలిద్ పల్లి దగ్గర వాహనల తనిఖీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి దగ్గర 94,000/- రూపాయలు, శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1,00,000/-, పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో 1,69,500/- ఉండగా అట్టి రూపాయలకు ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున సీజ్ చేయడం జరిగినది. ఈరోజు జిల్లాలో మొత్తం 3,63,500/-సీజ్ చేయడం జరిగినది.
అదేవిధంగా కొత్తకోట పోలీస్ స్టేషన్ దగ్గర వాహనాలతానికి నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి దగ్గర 32 లీటర్ల మధ్యము, పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో 26 లీటర్లు, వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 26 లీటర్లు మరియు శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకునేది.
ఈరోజు వనపర్తి జిల్లాలో మొత్తం 3,63,500/- రూపాయలు మరియు 95 లీటర్ల మద్యం పట్టుబడినవి.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వనపర్తి జిల్లా పరిధిలో ఎవరైన 50వేల రూపాయల కొద్దీ ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే రసీదు, తగిన పత్రాలు వాటి వివరాలు ఉండాలని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్లారాధని ఎస్సై గారు తెలిపారు.

పి.ఆర్.ఓ.
ఎస్పీ.కార్యాలయం

Pebbair PS : Today Conducted vehicle checking at Pebbair  PS limits found an amount of 1,69,500/- from 1 person  and The...
26/11/2023

Pebbair PS :
Today Conducted vehicle checking at Pebbair PS limits found an amount of 1,69,500/- from 1 person and The same cash was seized duly followed the procedure and being deposited before the concerned authorities.
Wanaparthy District Police.

జిల్లా పోలీసు కార్యాలయం, వనపర్తి జిల్లా.పత్రిక ప్రకటన - 24.11.2023.                                                     ...
24/11/2023

జిల్లా పోలీసు కార్యాలయం,
వనపర్తి జిల్లా.

పత్రిక ప్రకటన - 24.11.2023.
జిల్లాలో విస్తృత వాహనాల తనిఖీలు
జిల్లా ఎస్ *.పి శ్రీమతి రక్షిత కె మూర్తి, ఐ.పి.ఎస్* గారి ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీ ల్లో భాగంగా ఈ రోజు పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహానాలు తనిఖీ చేయగా ఎలాంటి ఆదారాలు లేని డబ్బు 1,28,500/-రూ/ సీజ్ చేసి ఎన్నికల గ్రీవెన్స్ సెల్ వారికి అప్పగించనైనది. అదేవిధంగా చిన్నంబాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు 189 చీరలు విలువ 1,13,400/-
స్వాధీన పరుచుకోనైనది
జిల్లా పోలీసు ఉన్నత అధికారి,
వనపర్తి జిల్లా.

PEBBAIR PS : Today evening hoursConducted vehicle checking at Pebbair  PS limits and found an amount of 1,28,500/- from ...
24/11/2023

PEBBAIR PS :
Today evening hours
Conducted vehicle checking at Pebbair PS limits and found an amount of 1,28,500/- from 1 person and The same cash was seized duly followed the procedure and being deposited before the concerned authorities.
Wanaparthy District Police.

Pebbair PS : Today evening hours joint operation of  CCS team  and Pebbair PS staff Conducted searches in Pebbair PS lim...
13/10/2023

Pebbair PS :
Today evening hours joint operation of CCS team and Pebbair PS staff
Conducted searches in Pebbair PS limits and seized 55.250 litres liquor and duly followed the procedure meanwhile deposited before the concerned authorities.
Wanaparthy District Police.

Address

Wanaparthy

Telephone

9440795729

Website

Alerts

Be the first to know and let us send you an email when PS Pebbair posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share