Vnews

Vnews V NEWS YOUTUBE CHANNEL...
REGULARLY WE CONNECT WITH PUBLIC AND TAKE THE EXIT POOLS OF POLITICAL LEADERS AND POLITICAL PARTIES.

v news channel always connect with public and collect the samples of political parties and political leaders...

Pls follow and subscribe... Watch more information...
18/10/2025

Pls follow and subscribe... Watch more information...

25/03/2023

విచిత్రమైన పరిస్థితి లో తెలంగాణ ఓటరు ..ఎటు తేల్చుకోలేకపోతున్న ప్రజలు ..ఇప్పుడు వచ్చే పథకాలు ఇస్తాం అని చెప్పలేక పొతున్న ప్రతిపక్షాలు ..ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలు ప్రజలని ఆకర్షించడం లేదు ..ఎంతో కొంత అర్బన్ లో బీజేపీ కి ఉన్న రురల్ లో ఉనికి లేదు ..వాళ్ళు తెరాస టాప్ లెవెల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ రురల్ లో వారికీ కార్యకర్త లేరు ..అర్బన్ లో వద్దు అన్న ఓట్లు పడుతాయి బీజేపీ కి...దానికి ఇంతమంది పని చెయ్యడం అవసరమా ..నిజం చెప్పాలంటే అ కాంగ్రెస్ కొంత బలపడుతుంది అని చెప్పవచ్చు రురల్ లో. కానీ క్యాడర్ మొత్తం డిసప్పోయింటింగ్ లో వున్నారు. వారు ఈ ౮ నెల్లల్లో సాధ్యమగునా ? ప్రజల నాడి తెలిసిన డాక్టర్ గా కెసిఆర్ సిద్దహస్తుడు దానిలో నో డౌట్ ..కెసిఆర్ ని తక్కువ అంచనా వేస్తే ఆ పార్టీ లు కాల గర్భం లో కలవడం పక్క ..దేశ చరిత్ర లో బీజేపీ ని దాదాపుగా వన్ ఇయర్ నుండి ఢీకొట్టుతున్నాడు అంటే మాములు విషయం కాదు ..ఇంకో కీలక విషయం ఏంటి ఆంటీ తెరాస బీజేపీ కొట్టుకుంటుంటే కాంగ్రెస్ నాయకులూ ప్రజల్లో తిరుగుతున్నారు సైలెంట్ గ పని కానిస్తున్నారు ...అది కూడా తెరాస కి లాభమే ..కెసిఆర్ కి కూడా అదే కావాలి ..ఇప్పుడు ఓటర్ ఎవ్వరికి వోట్ వెయ్యాలి అని డౌట్ లో అన్నాడు ...బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో సైలెంట్ ఓట్లు చాల పోల్ అవుతాయి ..చూడాలి అవి ఎవ్వరికి పడుతాయో ....

Please subscribe my channel... I will come with exact polls from feb 1st...
21/01/2023

Please subscribe my channel... I will come with exact polls from feb 1st...

12/03/2022

V NEWS... Pls subscribe...

11/02/2022

Pls watch

15/11/2020

వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తారీఖు నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ను లాంచ్ చేస్తారని సీఎం తెలిపారు.

ఇవాళ ప్రగతిభవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది. అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నది. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. ధరణి ద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని నిశ్చింతను వ్యక్తం చేస్తున్నరు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా వున్నది. ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించింది. మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నది. ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడినంకనే వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నం. అందుకే కొన్ని రోజులు వేచి చూశాం. నవంబర్ 23 సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారు. ధరణి పోర్టల్ అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అధికారులను మనస్పూర్తిగ అభినందిస్తున్న’’ అని సీఎం అన్నారు.

ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి శ్రీ నర్సింగరావు, రెవిన్యూ శాఖ కార్యదర్శి శ్రీ శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, సీఎంఓ అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ శ్రీ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమీషనర్ శ్రీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Chief Minister Sri K. Chandrashekar Rao has decided to commence the non-agriculture lands and properties registration process from Nov 23. Since he had already launched the agriculture lands and properties registration process through the Dharani Portal, Chief Secretary Sri Somesh Kumar would launch the non-agriculture lands registration process, the CM said.

The CM discussed the matter at a high-level review meeting held at Pragathi Bhavan here on Sunday with the officials concerned. Speaking on the occasion, the CM said,” The process of registration of agriculture lands through the Dharani portal launched by the government has become popular among the people and it received a very good response from them. People in Telangana are of the view that a historical era has begun in the land registration. People are happy that the registration process through Dharani Portal has given their lands security thereby giving them immense satisfaction. The feedback coming from the field level is wonderful. The Dharani Portal has overcome the initial teething problems. In another three to four days it would overcome all the initial problems. We have decided to commence registration of non-agriculture lands and properties only after getting all the matters pertaining Dharani Portal are cleared. Hence we waited for some days. On Nov 23, Monday, Chief Secretary Sri Somesh Kumar will launch the registration process for the non-agriculture lands and properties. I congratulate the officials concerned for developing the Dharani in a wonderful way.”

Ministers Sri Puvvada Ajay Kumar, Ms Sabita Indrareddy, Rythu Bandhu Samithi State President Sri Palla Rajeshwar Reddy, Chief Secretary Sri Somesh Kumar, CM Principal Secretary Sri S Narsing Rao, Principal Secretary (Revenue) Sri Seshadri, Principal Secretary (Finance) Sri Ramakrishna Rao, CMO officials, MAUD Director Sri Satyanarayana, Panchayat Raj Commissioner Sri Raghunandan Rao and others participated.

15/11/2020

అర్హత కలిగివుండి, భర్తీకి అవకాశం వున్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయడానికి వెల్లదలుచుకున్న, జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఇవాళ ప్రగతిభవన్ లో సీఎం అధ్యక్షతన జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కుంటున్న సమస్యల మీద సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగరావు, సీఎం కార్యదర్శి శ్రీ రాజశేఖర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. వారిని రెగ్యలరైజ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నం కోర్టులో కేసుల వల్ల నిలిచిపోయింది. అయినా అంతటితో ఆగకుండా వారి నెల జీతాలను గతంలో కంటే రెట్టింపు చేసింది ప్రభుత్వం. సంవత్సర కాలానికి కేవలం పదినెలలు మాత్రమే జీతాలు చెల్లించే పరిస్థితి గతంలో వుండేది. తెలంగాణ ప్రభుత్వం దాన్ని పన్నెండు నెల్లకు పెంచి సంవత్సర కాలం పూర్తి జీతం ఇస్తున్నది. దాంతో పాటు వారికి సర్వీసు బెనిఫిట్స్ ను కూడా అందిస్తున్నం. సెలవులను పెంచినం. కాజువల్ లీవులు, మెటర్నిటీ లీవుల సదుపాయాలను కల్పించినం. ఇంక కూడా సాధ్యమైనంత మేరకు, నిబంధనలు అనుమతించిన మేరకు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’’ అని సీఎం స్పష్టం చేశారు.

తమకు అనువైన మరో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలనే జూనియర్ కాలేజీ లెక్చరర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని నియమ నిబంధనలను అన్ని కోణాల్లో పరిశీలించి, అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సీఎం విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Chief Minister Sri K. Chandrashekar Rao has decided to give an opportunity to the Contract Junior lecturers working in Government Junior Colleges who are eligible to work in the vacancies of other government junior colleges. The CM instructed the officials concerned to prepare guidelines in this regard.

The CM held a review meeting on Sunday at Pragathi Bhavan here on the problems of the contract lecturers working in the government junior colleges. Ministers Ms Sabita Indrareddy, Sri Puvvada Ajay Kumar, Rythu Bandhu Samithi State President Sri Palla Rajeshwar Reddy, Chief Secretary Sri Somesh Kumar, CM Principal Secretary Sri S Narsing Rao, Principal Secretary (Finance) Sri Ramakrishna Rao, CM Secretary Sri Rajasekhar Reddy and others participated.

Education Minister Ms Sabita Indrareddy, Sri Palla Rajeshwar Reddy brought to the notice of the CM about the problems faced by the contract lecturers in the government junior colleges. Speaking on the occasion, the CM said, “The state government has taken several measures about the junior college contract lecturers. The attempt to regularise them failed due to the cases in the court. The government has doubled their monthly salaries. In the past they were paid for 10 months in a year. The state government has increased it to 12 months with full pay. The government is also giving them the service benefits. We have increased their leaves and extended facilities like the Casual Leave and Maternity Leave. The government will take more measures for the welfare of these lecturers within the frame work of rules and regulations,” the CM clarified.

The CM instructed the officials to take into consideration the request from the contract junior lectures that they be given an opportunity to work in the government junior college of their choice in the vacant posts. He also instructed the senior officials of the education department to prepare the guidelines keeping in view the existing rules and regulations.

Address

NGOs Colony Hanamkonda Warangal
Warangal
506370

Telephone

+919701821981

Website

Alerts

Be the first to know and let us send you an email when Vnews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vnews:

Share