GWMC 55 Division TRS

GWMC 55 Division TRS Greater Warangal Municipal corporation
55 Division
TRS PARTY

20/12/2021

*ధాన్యం కొనుగోలుపై మరియు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన ధర్నా కార్యక్రమం*

తెలంగాణలో యాసంగి వడ్లు కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు *20.12 2021* *సోమవారం* భీమారం మెయిన్ రోడ్ మీద ఉదయం 9.00 గంటలకు చావు డబ్బులతో బీజేపీ కేంద్ర ప్రభుత్వ మొండి వైకరికి నిరసన ధర్నా కార్యక్రమములో టిఆర్ఎస్ నాయకులు, రైతాంగం,ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు..

నేడు గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ భీమారం లోని శ్యామల చెరువుకట్ట వద్ద ఉన్న పురాతన శివాలయ పునర్నిర్మాణ పనులు స్థానిక నాయకులు...
18/12/2021

నేడు గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ భీమారం లోని శ్యామల చెరువుకట్ట వద్ద ఉన్న పురాతన శివాలయ పునర్నిర్మాణ పనులు స్థానిక నాయకులు, పెద్ద మనుషుల సహకారంతో ప్రారంభించిన 55 వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు గారు. ఈ కార్యక్రమంలో DVR గార్డెన్స్ యాజమాన్యులు దేశిని వీరస్వామి నిర్మల, బిసి సెల్ నాయకులు ముచ్చ సుధాకర్, యూత్ నాయకులు దేశిని భరత్,అర్చకులు ఆరుట్ల శ్రీధర చార్యులు, అయ్యప్ప స్వాములు, తదితరులు పాల్గొన్నారు.

★ యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు ★యజమాన్యా పద్ధతులుతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరులు సవ్వుకర్యం పెరగడం వల...
30/11/2021

★ యాసంగిలో వరికి బదులు
ఇతర పంటలు సాగు ★
యజమాన్యా పద్ధతులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరులు సవ్వుకర్యం పెరగడం వలన వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు వానాకాలం యాసంగి రెండు కాలాలలో వరి పండిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వరి సాగు విస్తీర్ణం 2014-15లో 34.92 లక్షల ఎకరాల నుండి 2020-21 నాటికి కోటి ఆరు లక్షల ఎకరాలకు చేరింది వానాకాలంలో పెద్ద ఎత్తున వరి సాగు చేసి ఉండటం వరి కొనుగోలుకు మార్కెట్ ఇబ్బందులు తలెత్తడంతో రైతుల పై ఒత్తిడి కలుగుతోంది వరి తర్వాత వారి పండించడం వలన పంటలు వైవిధ్యం కూడా దెబ్బతిందని పంటల వైవిధ్య కారణ అంటే ప్రస్తుతం పాటిస్తున పంటలు సరళిలో ఉత్తమమైన మార్పులు రావటంతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా చేరుతుంది రాష్ట్రంలో పప్పు దినుసులు,నూనె గింజలు అవసరనికి ఉత్పత్తికి మధ్య గణనీయమైన వత్యసం ఉంది అందువలన వివిధ రకాలైన పప్పు జాతి పంటలు ,నూనె గింజలు పంటలను సాగు చేయాల్సి అవసరం ఉంది. మార్కెట్ లో ఎదురవుతున్న సమస్యలు, క్చెత్రస్థాయిలో దీర్ఘకాలిక దృష్టితో వనరులను సక్రమంగా వినియోగిచడంలో భాగంగా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సంగాల విక్టరీబాబు రైతు బంధు సమితి జిల్లా సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 55వ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, హాసన్ పర్తి ఏఓ అనురాధ, ఏఈఓ భాస్కర్, మరియు విలేజ్ కో ఆర్డినేటర్స్ భీమారం, ముచెర్ల, చింతల రమేష్, రాజు రైతులు దాసరి సత్యనారాయణ, యాదగిరి, జక్కుల సారయ్య,జక్కుల రాజు,గుంజ సాయికుమార్,జితేందర్ రెడ్డి, రవీందర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

కోమటిపల్లిలో 100% వాక్సినేషన్ పూర్తి - కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లునేడు GWMC కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్పెషల్ డ్...
24/09/2021

కోమటిపల్లిలో 100% వాక్సినేషన్ పూర్తి - కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు

నేడు GWMC కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 55వ డివిజన్ లోని కోమటిపల్లి గ్రామం 100% వ్యాక్సినేషన్ పూర్తి సందర్భంగా డిప్యూటీ సివిల్ సర్జన్ వాణి శ్రీ గారు 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు గారికి 100% వ్యాక్సినేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో AE అరవింద, కోమటిపల్లి టిఆర్ఎస్ ప్రెసిడెంట్ నమిండ్ల రవి, యూత్ నాయకులు నమిండ్ల అరుణ్, గడ్డం భగత్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

గోపాలపురం లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించిన కార్పొరేటర్గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కోవిడ్ 19 వ్యాక్సిన...
22/09/2021

గోపాలపురం లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించిన కార్పొరేటర్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను 55వ డివిజన్ లోని గోపాలపురం జంక్షన్ లో నేడు స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతల రాజయ్య, గోపాలపురం యూత్ నాయకులు ఆరేపల్లి రాజు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ covid 19  వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ 55 వ డివిజన్ లోని భీమారం  లో గల  PHC లో  ఈరో...
16/09/2021

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ covid 19 వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ 55 వ డివిజన్ లోని భీమారం లో గల PHC లో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు (శ్రీను)గారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు గడ్డం భగత్ దేశిని భరత్ , టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , అధికారులు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
GWMC 55 DIVISION TRS

*నూతనంగ బాధ్యతలు చేపట్టిన GWMC కమిషనర్  PRAVINYA IAS గారిని కలిసిన కార్పొరేటర్*            గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్...
14/09/2021

*నూతనంగ బాధ్యతలు చేపట్టిన GWMC కమిషనర్ PRAVINYA IAS గారిని కలిసిన కార్పొరేటర్*

గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కు నూతనంగా విచ్చేసిన కమిషనర్ ప్రావీణ్య గారిని మర్యాద పూర్వకంగా కలిసిన గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు (శ్రీను)

అనంతరం డివిజన్ లో పలు సమస్యల గురించి కమిషనర్ గారికి వివరించి, డివిజన్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరడం జరిగింది.

GWMC 55 DIVISION TRS

https://youtu.be/SpsHV1WlxR0
02/09/2021

https://youtu.be/SpsHV1WlxR0

భీమారం లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగగురువారం తెలంగాణ జండా పండుగ సందర్బంగా 55వ డివిజన్ లో భీమారం మె...

భీమారం లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగగురువారం తెలంగాణ జండా పండుగ సందర్బంగా 55వ డివిజన్ లో భీమారం మెయిన్ రోడ్ సత్య ...
02/09/2021

భీమారం లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ
గురువారం తెలంగాణ జండా పండుగ సందర్బంగా 55వ డివిజన్ లో భీమారం మెయిన్ రోడ్ సత్య సాయి కాలనీలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి జక్కుల రజిత వెంకటేశ్వర్లు గారు జండాను ఎగురవెసారు. ఈ సంద్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు చేసిన అభివృద్ధి, సంక్షేమ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమం లో 57వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వరు, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు సంగాల విక్టరీ బాబు, భీమారం TRS అధ్యక్షులు రాయికంటి సురేష్, ఏర్రగట్టు దేవస్థాన మాజీ చైర్మన్ అటీకమ్ రవీందర్, మాజీ mptc చింతల రాజయ్య, గ్రామ యూత్ అధ్యక్షులు జక్కుల విజయ్, గ్రామ రైతు బందు కోఆర్డినరర్ చింతల రమేశ్, గాజల గోవర్ధన్, ఎర్రగట్టు దేవస్థానం డైరెక్టర్లు ఉప్పు ప్రభాకర్, రఘు, ముచ్చ సుధాకర్, మాజీ చైర్మెన్ బూర శ్రీధర్, TRS జిల్లా నాయకులు పోగుల రమేశ్, నామిండ్ల రవీందర్, అరుణ్, గ్రామ ఉపాడ్యక్షులు యకయ్య, త్యాగరాజు, చింతల లక్ష్మణ్, బూర కిట్టు, శంతణ్ ,గుంజె సాయి, చింతల రవి, గడ్డం భగత్, భీం నాయక్, జక్కుల హృషికేశే,TRS నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సెప్టెంబర్‌ 2న రాష్ట్రమంతటా ఘనంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా పండుగ..  అదే రోజు డీల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనానికి శ...
31/08/2021

సెప్టెంబర్‌ 2న రాష్ట్రమంతటా ఘనంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా పండుగ.. అదే రోజు డీల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనానికి శంకుస్థాప‌న చేయనున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.

రైతు బందు సమితి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం హసన్ పర్తి మండలం లోని ...
15/08/2021

రైతు బందు సమితి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం హసన్ పర్తి మండలం లోని భీమారం (రామారం) వద్ధ ముచ్చర్ల రైతు వేదిక క్లస్టర్ లో రైతు బంధు సమితి జిల్లా సభ్యులు సంగాల విక్టరీ బాబు గారి ఆధవర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ఏ ఈ ఓ భాస్కర్ గారిచే జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమర యోధులను స్మరించించుకొని, వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి గ్రామాల కోఆర్డినేటర్లు చింతల రమేష్, నద్దునూరి నాగరాజు, డైరెక్టర్లు దాసరి సత్యనారాయణ, యాదగిరి, కార్యకర్తలు సంగాల కొటేశ్వర్, కొడారి రాజు ,తోట రాజు చిన్న, హోంగార్డు రాజు, సంగాల చిట్టిబాబు, జక్కుల మల్లేషం, తదితరులు పాల్గొన్నారు.

55వ డివిజన్లలోని భీమారం ఎస్ సి కాలనీలో *జాతీయ జెండాను ఆవిష్కరించిన రైతు బంధు సమితి జిల్లా సభ్యులు సంగాల విక్టరీబాబు....*...
15/08/2021

55వ డివిజన్లలోని భీమారం ఎస్ సి కాలనీలో *జాతీయ జెండాను ఆవిష్కరించిన రైతు బంధు సమితి జిల్లా సభ్యులు సంగాల విక్టరీబాబు....*

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 55వ డివిజన్లలోని భీమారం ఎస్ సి కాలనీలో కేంద్రంలోని జాతీయ పతాకాన్ని ఎగురవేసి,జాతీయ జెండాను ఆవిష్కరించిన రైతు బంధు సమితి జిల్లా సభ్యులు సంగాల విక్టరీబాబు.. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసినారు.

కార్యక్రమంలో సంగాల కొటేశ్వర్,హోమ్ గార్డ్ రాజు, కావాటి సంపత్,నమ్మిండ్ల రవీందర్,కొండపాలకల భాస్కర్,దేవర సమ్మయ్య, సంగాల సుదర్శన్, సంగాల కిషన్,బొక్క ప్రభాకర్,సంగాల సతీష్,జన్ను కెనడి అంగనువాడి టీచర్ సంగాల వసంత,సంగాల బుజ్జమ్మ, సంగాల సుక్కమ్మ, సంగాల శారద,కొండపలకల రజిత,వీర వరమ్మ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Address

Village: Bheemaram, Mandal : Hasanparthy
Warangal

Alerts

Be the first to know and let us send you an email when GWMC 55 Division TRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to GWMC 55 Division TRS:

Shortcuts

Share