19/12/2025
◆ గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలి : ప్రిన్స్ వహాబ్
◆ అన్నదానం చేసిన అన్వర్ బాష
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#ఎమ్మిగనూరు : క్రీడల్లో గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకుంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చని ప్రిన్స్ స్వచ్చంద సేవ సమితి అధ్యక్షుడు, ఏఆర్ స్పోర్ట్స్ అధినేత వహాబ్ తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక జునియర్ కళాశాల క్రీడామైదానంలో కర్నూలు జిల్లా జనరల్ సెక్రెటరీ వనకలదిన్నే వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ అసోసియేషన్ మీట్ పురుషులు మరియు మహిళల కబడ్డీ సెలెక్షన్స్ పోటీలను #ప్రిన్స్_వహాబ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ హెడ్ మాస్టర్ నాగభూషణం లు కలిసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. బైలుప్పల అన్వర్ బాష అన్నదానం చేశారు. వక్తలు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి.వేంకటేశ్, శ్రీకాంత్, పియిటి, పిడి లు ఉప్పర వెంకటేశ్వర్లు, నరసింహారాజు, శిరీష, హేమలత, వీణ, నసరుల్లాబేగ్, హారిక, సీనియర్ క్రీడాకారుడు రామకృష్ణ, రామంజినేయులు, గుడికల్ వెంకటేష్, రాము, విస్వేశ్వరఆచారి తదితరులు పాల్గొన్నారు.