Telugu Desam Qatar

Telugu Desam Qatar నవ్యాంద్ర నిర్మాణానికి రథసారథి.
మా నాయకుడు శ్రీ నార చంద్రబాబునాయుడు గారు

చంద్రబాబు నాయుడు వ్యక్తిగా అంతర్ముఖుడు అంటే లోతు మనిషి.కాని వ్యవహారాల విషయంలో సంఘజీవి. ఎప్పూడూ పది మందిని పోగేసుకుని ఏదో ఒక బృహత్ప్ర్రయత్నం మొదలు పెట్టడం ఆయన వ్యాపకం. అల్లుకుపోవడం ఆయన స్వభావం. రాజ్యం వీరభోజ్యం కాబట్టి కొత్తగా వచ్చిన ఎం.ఎల్.ఎ,లు మంత్రి పదవుల కోసం బారులు తీరారు. చిత్తూరు జిల్లాలో అప్పటికి ముఖ్య కాంగ్రెసు నేత నల్లారి అమర్నాథరెడ్డి ఆయన పి.వి.నరసింహరావుకు అత్యంత ప్రీతి పాత్రుడు. ముఖ్యశ

ిష్యుడు. రాష్ట్ర్ర మంత్రివర్గంలో ఆయన స్థానానికి డోకా లేకుండా వుండేది. అలాంటి నాయకుడు ప్రతినిత్యం వహిస్తున్న జిల్లా నుండి ఎన్నికై చంద్రబాబు నాయుడుకి మంత్రి పదవి ఎక్కడ అందుతుంది. అందులోనూ ఎం.ఎల్.ఎ గా ఎన్నికయిన తొలిఛాన్స్లోనే అయినా చాలా మంది ఎం.ఎల్.ఎ.లు, విద్యార్థి నాయకులు చెన్నరెడ్డి వద్దకు రాయబారాలు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు మంచివాడు, నమ్మకస్తుడు, తెలివైనవాడు, మెరికా లాంటి వాడని చెప్పారు. కాని చెన్నరెడ్డి మంత్రి వర్గంలో స్థానం కల్పించలేకపోయారు. చంద్రబాబు అప్పటికి ఇంకా అవివాహితుడు. అవివాహితులు పలువురు ఎం.ఎల్.ఎ. లుగా ఎన్నికై వచ్చిన సంధర్బం రాష్ట్ర్ర శాసనసభ చరిత్రలో బహుశ అదే ప్రథమమేమో . అలాంటి అదే సంధర్బం మళ్ళీ తెలుగుదేశం గెలిచినప్పుడే పునారవృత్తమైంది. చంద్రబాబు నాయుడిది చేతులు ముడుచుకోని కూర్చోనే తత్వం కాదు. కాబట్టి తెలికగానే రాష్ట్ర్ర రాజకీయ కీకారణ్యంలోకి చోరబడ గలిగారు. ఎంతో మంది ఎం.ఎల్.ఎ. లు ఇతరులు స్నేహితులయ్యారు. అతి చిన్న వయసులోనే ఎం.ఎల్.ఎ అయ్యే అవకాశాన్ని పొందిన చంద్రబాబు తన నియోజకవర్గ అభివృద్ది పైన దృష్టిని సారించారు. రోడ్లు గొట్టపు బావులు, మంచినీటి పథకాలు తదితర ప్రజహిత కార్యక్రమాలు పెద్దయెత్తున చేపట్టడానికి అధికారుల సహయ సహకారాలతో అహరహం శ్రమించారు. హైదరాబాదులో పెద్ద బలగమే ఎర్పడింది. పలువురు ఎం.ఎల్.ఎ.లు ఇతరులు కలిసి మెలిసి పని చేసేవారు. రెడ్డి కాంగ్రెస్ తరుపున ఎన్నికై ఆ తర్వాత ఇందిరా కాంగ్రెసులో చేరిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి వీరిలో ఒకరు. ఇది రాష్ట్ర్ర్రరాజధానిలో నిలదొక్కుకోగలగడానికి ఆయనకు బాగా ఉపకరించింది.

చంద్రబాబు రాజకీయ జీవితంలో ఉజ్వల దశ 1980లో ఆరంభమైంది. అది అక్టోబర్ నెల. 16 మంది మంత్రుల తిరుగుబాటు ఫలితంగా చెన్నరెడ్డి ప్రభుత్వం పడిపొయింది. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అంజయ్య దృష్టి వేరు. నేఫథ్యం వేరు. కాంగ్రెసులో యువ నాయకత్వం బలం పుంజుకుందంటే ఆ పుణ్యం అంజయ్యదే. అతి సామాన్యుడుగా, అమాయకుడిగా కనిపించే అంజయ్య రాజకీయంగా నేర్పరి. జిల్లాలో అప్పటి వరకు సామంతులవలె చలమణీ అవుతున్న పాత కాపుల స్థానంలో కొత్త తరాన్ని ప్రవేశపెట్టారు. జిల్లా నాయకత్వాన్ని యువతరానికి అప్పగించారు. అలా అధికార సంక్రమణం జరిగిన క్రమంలోనే చంద్రబాబునాయుడు సినిమాటోగ్రఫి మంత్రిగా కావడం. అంజయ్య 63 మంది జంబొ జెట్ మంత్రివర్గం ఆనాడు ఒక జాతీయ వింత. అది అధిష్టానవర్గం జోక్యంతో 45 కి తగ్గిన అందులో సయితం చంద్రబాబు నాయుడి స్థానం చేక్కుచెదరకుండా వుండిపొయింది. మంత్రి కావడంతో చంద్రబాబు నాయుడి పరిధి రాష్ట్ర్ర స్థాయికి పెరిగింది. పరిచయాలు పెరిగాయి.

 #ఆలోచించుఆంధ్రుడా
11/05/2024

#ఆలోచించుఆంధ్రుడా

11/05/2024
Jai balayya, Vote for TDP.
11/05/2024

Jai balayya, Vote for TDP.

17/02/2024

రాజధాని రైతుల కష్టాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు.

Felicitated Vani garu ( sister of director Bhanu garu, Rajadhani movie director) in Doha Qatar by TDP QATAR team

27/12/2023

అంగ‌న్ వాడీలు ఆదుకోమ‌ని అడుగుతుంటే, జ‌గ‌న్ వారి జీవితాల‌తో ఆడుకుంటున్నాడు.

27/12/2023
04/10/2023
04/10/2023

హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్న Nandamuri Balakrishna గారు...

- ✌💛

Jai Balayya Nara Chandrababu Naidu Nara Lokesh

04/10/2023
04/10/2023

చంద్రుడిని మబ్బులు కమ్మితే అది తాత్కాలికమే. ప్రతి లోగిలికీ వెన్నెల పంచేందుకు కాసేపటికే తిరిగొస్తాడు. చంద్రబాబుగారు కూడా అంతే. అధికారపు చీకట్లను చీల్చుకుని కడిగిన ముత్యంలా తిరిగొస్తారు






Address

Doha

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Qatar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Qatar:

Share