03/04/2026
*ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కలల రాజధాని అమరావతి*
*రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని మోడీ కు ధన్యవాదాలు*
*డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి రాష్ట్రం*
*మావిగన్ అంటూ జగన్ నీచ రాజకీయాలు*
మైలవరం నియోజకవర్గ బిజెపి నాయకులు నూతలపాటి బాలకోటేశ్వరావు (బాల)
ఇబ్రహీంపట్నం,
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సగౌరవంగా చెప్పుకునేలా అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటుందని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అమరావతికి చట్టబద్ధ కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకు ధన్యవాదాలు తెలిపారు మైలవరం నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు నూతలపాటి బాలకోటేశ్వరావు (బాల). కొండపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానికి చట్టబద్ధ కల్పించి రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కు ధన్యవాదాలు తెలిపారు. నాడు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం అమరావతి రాజధానికి ప్రధానమంత్రి చట్టబద్ధ కల్పించారని, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపించారని అన్నారు. గత ప్రభుత్వం అమరావతి రాజధాని బ్రష్టు పట్టించి, ప్రజలకు కనీస అభివృద్ధి అందించలేదని విమర్శించారు. నేడు మావిగన్ పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే కొనసాగితే కనీసం పోటీ చేసే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. అమరావతి కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి కృషి నేడు ఫలించిందని... రాష్ట్రానికి అన్ని హంగులతో కూడిన శాశ్వత అమరావతి రాజధాని గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి కొండపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు తమ్మినేని మాధురి సుధీష్ణ,బిజెపి ప్రధాన కార్యదర్శి దాము భవాని, జి కొండూరు మండల అధ్యక్షులు చల్లా మల్లేశ్వర రావు, గొల్లపూడి నాయకుడు దుద్దుకూరి తిరుపతి నాయుడు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కూనల యుగంధర్ పాల్గొన్నారు.