Abu UK BRS

Abu UK BRS NRI Uk � BRS Minority Leader

14/09/2026
14/09/2026

పోలీస్ స్టేషన్‌లోనే దాడికి యత్నించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు : ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ యూకే అధికారిక ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిలపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ముసుగులు ధరించిన వ్యక్తులతో దాడికి యత్నించిన ఘటన అత్యంత ఆందోళనకరమైనదని ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ యూకే అధికారిక ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు తీవ్రంగా ఖండించారు.

విచారణ పేరుతో పండుగ రోజున పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన వారిపై, పోలీసుల సమక్షంలోనే ముసుగులు ధరించిన వ్యక్తులతో దాడికి ప్రయత్నించడం చట్టపరమైన ప్రక్రియను అపహాస్యం చేయడమేనని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్ అనేది ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రదేశమని, అదే ప్రదేశంలో ఉన్న వ్యక్తులపై దాడికి ప్రయత్నించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు.

అక్కడ ఉన్న బీఆర్ఎస్ న్యాయ బృందం సభ్యులు అప్రమత్తమై ఈ చర్యను అడ్డుకోవడంతో పరిస్థితి మరింత విషమించకుండా నిలిచిందని తెలిపారు. దాడికి ప్రయత్నించిన వ్యక్తులు ముసుగులు ధరించి ఉండటం ఈ ఘటనపై అనేక అనుమానాలకు తావిస్తోందని, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని రవి ప్రదీప్ పులుసు డిమాండ్ చేశారు.

కోర్టు ఆదేశాలు అమలులో ఉన్న సమయంలో వాటిని పక్కనపెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడటం న్యాయవ్యవస్థ పట్ల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుందని ఆయన అన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే చట్టపరమైన పరిమితులను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు రావడం అత్యంత తీవ్రమైన అంశమని పేర్కొన్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి, హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని రవి ప్రదీప్ పులుసు డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, పూర్తి స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ అరాచక పాలనకు ఇది నిదర్శనమని,
పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాలని, ప్రజాస్వామ్య విలువలు మరియు న్యాయపాలనను కాపాడేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ యూకే తరఫున డిమాండ్ చేస్తున్నామని రవి ప్రదీప్ పులుసు స్పష్టం చేశారు.

Wishing everyone celebrating a beautiful festival filled with happiness, togetherness, and positivity. 🪔✨Happy Vinayaka ...
14/09/2026

Wishing everyone celebrating a beautiful festival filled with happiness, togetherness, and positivity. 🪔✨

Happy Vinayaka Chavithi! 🙏

08/09/2026

రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణ ప్రభుత్వం వెంటనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అలాగే ఇతర బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులు, రాజకీయ కక్ష సాధింపు చర్యలను నిలిపివేయాలి.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ రాష్ట్రాన్ని ప్రశాంతంగా, అభివృద్ధి దిశగా పాలించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రతిపక్ష నాయకులను గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి.

ఈ రోజు మన ప్రియతమ కేసీఆర్ గారి ఫామ్‌హౌస్‌పై జరిగిన దాడి తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, పూర్తిగా ఆమోదయోగ్యం కాదు.

ప్రభుత్వం మరియు ప్రతిపక్షం కలిసి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. రాజకీయ విభేదాలు ఉన్నా, పరస్పర గౌరవం, శాంతి మరియు ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.

తెలంగాణ అభివృద్ధి కోసం ద్వేష రాజకీయాలు కాదు — శాంతి, ప్రజాస్వామ్యం, ప్రజల సంక్షేమమే ముఖ్యం.

అబ్దుల్ జాఫర్
Secretary, NRI BRS UK Cell

07/09/2026
07/09/2026

I

07/09/2026

Address

E7 8NN
London
E78NN

Website

Alerts

Be the first to know and let us send you an email when Abu UK BRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share