nihalchinna

nihalchinna csm foundation

📢 ఎన్నికల సంఘం అవకతవకలపై ధర్నాఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఎ...
28/09/2026

📢 ఎన్నికల సంఘం అవకతవకలపై ధర్నా

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.

ఓటర్ల పేర్ల తొలగింపు, చేర్పులు, అభ్యంతరాలు మరియు SIR ప్రక్రియపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. (The Times of India)

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం స్వరం పెంచుదాం…
ఓటు హక్కును కాపాడుదాం! ✊🇮🇳

🔥 గద్వాల గడ్డపై బీసీ హక్కుల సింహగర్జన! 🔥గద్వాల్‌లో మొట్టమొదటిసారిగా – బీసీల గర్జన ఘనంగా జరిగింది.బీసీల హక్కులు, ఆత్మగౌరవ...
18/09/2026

🔥 గద్వాల గడ్డపై బీసీ హక్కుల సింహగర్జన! 🔥

గద్వాల్‌లో మొట్టమొదటిసారిగా – బీసీల గర్జన ఘనంగా జరిగింది.

బీసీల హక్కులు, ఆత్మగౌరవం, సమాన అవకాశాల కోసం ఐక్యంగా నినదించిన బీసీ బంధువులు…

✊ బీసీల ఐక్యతే బలం…
బీసీల హక్కులే లక్ష్యం!

#గద్వాలగడ్డపైబీసీగర్జన #బీసీహక్కులసింహగర్జన

16/09/2026
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన కాటూరి వెంకటేశ్వరరావు గారు ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు.రాహుల...
11/09/2026

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన కాటూరి వెంకటేశ్వరరావు గారు ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు.

రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రదర్శన యాత్రను ప్రారంభించినట్లు కాటూరి వెంకటేశ్వరరావు గారు తెలిపారు..”

ఈ సందర్భంగా మాయేష్ కుమార్ గౌడ్ గారు, మెట్టు సాయి గారు మరియు టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ గారు కాటూరి వెంకటేశ్వరరావు గారిని ఘనంగా స్వాగతించారు.

జై కాంగ్రెస్ ✋
జై హింద్ 🇮🇳

10/09/2026
స్పీకర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు తగునా?బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం?చట్టసభ స్పీకర్‌ను...
08/09/2026

స్పీకర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు తగునా?

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం?

చట్టసభ స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడటం సిగ్గుచేటు, తీవ్రంగా ఖండించాల్సిన విషయం.

ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన తాటా మధును వెంటనే చట్టసభల నుంచి డిస్‌క్వాలిఫై చేయాలి.

ఈ ఘటనపై కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి.

👉 చట్టసభల గౌరవాన్ని కాపాడాలి… ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలి!

07/09/2026

సాతంరాయి హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన

సాతంరాయి గ్రామంలో శ్రీ హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.

గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విగ్రహ ప్రతిష్ఠాపనతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when nihalchinna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to nihalchinna:

Shortcuts

Share

Category