BhimArmy Telangana

BhimArmy Telangana BhimArmy Telangana

30/05/2026

ఓకే సోము వీర్రాజు గారు.. కాసేపు మీ రాజకీయ కక్షపూరిత మాటలనే నిజం అనుకుందాం! మీరు చెప్పినట్లే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు బిజెపి వ్యతిరేకి, తీవ్రవాది, నక్సలైట్ అనుకుందాం..

​మరి అంతటి "తీవ్రవాది" అని మీరు ముద్ర వేసిన మేధావి ఇంటికి.. స్వయంగా మీ మాజీ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, మీ పార్టీ అగ్ర నేతలు ఎందుకు వెళ్ళినట్లు? మీ లెక్క ప్రకారం వాళ్ళని ఏమనాలి..?

​దేశంలో ప్రశ్నించే గొంతుకలపై, ప్రజాస్వామ్యవాదులపై ముద్రలు వేయడం.. తీరా అవసరం వస్తే అదే మేధావుల కాళ్ళ దగ్గరకు మీ జాతీయ నాయకత్వం మోకరిల్లడం — ఇదేనా మీ నైతికత? ఇదేనా మీ "దేశభక్తి"?

​అధికారం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారడం బిజెపికి అలవాటే. ఒక పక్క మీ జాతీయ అధ్యక్షుడు వెళ్లి కలుస్తారు.. మరోపక్క మీరేమో తీవ్రవాది అంటూ నీచమైన విమర్శలు చేస్తారు. మీ మాటలకు, మీ చేతలకు ఏమైనా పొంతన ఉందా? మీ అగ్ర నాయకత్వానికే లేని అభ్యంతరం మీకెందుకు సోము వీర్రాజు గారు?

​దళిత, బహుజన, ప్రజ�

28/05/2026

అణగారిన వర్గాల కన్నీటిని ఆశగా మార్చే శక్తి అతనిది,
బహుజనుల గౌరవం కోసం గళమెత్తే ధైర్యం అతనిది!

అంబేడ్కర్ చూపిన మార్గం, కన్షిరాం కలగన్న దిశలో
పోరాటం కొనసాగిస్తున్న ఆ యోధుడు — మన చంద్రశేఖర్ ఆజాద్ గారు! ✊💙

ఆయన మాటల్లో న్యాయం ఉంది, అడుగుల్లో ఉద్యమం ఉంది,
ఆయన చూపులో బహుజనుల భవిష్యత్తు ఉంది.

ఆజాద్ అంటే పేరు కాదు — అది ఆవేశం, అది ఆశ, అది విప్లవం!
మన హక్కుల కోసం, మన గౌరవం కోసం ఆయనతో నిలబడుదాం!

జై భీమ్! జై ఆజాద్! 💙

27/05/2026
27/05/2026

బాబాసాహెబ్ జీవిత భాగస్వామి, అపారమైన త్యాగానికి, అంకితభావానికి మరియు నిరంతర పోరాటానికి నిలువెత్తు రూపం "త్యాగమయి" మాతా రమాబాయి అంబేద్కర్ గారి మహాపరినిర్వాణ దినోత్సవం సందర్భంగా ఆమెకు కోట్లాది నమస్సులు.! 💐🙏

​అమ్మా.. కోట్లాది మంది ముఖాల్లో వెలుగులు నింపడం కోసం, నీ జీవితాన్ని చీకట్లోకి నెట్టుకుని లెక్కలేనన్ని కష్టాలను మౌనంగా భరించావు. బాబాసాహెబ్ వెనుక అండగా నిలిచిన నీ మహోన్నత త్యాగాన్ని, పోరాటాన్ని ఈ సమాజం ఎప్పటికీ మరవదు. నీ పాదాలకు వినమ్ర పూర్వక నివాళులు!

26/05/2026

పసిపాప ప్రాణం పోతే నవ్వులా ఆటలా..? ఐజీని వెంటనే సస్పెండ్ చేయాలి!

​తమిళనాడు కోయంబత్తూర్‌లో 10 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో ప్రెస్ మీట్ పెట్టి నవ్వుతూ, గోళ్లు గిల్లుకుంటూ నిర్లక్ష్యంగా మాట్లాడిన మహిళా ఐజీ ప్రవర్తన దుర్మార్గం. ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తారా? బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన అధికారిణి ఇలా నవ్వుతూ కనిపించడం సమాజానికి ఏం సందేశం ఇస్తుంది? సదరు ఐజీని వెంటనే సస్పెండ్ చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని భీమ్ ఆర్మీ తెలంగాణ తరపున డిమాండ్ చేస్తున్నాం.

​— వనమ్ మహేందర్,
భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు.

25/05/2026

పసిపాప ప్రాణం పోతే నవ్వులా ఆటలా..? ఐజీని వెంటనే సస్పెండ్ చేయాలి!

​తమిళనాడు కోయంబత్తూర్‌లో 10 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో ప్రెస్ మీట్ పెట్టి నవ్వుతూ, గోళ్లు గిల్లుకుంటూ నిర్లక్ష్యంగా మాట్లాడిన మహిళా ఐజీ ప్రవర్తన దుర్మార్గం. ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తారా?

​బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన అధికారిణి ఇలా నవ్వుతూ కనిపించడం సమాజానికి ఏం సందేశం ఇస్తుంది? సదరు ఐజీని వెంటనే సస్పెండ్ చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని భీమ్ ఆర్మీ తెలంగాణ తరపున డిమాండ్ చేస్తున్నాం.

​— వనం మహేందర్,
భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు.

24/05/2026

గోరక్షణ కోసం ముస్లింల ఆందోళన.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్! బీజేపీ బ్రదర్స్.. ఇప్పుడు మీ సమాధానం ఏంటి?

​ఇకనైనా మీ పొలిటికల్ స్క్రిప్ట్‌లు మార్చుకోండి సార్!

నిన్న మొన్నటి వరకు "ఆవు" పేరు చెప్పి కేవలం ఓట్ల రాజకీయం చేస్తూ, సమాజాన్ని విభజించాలని చూసిన శక్తుల మైండ్ బ్లాక్ అయ్యే వార్త ఇది.

ముస్లింలు స్వయంగా రోడ్డుపైకి వచ్చి "గోరక్షణ మా బాధ్యత.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి" అని డిమాండ్ చేస్తున్నారు!

​బీజేపీ నేతలారా.. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి?

ఇన్నాళ్లూ ఎన్నికలు రాగానే గోమాత సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయం నడిపారు కదా? ఇప్పుడు అదే ముస్లింలు ఆవును జాతీయ జంతువు చేయమంటున్నారు..

మరి కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న మీ 'డబుల్ ఇంజన్' సర్కార్ ఆ పని ఎందుకు చేయడం లేదు?

​నిజానికి ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే.. ఆ పేరుతో ఇకపై ఓట్లు అడగలేరని, విద్వేషాలు రెచ్చగొట్టలేరని మీ భయమా? మీరేమో ఆవు పేరుతో కేవల�

23/05/2026

దళిత ఓట్లతో గద్దెనెక్కి.. దళిత మహిళల ఆత్మగౌరవం రోడ్డున పడితే ఇంకా ఢిల్లీ గులాంగిరీ చేస్తారా కాంగ్రెస్ దళిత మంత్రులారా, ఎమ్మెల్యేలారా?

​పెద్దపల్లి జిల్లా పెగడపల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాల పండుగ వేళ దళిత మహిళలను కులం పేరుతో అవమానించి, ఆలయ గేట్లకు తాళాలు వేసిన అమానుష ఘటన జరిగి రోజులు గడుస్తున్నా మీలో చలనం లేదు.

మీ మౌనం మీ పదవీ వ్యామోహానికి, సామాజిక వైఫల్యానికి అద్దం పడుతోంది.

ఎన్నికల ముందు దళిత డిక్లేరేషన్లు, ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రగల్భాలు పలికి దళితుల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చారు,

తీరా ఇప్పుడేమో దళితులపై సామాజిక అణచివేత జరుగుతుంటే కళ్లు మూసుకుని కూర్చోవడం దుర్మార్గం.

​నేను రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా..

మీ మంత్రి పదవులు దళిత ఆత్మగౌరవం కంటే ఎక్కువనా?

క్షేత్రస్థాయిలో దళిత మహిళల ఆత్మగౌరవం రోడ్డున పడి ఏడుస్తుంటే ముఖ్యమంత్రి గారిని నిలదీసి నిందితులను చట్టం ముందు నిల

23/05/2026

ఒకరి గొంతు కోసింది చాలదా.. మళ్ళీ పెళ్లి సలహాలు ఇస్తారేంది బ్రదర్?!

​"అసలు ఒక సంసారాన్ని చక్కబెట్టడం చేతకాక, పెళ్లాం పిల్లల్ని చూసుకునే సత్తా లేక... ఆల్రెడీ కట్టుకున్న ఆవిడ జీవితాన్ని మధ్యలోనే వదిలేసి 'చేతులెత్తేసినోడు' ఆయన!

అలాంటి వ్యక్తికి మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చి.. ఇంకొకరి గొంతు కోయమంటావా బ్రదర్?

22/05/2026

ముందు కులం అడుగు, ఆ తర్వాతే కాల్చి చంపు" అని ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి చేసిన ఈ ప్రకటన అత్యంత అవమానకరం మరియు ప్రమాదకరం! ఇప్పుడు బీహార్ లో న్యాయం, చట్టం కూడా కులం చూసే నిర్ణయిస్తారా?

ఇలాంటి మానసిక స్థితి సమాజాన్ని విభజించడానికి, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. బీహార్ కు కావాల్సింది రాజ్యాంగం మరియు సమానత్వ రాజకీయాలు... కులోన్మాదం కాదు!

22/05/2026

భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ మళ్ళీ పుడితే... నేటి మోదీ, యోగీ, అమిత్ షా లాగా ఉంటారా?

ఈ పోస్టర్ క్రియేట్ చేసిన వాడి బుర్రలో అస్సలు గుజ్జు ఉందా, లేక ఐటీ సెల్ జీతానికి పూర్తిగా బుద్ధిని కూడా తాకట్టు పెట్టేసాడా?

అసలు ఆ మహానుభావుల పవిత్రమైన చరిత్ర ఎక్కడ?
దేశాన్ని ముక్కలు చేస్తున్న ఈ నేటి రాజకీయ వెధవల బతుకులెక్కడ?

​23 ఏళ్ల లేత ప్రాయంలో, జీవితం కళ్లముందు కనిపిస్తున్నా... దేశ ఆత్మగౌరవం కోసం, బ్రిటీష్ వాడి కరడుగట్టిన బానిస సంకెళ్లను తెంచడం కోసం నవ్వుతూ ఉరితాడును ముద్దాడిన విప్లవ సింహాలు ఆ ముగ్గురు.

కానీ నేడు, 70 ఏళ్లు దాటి రేపో మాపో కాటికి పోవాల్సిన వయసొచ్చినా... చావని పదవీ వ్యామోహంతో, కేవలం కుర్చీని కాపాడుకోవడం కోసం దేశాన్ని తగలబెడుతున్న రాజకీయ శవాలు వీళ్ళు.

​ఆనాడు ఆ ముగ్గురు వీరులు రక్తం చిందించి దేశాన్ని ఏకం చేస్తే... ఈనాడు కేవలం ఓట్లు, సీట్ల కోసం దేశ ప్రజల మధ్య కులం పేరుతో, మతం పేరుతో విద్వేషాల మంటలు రగిల్చి దేశ ఐక్యతను �

Address

Telangana
Hyderabad
500048

Telephone

+919908170170

Website

Alerts

Be the first to know and let us send you an email when BhimArmy Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BhimArmy Telangana:

Share