05/09/2026
జనసేన అధినేత శ్రీ Pawan Kalyan గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల చింపివేతను తీవ్రంగా ఖండిస్తున్నాం
మంచిర్యాల జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా నాయకులు నల్లతీగల మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ, మంచిర్యాలలో జనసేన పార్టీలో బీసీ బిడ్డ డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ గారు చేరడాన్ని జీర్ణించుకోలేక కొంతమంది కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కావాలనే చించి వేయడం జరిగిందని, ఈ ఘటనను జనసేన పార్టీ మంచిర్యాల జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఫ్లెక్సీలను చించి వేసిన వారిని గుర్తించి, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా నాయకులు ఆవుల సాగర్, మంచిర్యాల నియోజకవర్గ నాయకులు మజీద్, రంజిత్ పాల్గొన్నారు.