02/06/2026
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 జూన్ 2వ తేదీన బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ గారు,మాజీ మేయర్లు అమర్ సింగ్, అజయ్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్లు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ యువ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం కోసం తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ, రాష్ట్ర ప్రగతికి అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
official