05/09/2026
🚨 ఆక్రమణల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్
🏙️ రోడ్లు, డ్రెయిన్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి
— కమిషనర్ రాహుల్ మీనా
🏛️ నగరంలో ఆక్రమణల తొలగింపునకు టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య విభాగాలు సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు.
📅 నెలాఖరులోగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లపై ఉన్న అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని సూచించారు.
⚖️ ప్రజా భద్రత, ప్రణాళికాబద్ధమైన నగర అభివృద్ధి కోసం నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
🚧 రహదారులు, డ్రెయిన్లు, ఫుట్‌పాత్‌లపై కంటైనర్లు, షెడ్లు, ఇతర శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదని తెలిపారు.
📩 ఆక్రమణదారులకు చట్టపరమైన నోటీసులు జారీ చేసి, తొలగింపులకు ముందు–తర్వాత ఫోటోలను తప్పనిసరిగా రికార్డు చేయాలని ఆదేశించారు.
🛣️ ఆక్రమణల తొలగింపుతోనే జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
🚦 ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఫ్రీ లెఫ్ట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
🏥 ఆస్పత్రుల్లో పార్కింగ్ సదుపాయం తప్పనిసరిగా ఉండాలని, ఆంబులెన్స్‌లు, పేషెంట్ల వాహనాలను సెల్లార్‌లోనే పార్కింగ్ చేయాలని స్పష్టం చేశారు.
🚫 రోడ్లపైకి వచ్చిన భవనాల ర్యాంపులు, అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లను కూడా తొలగించాలని ఆదేశించారు.
🙏 వినాయక చవితి మండపాల వద్ద పోల్స్ ఏర్పాటు చేసేటప్పుడు ఇసుక బస్తాలను వినియోగించి రోడ్లు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగకుండా చూడాలని కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు.
🤝 క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని కమిషనర్ తెలిపారు.
🌿 నగర అభివృద్ధి, సుందరీకరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.
👥 సమావేశంలో సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎంహెచ్ఓ వినూత్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Nara Chandrababu Naidu Dr. Ponguru Narayana Cdma Andhra Pradesh Andhra Pradesh CM