07/11/2026
ఇబ్రహీంపట్నం కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎన్నికల పరిశీలకులు బి. విజయ్ కుమార్
ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఇబ్రహీంపట్నం కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయ్ కుమార్ తనిఖీ చేశారు. కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు విధానం, ఎన్నికల నిబంధనల అమలును పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.