Kalyan voices

Kalyan voices All updates about political news..

28/09/2026

Deputy CMO, Andhra Pradesh పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పిఠాపురం ఆలయాల్లో అన్నదానం.. 🔥♥️ JanaSena Party Pawan Kalyan

28/09/2026

మనం బలంగా ఉన్న ప్రతి చోట మనం తప్పకుండా పోటీ చేద్దాం - Bolisetti Srinivas Pawan Kalyan JanaSena Party

25/09/2026

*జనసేన పార్టీలోకి శ్రీ యనమల కృష్ణుడు, శ్రీ నవీన్ నిశ్చల్*
* వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

జనసేన పార్టీ సిద్దాంతాలు, పరిపాలనలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, సంస్కరణలకు ఆకర్షితులై వైసీపీ నుంచి పలువురు కీలక నాయకులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో శుక్రవారం జనసేన పార్టీలో చేరారు.
తుని నియోజకవర్గం వైసీపీ నాయకులు శ్రీ యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైసీపీ నాయకులు శ్రీ నవీన్ నిశ్చల్, వైసీపీ నాయకుడు, ఏలూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ శ్రీ పీవీఎల్ఎన్ నరసింహరాజు, వైసీపీ కందుకూరు, సర్వేపల్లి, కనిగిరి నియోజకవర్గాల పరిశీలకుడు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి అయితాబత్తుల సుభాషిణి, తుని వైసీపీ నాయకుడు శ్రీ పొలినాటి శేషగిరిరావు, తణుకు వైసీపీ నాయకుడు శ్రీ దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీ సత్రవాడ ప్రవీణ్, శ్రీ మిద్దెల హరి, �

24/09/2026

శ్రీ గారితో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ వంగవీటి మోహనరంగా గారి కుమారుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి ఇరువురి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో చోటుచేసుకున్న పలు అంశాలను వారు గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ గారు ప్రత్య

22/09/2026

గెలుపోటములు కాదు, నా దారి నాతోటే - Pawan Kalyan JanaSena Party Deputy CMO, Andhra Pradesh

22/09/2026

రెండో రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పర్యటన..
చేబ్రోలు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..
Pawan Kalyan JanaSena Party

22/09/2026

రెండో రోజు కొనసాగుతున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన..
చేబ్రోలు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు
JanaSena Party Pawan Kalyan

జనసేనలోకి ప్రత్తిపాడు మాజీ శాసన సభ్యులు శ్రీ వరుపుల సుబ్బారావు• కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ పవన్ కళ...
21/09/2026

జనసేనలోకి ప్రత్తిపాడు మాజీ శాసన సభ్యులు శ్రీ వరుపుల సుబ్బారావు
• కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు భారీగా జనసేనలో చేరికలు

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన మాజీ శాసన సభ్యులు, వైసీపీ నేత శ్రీ వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం పిఠాపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్, వైసీపీకి చెందిన నాయకుడు శ్రీ నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీమతి గంగిరెడ్డి అరుణ, రెండు మున్సిపాలిటీల పరిధిలోని మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. అందరికీ పార్టీ కండువాలు కప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో వీరంతా జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ, మాజీ శాసన సభ్యులు శ్రీ పెండెం దొరబాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ తోట సుధీర్, కౌడా ఛైర్మన్ శ్రీ తలాటం సత్య, పిఠాపురం ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు శ్రీ ఓదూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Pawan Kalyan JanaSena Party

21/09/2026

గౌరవ ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు శ్రీ గారి చేతులమీదుగా ప్రారంభం కానున్న పీఠికాపుర వనం.
JanaSena Party Pawan Kalyan

21/09/2026

పచ్చదనం పరిమళం.. పీఠికాపుర వనం ఆవిష్కారం
•నగర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ

గారు
•కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద రూ. 1.83 కోట్లతో నిర్మాణం
•ఆహ్లాదం, ఆధ్యాత్మికతల కలబోతగా పిఠాపురం నగర వనం
•ప్రత్యేక ఆకర్షణగా నక్షత్ర వనం, శివ పంచాయతన వనం
•70 సెంట్ల విస్తీర్ణంలో మియావకీ ప్లాంటేషన్‌ను ఆసక్తిగా తిలకించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
• ⁠ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 నగరవనాలు ప్రారంభించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Pawan Kalyan Kalyan voices

Address

Amaravati
Delhi

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Kalyan voices posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kalyan voices:

Shortcuts

Share