29/10/2026
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా సీఎం గారు!
⚡ క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ⚡
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో అర్నబ్ తుఫాన్ కారణంగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
చెయ్యేరు వద్ద తన కాన్వాయ్‌ను నిలిపివేసి, జరుగుతున్న పనులను సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరిశీలించారు. విద్యుత్ సరఫరా కోసం పునరుద్ధరణ పనులు వెంటనే పూర్తి చేసి నిరంతరాయంగా విద్యుత్ అందేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
విపత్తు సమయంలో అహోరాత్రులు శ్రమిస్తూ, ప్రజాసేవలో నిమగ్నమైన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది మరియు కార్మికుల కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అభినందించారు.