CPIML Liberation - Andhrapradesh

Directions Website

CPIML Liberation - Andhrapradesh ఈ పేజీ సీపీఐ యమ్ యల్ లిబరేషన్ ఆంధ్రప్రదేశ్

*విద్యార్థి సమస్యల నుంచి దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ వరకు ప్రతి పోరాటంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి**_____AISA జాతీయ ...
16/11/2026

*విద్యార్థి సమస్యల నుంచి దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ వరకు ప్రతి పోరాటంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి*

*_____AISA జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రసంజిత్ కుమార్*

**అనంతపురం:** విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడటంతో పాటు దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించే ఉద్యమాల్లో కూడా విద్యార్థులు చురుకుగా భాగస్వాములు కావాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రసంజిత్ కుమార్ పిలుపునిచ్చారు.

ఈరోజు అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో AISA ఆంధ్రప్రదేశ్ రెండవ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రసంజిత్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో విద్యారంగ ప్రైవేటీకరణ, కాషాయీకరణ, కేంద్రీకరణ వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్య వాతావరణం దెబ్బతింటోందని, విద్యార్థుల ప్రశ్నించే హక్కును, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ విద్యారంగం, రైతులు, కార్మికుల హక్కులు, అట్టడుగు వర్గాల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. మతపరమైన విభజనను పెంచుతూ, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లను విద్యార్థుల స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య హక్కులకు వ్యతిరేకమైన కేంద్రాలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

AISA మొదటి నుంచీ "లడో పడాయీ కరనే కో, పఢో సమాజ్ బదల్నే కో" (చదువు కోసం పోరాడండి, సమాజాన్ని మార్చడానికి చదవండి) అనే నినాదంతో విద్యార్థి వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ AISA 23 రోజుల పాటు జరిగిన ఆందోళనను గుర్తుచేశారు. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తూ AISA జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా బోరా పోరాటం కొనసాగిస్తున్నారని అన్నారు.

ఈ మహాసభలకు పరిశీలకురాలిగా హాజరైన AISA జాతీయ ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ లేఖ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో బీజేపీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ ప్రక్రియను దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రజల ఓటు హక్కుకు ముప్పు కలిగిస్తున్నారని అన్నారు. మహిళా నాయకత్వం, మహిళా కార్యకర్తల భాగస్వామ్యం ఉద్యమాలకు ఎంతో అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ(యమ్ యల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఉదయ్ కిరణ్ మహాసభలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో AISAను మరింత విస్తరించి, విద్యార్థుల సమస్యలపై బలమైన ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
మరోవైపు, అమరావతిలో పెట్టుబడుల పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలకు అనేక రాయితీలు కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, అదే విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల కార్యకలాపాలపై నిషేధాలు విధించడం ద్వారా విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని అన్నారు. విద్యార్థులను స్వతంత్రంగా ఆలోచించే పౌరులుగా కాకుండా, తమకు అనుకూలంగా ఉండేలా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు.

**మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక**

రెండవ రాష్ట్ర మహాసభల ముగింపులో AISA ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. నూతన రాష్ట్ర కార్యదర్శిగా కామ్రేడ్ ఎస్. నాగార్జున, రాష్ట్ర అధ్యక్షుడిగా కామ్రేడ్ అప్పలస్వామిని మహాసభ ఎన్నుకుంది..జాయింట్ సెక్రటరీలుగా గౌతమి, పునీత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సాయి పవన్,అనిల్, మహేష్ లను ఆఫీస్ బేరర్స్ గా
వీరితో పాటు మరో 6 మందిని మొత్తంగా 15 మంది నూతన రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

విద్యారంగ ప్రైవేటీకరణ, కాషాయీకరణ, కేంద్రీకరణకు వ్యతిరేకంగా, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని మహాసభ పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో సిపిఐ ( ఎం ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి వేమన, నాయకులు వలి,పరుశురాముడు, సుజాతమ్మ,శివ కుమార్ , బాలకృష్ణ, వివిధ జిల్లా నుండి AISA నాయకులు తదితరులు పాల్గొన్నారు..

🚩 ఎర్రజెండా విజయకేతనం! 🚩కాకినాడ జిల్లా – పత్తిపాడు మండలం – చింతలూరు గ్రామంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఘన విజయం!ఎంపీటీసీ అభ్...
08/11/2026

🚩 ఎర్రజెండా విజయకేతనం! 🚩

కాకినాడ జిల్లా – పత్తిపాడు మండలం – చింతలూరు గ్రామంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఘన విజయం!

ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కామ్రేడ్ భూరా శ్రీను గారు విజయం సాధించారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ఎర్రజెండా ముద్దుబిడ్డను ఆదరించి, అఖండ విజయాన్ని అందించిన చింతలూరు గ్రామ ఓటరు మహాశయులకు విప్లవ జేజేలు!

ఈ విజయం ప్రజా పోరాటాలకు, పేదలు, రైతులు, కార్మికుల హక్కుల ఉద్యమాలకు మరింత స్ఫూర్తినిస్తుంది.

ఎర్రజెండా గెలుపు – ప్రజా పోరాటాల గెలుపు!

విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ విప్లవ అభివందనాలు!

🚩 సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ 🚩

01/11/2026

*సీపీఐ (యమ్ యల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య, నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన ‘ఓటు బచావో – దేశ్ బచావో’ భారీ ర్యాలీలో ప్రసంగించారు.*

‘ఓటు చోర్’ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని ఈ ర్యాలీలో డిమాండ్ చేశారు.

ఇండియా కూటమి పిలుపు మేరకు నిర్వహించిన‘ఓటును కాపాడండి – దేశాన్ని రక్షించండి’కార్యక్రమంలో సిపిఐ (యమ్ యల్) లిబరేషన్ పార్టీ ...
01/11/2026

ఇండియా కూటమి పిలుపు మేరకు నిర్వహించిన

‘ఓటును కాపాడండి – దేశాన్ని రక్షించండి’

కార్యక్రమంలో సిపిఐ (యమ్ యల్) లిబరేషన్ పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య, నాయకులు, AISA జాతీయ అధ్యక్షరాలు కామ్రేడ్ నేహా బోరా, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రసంజిత్ కుమార్ పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి! జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి!

**ముఖ్య ప్రకటన | 30.10.2026****కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్య కన్నుమూశారు**సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పొలిట్‌బ్యూరో సభ్యులు, పార...
31/10/2026

**ముఖ్య ప్రకటన | 30.10.2026**

**కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్య కన్నుమూశారు**

సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పొలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్య 'శంభూజీ' (07.03.1942 – 30.10.2026) ఈ రోజు రాత్రి పాట్నాలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు.

ఆయన మరణం పార్టీకీ, విప్లవోద్యమానికీ తీరని లోటు. కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్యకు పార్టీ తన ఎర్ర జెండాను వంచి నివాళులు అర్పిస్తోంది. ఆయన అసంపూర్తిగా వదిలివెళ్లిన లక్ష్యాన్ని పూర్తి అంకితభావంతో, ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేస్తోంది.

ఆయన అంత్యక్రియలు నవంబర్ 2న పాట్నాలో జరుగుతాయి.

**కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్యకు లాల్ సలామ్!**

— కేంద్ర కమిటీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్

లిబరేషన్ తెలుగు వార పత్రిక
22/10/2026

లిబరేషన్ తెలుగు వార పత్రిక

  CPIML liberation
17/10/2026

CPIML liberation

ప్రెస్ కాన్ఫరెన్స్ | ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా | అక్టోబర్ 15జంతర్ మంతర్ వద్ద మన జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం న...
15/10/2026

ప్రెస్ కాన్ఫరెన్స్ | ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా | అక్టోబర్ 15

జంతర్ మంతర్ వద్ద మన జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరం కాదు!

సౌరవ్, ఆశుతోష్‌లను వెంటనే విడుదల చేయాలి!

SIR బాధితులకు న్యాయం చేయాలి – బాధ్యులైన వారిని జవాబుదారీగా నిలదీయాలి!

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ని రద్దు చేయండి! భారత ఎన్నికల కమిషన్(ECI)ని పునర్ వ్యవస్థీకరించండి!     స్వతంత్ర భా...
13/10/2026

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ని రద్దు చేయండి!
భారత ఎన్నికల కమిషన్(ECI)ని పునర్ వ్యవస్థీకరించండి!

స్వతంత్ర భారతదేశంలో గాంధీ జయంతిని ప్రజలు నిరసన దినంగా ఇంత పెద్దఎత్తున జరుపుకోవడం ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. నిరాయుధులైన సామాన్య ప్రజల శాంతియుత సామూహిక నిరసనకు ఉన్న శక్తికి ప్రతీకగా నిలిచిన నాయకుడిగా గాంధీని ప్రపంచమంతా గుర్తిస్తుంది. గాంధీ 157వ జయంతి సందర్భంగా ఈ ఏడాది ఆ వారసత్వం దేశవ్యాప్తంగా నిజంగా ప్రాణం పోసుకుంది. ఢిల్లీలో జంతర్ మంతర్‌ను అబేద్యమైన కోటలా మార్చి, భారీగా భద్రతా బలగాలను మోహరించి భయపెట్టినా, వందలాది మంది విద్యార్థి కార్యకర్తలు, ఇతర పౌరులు వాటిని ధిక్కరించారు. పదే పదే క్రూరంగా అరెస్టయినా, పోలీసు బస్సుల నుంచి తప్పించుకుని మళ్లీ నిరసనల్లో చేరారు. ముంబైలో జనమంతా కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ దృశ్యాలు రాబోయే ఏళ్లపాటు మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ప్రజలు గాంధీ శాంతియుత పోరాట వారసత్వాన్ని ఎత్తిపట్టగా, ఈనాటి ప్రభుత్వం మాత్రం బలప్రయోగంతో పాలించే బ్రిటిష్ వలసపాలన పద్ధతిని మళ్లీ తెరపైకి తెచ్చింది.

జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, SIR ని రద్దు చేయాలని, దుర్మార్గంగా తొలగించిన ప్రతి ఓటరు ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒక ఉమ్మడి నినాదంగా మారింది. అంతేకాదు, ప్రభుత్వానికి తనకు నచ్చిన ఎన్నికల సంఘాన్ని ఎంచుకునే స్వేచ్ఛనిచ్చి, ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ కల్పించి వారిని చట్టానికే అతీతులను చేసిన 2023 చట్టాన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన సంచలన పరిశోధనాత్మక కథనం, ఆ తర్వాత ఎన్నికల సంఘం చేపట్టిన 'నష్ట నివారణ' ప్రయత్నాలు ప్రజల్లో చాలాకాలంగా ఉన్న ఆగ్రహాన్ని మరింత బలపరిచాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కేంద్ర ఎన్నికల కమిషన్ లోని ఇతర ఎన్నికల కమిషనర్లను పక్కన పెట్టేశారని, ఓటర్ల జాబితాను శుభ్రం చేస్తున్నామనే పేరుతో SIR ద్వారా అధికారాన్ని బాహాటంగా కేంద్రీకరించి, సాఫ్ట్‌వేర్ ద్వారా మార్పులు చేస్తున్నారని ఆ కథనం బయటపెట్టింది. ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ జారీ చేస్తున్న ప్రతి సర్క్యులర్ కూడ, రాజ్యాంగ విరుద్ధమైన SIR ప్రక్రియ ద్వారా భారత ఎన్నికల ప్రజాస్వామ్యం మీద, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే మౌలిక సూత్రం మీద వ్యవస్థీకృతంగా భారీ మోసం జరిగిందనడానికి రుజువుగానే నిలుస్తోంది.

13 కోట్లకు పైగా ఓటర్లను ఓటు హక్కు నుంచి తొలగించారనే విషయం ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటుండగా, 'మిగిలిపోయిన' ఓటర్లందరినీ నెల రోజుల్లో సంప్రదించాలని భారత ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల CEO లను ఆదేశించింది! ఓటర్లు పెద్దఎత్తున తొలగిపోయిన వాస్తవం గురించి భారత ఎన్నికల కమిషన్ కు ఇప్పుడే ఎందుకు మెలకువ వచ్చింది? ECI ఆదేశాల్లోని 'మిగిలిపోయిన' (left-out) అనే మాట నిజానికి ఇష్టానుసారంగా, ఒక దుర్మార్గమైన లక్ష్యం పెట్టుకుని చేసిన తొలగింపులను కప్పిపుచ్చే మాటే. ఎన్నికల సమీకరణాన్ని BJP, దాని మిత్రపక్షాలకు అనుకూలంగా మార్చేందుకే ఇదంతా చేశారు. అక్టోబర్ 1న ఎన్నికల సంఘం ఈ తాజా సర్క్యులర్ ఇస్తున్న సమయంలోనే, పాట్నాలో CPI(ML) కార్యకర్తలు తొలగింపునకు గురైన ఓటర్లతో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసిన ఇరవై నియోజకవర్గాల్లోని పది నియోజకవర్గాలలో ఎంపిక చేసిన యాభై బూత్‌లలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పార్టీ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేశారు. ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ BLO లను చేయమని చెప్పిన పనినే వారు చేశారు. అంటే SIR తర్వాత ఓటర్ల జాబితాను, SIR కు ముందు 2025 జూన్ నాటి జాబితాతో పోల్చి, తొలగించిన ఓటర్లను గుర్తించారు. తప్పుగా తొలగించిన ఓట్లు 17 శాతం ఉన్నాయని ఈ సర్వేలో తేలి అందరినీ నివ్వెరపరిచింది.

ఓటర్ల జాబితాలో పేర్లను పెద్దఎత్తున తొలగించడానికి, కావాల్సిన వాళ్ల పేర్లను మాత్రమే ఎంపిక చేసి చేర్చడానికి BJP, ECI కలిసి ఫారం 6, ఫారం 7 లను ఆయుధాలుగా వాడుకున్నాయి. ఫారం 6 లో చేసిన మార్పులు భారత ఎన్నికల కమిషన్ లోని ఇద్దరు కమిషనర్ల అనుమతి లేకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇష్టారాజ్యంగా, చట్టవిరుద్ధంగా చేసినవని బయటపడ్డాయి. ఫారంలోని నిబంధనలను మార్చే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. దీంతో ఎన్నికల సంఘం ఎలాంటి వివరణా ఇవ్వకుండా ఆ వివాదాస్పద నిబంధనలను వెనక్కి తీసుకుంది. ఫారం 6 లో చేసిన మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందని ఎన్నికల సంఘం చెప్పుకునే ప్రయత్నాన్ని స్వయంగా CJI సూర్యకాంత్ ఖండించారు. జెన్ - జెడ్ ఓటర్లు ఓటర్ల జాబితాలో చేరకుండా అడ్డుకోవడానికే ఈ మార్పులు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటిసారి ఓటు వేసేవారు చట్టప్రకారం ఓటర్ల జాబితాలోకి ప్రవేశించడానికి ఉద్దేశించిన ఫారం 6 ను, తొలగించిన ఓటర్లు మళ్లీ జాబితాలో చేరాలంటే నింపాల్సిన ఫారంగా మార్చి ECI దుర్వినియోగం చేస్తోంది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. మొదటి రోజు నుంచే అభ్యంతరాలు వచ్చినా ఈ అక్రమ పద్ధతిని ECI కొనసాగిస్తూనే ఉంది.

అంతకన్నా దుర్మార్గం, అర్హులైన ఓటర్లను తొలగించడానికి ఫారం 7 ను అనూహ్యమైన స్థాయిలో దుర్వినియోగం చేయడం. ముఖ్యంగా ముస్లిం ఓటర్లను, BJP కి దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ముందే నింపిన ఫారం 7 కట్టలను స్వాధీనం చేసుకున్న ఘటనలు అనేకం బయటపడ్డాయి. ఫారం 7 ఆధారంగా వచ్చిన ఫిర్యాదుల మీద ఓటర్లను తొలగించిన ప్రతి సందర్భంలోనూ, సంబంధిత ఓటర్లకు సరైన నోటీసులు ఇవ్వాలి, సమాధానం చెప్పుకునే అవకాశమూ కల్పించాలి. కానీ భారీ స్థాయిలో తొలగింపునకు గురైన ఓటర్లకు ఎదురైన అనుభవం ఇది కాదు. ఈ విధంగా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వేధించిన అత్యంత దిగ్భ్రాంతికరమైన తీరు పశ్చిమ బెంగాల్‌లో కనిపించింది. అప్పిలేట్ ట్రైబ్యునల్ నెంబర్ 11 ఛైర్మన్ పదవికి ఇప్పుడు రాజీనామా చేసిన రిటైర్డ్ జస్టిస్ ఇంద్రజిత్ ఛటర్జీ ఒక విషయం వెల్లడించారు. న్యాయాధికారులు సైతం అర్హులని తేల్చిన ఓటర్లను తొలగించాలని కోరుతూ, పశ్చిమ బెంగాల్ అదనపు ముఖ్య ఎన్నికల అధికారి స్వయంగా 2.54 లక్షల ఫారం 7 అప్పీళ్లను తన ట్రైబ్యునల్ ముందు దాఖలు చేశారని ఆయన చెప్పారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని 19 ట్రైబ్యునళ్ల ముందు ఉన్న 16,10,311 తొలగింపు అప్పీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో, వాటికి అనుమతి ఎవరిచ్చారో తనకు గానీ, తోటి ఎన్నికల కమిషనర్ వివేక్ జోషికి గానీ, బెంగాల్ CEO కి గానీ ఏమాత్రం తెలియదని ఎన్నికల కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు ఫిర్యాదు చేశారు.

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంస్థాగత నిర్మాణం, అధికారాల విభజన సిద్ధాంతం, పరస్పర నియంత్రణ వ్యవస్థ (checks and balances) వలసపాలన తర్వాతి భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలబడటానికి కేంద్రబిందువులుగా ఉన్నాయి. ఇప్పుడు అవి తమ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల సంఘాన్ని అడ్డుకోగలిగిన, అడ్డుకోవాల్సిన సుప్రీంకోర్టు, ఈ భారీ ఎన్నికల మోసానికి పాల్పడేందుకు దానికి దాదాపు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసింది. 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' బిల్లులను పరిశీలిస్తున్న ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ, సుప్రీంకోర్టు మధ్య అక్టోబర్ 6న ఒక సమావేశం జరపాలని ప్రతిపాదించారు. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య ఉండాల్సిన గీత చెరిగిపోయే ఆ దిగ్భ్రాంతికర పరిణామం ఇప్పుడు తప్పనిసరై వాయిదా పడింది. రాజ్యాంగ సంస్థల నుంచి ఏమాత్రం అండలేని ఈ పరిస్థితుల్లో, భారత ప్రజాస్వామ్య మనుగడ పూర్తిగా భారత ప్రజల పరిణతి మీద, వారి అప్రమత్తత మీద ఆధారపడి వుంది. అదే విధంగా BJP యేతర రాజకీయ శక్తులు, పౌర సమాజం, ప్రత్యామ్నాయ మీడియా మీద ఆధారపడి ఉంది. ఆలస్యంగా అయినా సెప్టెంబర్ 30 న జరిగిన ఇండియా కూటమి సమావేశం, వామపక్ష విద్యార్థి కార్యకర్తలు, ఇతర జెన్ Z నిరసనకారులు, ప్రగతిశీల పౌరులు, ప్రత్యామ్నాయ మీడియా కార్యకర్తలు, NDA యేతర ప్రతిపక్ష పార్టీలలో పెరుగుతున్న గళం, ఫాసిస్టు పట్టును బద్దలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని దృఢంగా నిలబెడతామనే ఆశను చూపుతున్నాయి.

Address

26-7-13/, Garikapati Vari Veedi, Gandhinagar
Vijayawada
520003

Alerts

Be the first to know and let us send you an email when CPIML Liberation - Andhrapradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share